ప్రపంచంలోనే తొలి 8300mAh బ్యాటరీ ఫ్లాగ్‌షిప్ మొబైల్.. OnePlus Ace 6T లాంఛ్ అప్పుడే !
చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ వన్‌ప్లస్.. స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో మంచి పేరు పొందింది. వినియోగదారులకు ప్రీమియమ్ అనుభవం అందించడమే లక్ష్యంగా పనిచేసే ఈ సంస్థ.. ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీలను పరిచయం చేస్తూ ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే లేటెస్ట్ గా ఫ్లాగ్‌షిప్ సెగ్మెంట్‌లో మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకునేందుకు సిద్ధం అవుతోంది.
భారత్ లో స్మార్ట్ ఫోన్ బ్రాండ్ లలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది వన్‌ప్లస్. ఇప్పుడు లేటెస్ట్ గా మరోసారి టెక్ ప్రపంచాన్ని తమ వైపు తిప్పుకుంటుంది. డిసెంబర్ 3న OnePlus Ace 6T స్మార్ట్ ఫోన్ ని చైనాలో విడుదల చేయనుంది. ఇప్పటికే రికార్డులు బద్దలుకొడుతూ హైప్‌ను రెట్టింపు చేస్తోంది ఈ మొబైల్. ఇది కేవలం కొత్త ఫోన్ మాత్రమే కాదు... ఫ్లాగ్‌షిప్ మార్కెట్‌కే కొత్త బెంచ్ మార్క్ అంటూ కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది. ప్రపంచంలోనే తొలి 8300mAh బ్యాటరీతో వచ్చే ఫ్లాగ్‌షిప్ మొబైల్ గా టెక్ ప్రియులను ఆకర్షిస్తోంది.

OnePlus Ace 6T ఫీచర్స్..
బ్యాటరీ..
- వన్‌ప్లస్ ఏస్ 6టీలో గమనించే మొదటి విషయం - 8300mAh అల్ట్రా-లార్జ్ బ్యాటరీ.
- ఇంత భారీ సామర్థ్యంతో వచ్చే ఫ్లాగ్‌షిప్ ప్రపంచంలో ఇదే మొదటి ఫోన్.
- ఒకసారి ఛార్జ్ చేస్తే 2 రోజుల వరకు ఈజీగా కొనసాగుతుంది
- గేమింగ్, వీడియో ఎడిటింగ్, 5G యూజ్ చేసినా కూడా హీటింగ్ తక్కువ
- పవర్ బ్యాంక్ అవసరం దాదాపు ఉండదు
- పైగా 100W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ - అంటే 10 నిమిషాల చార్జింగ్ తో వంద శాతం కంప్లీట్ చేస్తోంది.
సాఫ్ట్‌వేర్..
- ColorOS 15 / OxygenOS 15 (Region Based)
- Android 15 అవుట్-ఆఫ్-ది-బాక్స్
ప్రాసెసర్..
ఈ ఫోన్ ప్రపంచంలోనే Snapdragon 8 Gen 5 చిప్‌సెట్‌తో వచ్చే మొదటి మొబైల్.
పర్ఫార్మెన్స్ ..
AnTuTu 11 స్కోర్: 3.56 మిలియన్ - ఇప్పటి వరకు ఏ ఫోనూ సాధించని స్కోర్
AI పనితీరు, గ్రాఫిక్స్, పవర్ ఆప్టిమైజేషన్‌లో కొత్త లెవల్
హై-ఎండ్ గేమ్స్ Ultra సెట్టింగ్స్‌లో కూడా లాగ్ లేకుండా నడుస్తాయి
డిజైన్..
వన్‌ప్లస్ ఏస్ 6టీ డిజైన్ పరంగా కూడా దూసుకుపోయింది.
మెటల్ ఫ్రేమ్ - ఫ్రెష్, డ్యూయబుల్, ప్రీమియమ్
సిల్క్ గ్లాస్ & ఫైబర్‌గ్లాస్ ఫినిష్ - చేతిలో పట్టుకున్నా కంఫర్ట్, లుక్ టాప్ క్లాస్
కలర్స్..
ఫ్లాష్ బ్లాక్
ఫాంటమ్ గ్రీన్
ఎలక్ట్రిక్ పర్పుల్
కెమెరా..
డ్యూయల్-రియర్ కెమెరా సెటప్ ఉంది. 50MP మెయిన్ సెన్సార్‌తో పాటు 8MP అల్ట్రావైడ్ యూనిట్ కూడా ఉంటుంది.
సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫోన్ ముందు భాగంలో 16MP కెమెరాను అమర్చారు
డిస్‌ప్లే..
165Hz AMOLED - అల్ట్రా నారో బెజెల్స్
స్క్రోల్, గేమింగ్, అనిమేషన్స్ అన్నీ బట్టర్ స్మూత్
అల్ట్రా-నారో బెజెల్స్ - స్క్రీన్ టు బాడీ రేషియో హై
కొత్త షార్ట్‌కట్ కీ..
అలర్ట్ స్లైడర్ స్థానంలో వన్‌ప్లస్ కొత్త ప్రయోగం
స్టోరేజ్..
డేటాబేస్ జాబితా ప్రకారం, వన్‌ప్లస్ ఏస్ 6టీ 16GB వరకు ర్యామ్, 1TB వరకు స్టోరేజ్ వేరియంట్లలో లభించనుంది.
ఇవి అన్నీ ఉండటంతో ఈ ఫోన్ కేవలం కొత్త విడుదల మాత్రమే కాదు... 2025 ఫ్లాగ్‌షిప్ మార్కెట్‌ను షేక్ చేయబోయే అసలైన పవర్ హౌస్ అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications