భారీ బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్స్.. OPPO A5x 5G రూ.13,999 మాత్రమే !
మారుతున్న కాలానుగుణంగా ఫోన్ అనేది మనిషికి అలవాటు పడిన అంశం అయ్యింది. చిన్నారుల నుంచి పెద్దల వరకు ఫోన్ లేకపోతే సమయం గడవదు అనే స్థాయికి వచ్చేశారు. ఇక మార్కెట్ లో రోజుకో కొత్త ఫోన్ లాంఛ్ అవుతోంది. కస్టమర్లను ఆకర్షించడానికి తక్కువ ధరలోనే అధునాతన ఫీచర్లతో ఫోన్స్ లాంఛ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఒప్పో మొబైల్స్ భారత మార్కెట్లో మంచి పేరు సంపాదించుకున్న స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఫగా ఎదిగింది.
అయితే తాజాగా ఒప్పో కంపెనీ తన కొత్త 5G ఫోన్ OPPO A5x 5G ని భారతదేశంలో విడుదల చేసింది. గత సంవత్సరం వచ్చిన A3x 5G కి ఇది కొత్త వెర్షన్ లాగా వచ్చింది. తక్కువ ధరలో మంచి ఫీచర్లు, బలమైన బాడీ, పెద్ద బ్యాటరీతో ఈ ఫోన్ ఆకట్టుకుంటోంది. స్టైలిష్ డిజైన్, శక్తివంతమైన కెమెరా, నాణ్యమైన బిల్డ్ క్వాలిటీతో బడ్జెట్ రేంజ్ లోనే ఫ్లాగ్‌షిప్ రేంజ్ ఫీచర్స్ అందిస్తుండడంతో యూత్‌లో ఈ మొబైల్ కి మంచి డిమాండ్ నడుస్తోంది. ఆ మొబైల్ ఫీచర్స్ ఏంటో మీకోసం ప్రత్యేకంగా..

OPPO A5x 5G ఫీచర్స్..
డిస్ ప్లే..
సైజు: 6.67 అంగుళాల HD+ LCD స్క్రీన్
రిఫ్రెష్ రేట్: 120Hz - అంటే స్క్రీన్ స్మూత్‌గా పనిచేస్తుంది
బ్రైట్‌నెస్: 1000 నిట్స్ - వెలుతురులో కూడా క్లియర్‌గా కనిపిస్తుంది
డిజైన్..
బాడీ టెక్నాలజీ: 360° ఆర్మర్ బాడీ టెక్నాలజీ
బలమైన మెటీరియల్స్: హై స్ట్రెంత్ అలాయ్ ఫ్రేమ్, గ్లాస్ ఫినిష్
సర్టిఫికేషన్: MIL-STD-810H (తేమ, షాక్, వేడి లాంటివి తట్టుకునేలా)
వాటర్, డస్ట్ ప్రొటెక్షన్: IP65 రేటింగ్
బరువు: 193 గ్రాములు
మందం: 7.99 mm
ప్రాసెసర్..
చిప్‌సెట్: MediaTek Dimensity 6300 (6nm)
ర్యామ్..
RAM: 4GB + 4GB వర్చువల్ RAM
ఇంటర్నల్ స్టోరేజ్: 128GB
కెమెరా..
ఫ్రంట్ కెమెరా: 5MP సెల్ఫీ కెమెరా
బ్యాక్ కెమెరా: 32MP మెయిన్ కెమెరా
బ్యాటరీ..
సామర్థ్యం: 6000mAh
చార్జింగ్: 45W SuperVOOC ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్
ఆపరేటింగ్ సిస్టమ్..
OS: Android 15 ఆధారిత ColorOS 15
ఇతర ఫీచర్లు..
ఫింగర్ ప్రింట్ సెన్సార్: సైడ్ మౌంటెడ్
నెట్‌వర్క్: డ్యూయల్ 5G, డ్యూయల్ 4G VoLTE
Wi-Fi: 802.11ac
Bluetooth: 5.1
పోర్ట్: USB Type-C
ధర..
రూ. 13,999
వేరియంట్..
4GB RAM + 128GB స్టోరేజ్
కలర్స్..
మిడ్‌నైట్ బ్లూ, లేజర్ వైట్
లాంఛ్ డేట్..
మే 25 నుంచి Amazon, Flipkart, Oppo స్టోర్, రిటైల్ స్టోర్స్ లలో అందుబాటులో ఉంటుంది. లాంచ్ ఆఫర్లు కింద రూ. 1000 ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్, 3 నెలల నో-కాస్ట్ EMI (SBI, IDFC First, BOB, Federal, DBS బ్యాంకులతో) అందిస్తుంది.












Click it and Unblock the Notifications