రేపు, ఎల్లుండి ఆకాశంలో ఓ అద్భుతం: తారాజువ్వలు- డోన్ట్ మిస్

జెమినిడ్ ఉల్కాపాతం.. ఓ అద్భుత ఖగోళ సంఘటన. రాత్రివేళ ఆకాశంలో షూటింగ్ స్టార్స్ ఆవిష్కృతమౌతుందా సమయంలో. లెక్కలేనన్ని ఉల్కాపాతాలు కళ్ల ముందు రాకెట్లల్లా రివ్వుమంటూ దూసుకెళ్తాయి. క్షణాల్లో మటుమాయమౌతాయి. దీన్ని చూడటానికి లక్షలాదిమంది ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తుంటారు.. ప్రపంచవ్యాప్తంగా. తమ కెమెరాలతో రెడీ ఉంటారు. సెకెన్ల వ్యవధిలో నేలరాలిపోయే ఉల్కాపాతాన్ని క్లిక్ మనిపించడానికి సిద్ధంగా ఉంటారు.

ఆ క్షణం రానేవచ్చింది. ఈ నెల 13, 14.. అంటే శని, ఆదివారాల్లో రాత్రివేళ నిశ్శబ్దాకాశంలో ఈ ఉల్కాపాతం కనువిందు చేయబోతోంది. సాధారణంగా మెజారిటీ ఉల్కలు తోకచుక్కల నుండి రాలిపోతుంటాయి. జెమినిడ్‌ మాత్రం 3200 ఫేథాన్ అనే గ్రహశకలం నుండి ఉద్భవిస్తాయి. అదే వీటిని ప్రత్యేకంగా నిలుపుతుంది. గ్రహశకలాలు కామెట్‌ల ధూళి కంటేని పోలి ఉంటాయి. జెమినిడ్ ఉల్కలు మాత్రం వాటి కంటే ప్రకాశవంతంగా, కాస్త నెమ్మదిగా కదులుతాయి.

Peak Meteor Shower Geminids Illuminate the Night This Dec 13-14

వీటిని చూడటం సులభం. దృశ్యపరంగా మరింత ఆకర్షణీయంగా ఉంటాయి. సాధారణ ఉల్కలు భూఉత్తరార్ధగోళంలో బాగా కనిపిస్తాయి. జెమినిడ్స్ దక్షిణార్ధగోళం కూడా కనువిందు చేస్తాయి. చాలా ప్రాంతాల నుండి అవి చేసే సందడిని వీక్షించవచ్చు. ప్రపంచవ్యాప్తంగా స్కై గేజర్లకు ఇదో గొప్ప ఈవెంట్. ప్రతి డిసెంబర్‌లో కొన్ని రోజుల పాటు జెమినిడ్‌ ఉల్కలు చాలా యాక్టివ్ గా ఉంటాయి. ఈ నెల 13, 14 తేదీల్లో అత్యంత ప్రకాశవంతంగా ఇవి కనిపించనున్నాయి. 20, 21వ తేదీ వరకు కొనసాగవచ్చు. దీన్ని పీక్ టైమ్ గా చెప్పుకోవచ్చు.

అర్ధరాత్రి నుండి తెల్లవారు జామున 4 గంటల వరకు ఉల్కల సంఖ్య అసాధారణంగా ఉంటుంది. ఆకాశం క్లియర్ ఉన్న ఏ రాత్రి సమయం అయినా ఉల్కాపాతాన్ని వీక్షించడానికి అనుకూలమే. ఈ ఉల్కలు మిథున (జెమిని) రాశి.. ప్రత్యేకించి ఇందులోని అత్యంత ప్రకాశవంతమైన నక్షత్రం క్యాస్టర్ సమీపం నుండి దూసుకెళ్తుంటాయి. అందుకే వీటికి జెమినిడ్స్ అంటారు. వీటిని చూడటానికి బైనాక్యులర్స్ లేదా టెలిస్కోప్‌ కూడా అవసరం లేదు.

ఈ విశాల గగనంలో జెమినిడ్ ఉల్కలు ఎక్కడైనా కనిపిస్తాయి. సెకెన్ల వ్యవధిలో మటుమాయమౌతుంటాయి. అందుకే- వీటిని నేరుగా చూడటమే ఉత్తమం. టెలిస్కోప్ లేదా కెమెరా లెన్స్ ద్వారా వీటిని చూడటానికి ప్రయత్నించడం అంటే సమయాన్ని వృథా చేసుకున్నట్టే. ప్రకాశవంతంగా చూడాలనుకుంటే నగర వెలుగులకు దూరంగా ఉండటం అత్యుత్తమం. చీకటి ప్రదేశాలకు వెళ్తే అవి చేసే కోలాహలాన్ని కనులారా వీక్షించవచ్చు.

చీకటి ఆకాశం, విస్తృత క్షితిజాల కారణంగా భారత్ లోని కొన్ని ప్రదేశాల్లో వీటిని మరింత మెరుగ్గా చూడొచ్చు. నీలగిరి కొండలు, పశ్చిమ కనుమలు, ఎత్తైన ప్రాంతాలు, నగరాలకు దూరంగా ఉన్న పొలాలు, విశాలంగా, నిర్మానుష్యంగా ఉండే బహిరంగ ప్రదేశాలు, కనిష్ట కాంతితో అద్భుతమైన జెమినిడ్ ఉల్కాపాతానికి అత్యంత అనుకూలం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+