75 ఎలుకలు, 1500 ఈగలతో రష్యా సంచలన ప్రయోగం.. కారణం ఇదే..!
అంతరిక్ష పరిశోధనల్లో ఇప్పటికే ఎన్న ఘనతలు సాధించింది రష్యా. మరోసారి చరిత్ర సృష్టించింది. రష్యా కు చెందిన బయోలాజికల్ రీసెర్చ్ శాటిలైట్ నోహ్ ఆర్క్.. 75 ఎలుకలు, 1500 ఈగలతో అంతరిక్ష ప్రయాణం నిర్వహించి విజయవంతంగా భూమి మీదకు చేరుకుంది. దాదాపు 30 రోజులు అంతరిక్షంలోనే పరిశోధనలు జరిపిన అనంతరం సెప్టెంబర్ 19న భూమి మీదకు విజయవంతంగా ల్యాండింగ్ అయింది. ఈ ఎయిర్ క్రాఫ్ట్ లో 75 ఎలుకలు, 1500 ఈగలతోపాటుగా సెల్ కల్చర్స్, మైక్రో ఆర్గనిజమ్స్, ప్లాంట్ సీడ్స్ ను అంతరిక్షంలోకి మోసుకెళ్లింది. అలా విజయవంతంగా వాటిని వెనక్కి తీసుకొచ్చింది.
సోయిజ్ 2.1 బీ రాకెట్ ద్వారా ఈ శాటిలైట్ కజకిస్థాన్‌లోని బైకోనూర్ కాస్మోడ్రోమ్ ప్రాంతంనుంచి ఆగస్టు 20న నింగిలోకి పంపించింది రష్యా అంతరిక్ష సంస్థ రాస్ కాస్మోస్. లాంఛింగ్ తర్వాత ఈ ఎయిర్ క్రాఫ్ట్ పోలార్ ఆర్బిట్ 230 నుంచి 236 మైల్స్ వద్ద కక్ష్యలోకి ప్రవేశించింది. 97 డిగ్రీల ఇన్ క్లినేషన్ వద్ద బయోన్- ఎం నెం. 2 పే లోడ్ లో తీసుకెళ్లిన స్పెసిమెన్స్ ను హై లెవెల్ కాస్మిక్ రేడియేషన్ ముందు ఉంచారు. వాడి నాడీ వ్యవస్థలను పరిశీలించారు.
బయోన్- ఎం నెం. 2 మిషన్ ను రష్యా అంతరిక్ష సంస్థ రాస్ కాస్మోస్, రష్యన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అండ్ ది ఇన్ స్టిట్యూట్ ఆఫ్ బయోమెడికల్ ప్లాబ్లమ్స్ ఆఫ్ ది రష్యన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ సంయుక్తంగా నిర్వహించాయి. అంతరిక్షంలోకి తీసుకెళ్లిన ఈ జీవులను ఐబీఎంపీ ల్యాబోరేటరీస్ కు సెప్టెంబర్ 20 అర్ధరాత్రి తరలించారు. ఇక ఈ పరిశోధన మొత్తం 10 సెక్షన్ లుగా ఉంది.

మొదటి రెండు సెక్షన్లు జంతువులపై గురత్వాకర్షణ, రేడియేషన్ శక్తుల ప్రభావాలు అధ్యయనం చేయనున్నాయి. మూడు నుంచి ఐదు సెక్షన్లు మొక్కలు, మైక్రో ఆర్గనిజమ్స్ బయోలైఫ్ ను పరిశీలించనున్నాయి. ఆరు నుంచి తొమ్మిది విభాగాలు బయోటెక్నాలజీ, టెక్నలాజికల్, ఫిజికల్, రేడియో బయోలాజికల్, డోసిమెట్రిక్ పరిశోధనలు చేయనున్నాయి. ఇక టెన్త్ సెక్షన్ రష్యన్ ఫెడరేషన్, రిపబ్లిక్ ఆఫ్ బెలారస్ నుంచి వచ్చిన విద్యార్థుల ప్రయోగం కోసం కేటాయించారు.












Click it and Unblock the Notifications