Pink Full Moon 2024: నేటి రాత్రి నుంచే పింక్ ఫుల్ మూన్, ప్రత్యేకత ఏమిటంటే?
ఆకాశంలో నేటి రాత్రి (ఏప్రిల్ 23 అర్ధరాత్రి) నుంచి మరో అద్భుతం చోటు చేసుకోనుంది. పింక్ మూన్‌ను చూసేందుకు మరికొద్ది గంటల సమయమే ఉంది. మన దేశ కాలమానం ప్రకారం ఏప్రిల్ 24న అత్యంత ప్రకాశవంతమైన సంపూర్ణ చంద్రుడిని మనం చూడొచ్చు. అదే సమయంలో ఆకాశంలో లిరిడ్ ఉల్కాపాతం కూడా ఏర్పడనుంది. కాగా, ఈ పింక్ మూన్‌కు పలు ప్రత్యేకతలు కూడా ఉన్నాయి.
పూర్ణమి వేళ ఈసారి దర్శనమిచ్చే పూర్ణ చంద్రుడికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఈసారి ఏర్పడే పూర్ణ చంద్రుడిని 'పింక్ మూన్' అని పిలుస్తారు. మన దేశ కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 5:19 గంటలకు పింక్ మూన్‌ను మనం చూడొచ్చు. అమెరికా, కెనడా సహా ఇతర తూర్పు దేశాల్లోనైతే మంగళవారం సాయంత్రం 7:49 గంటలకు పింక్ మూన్ కనిపిస్తుంది. మన దేశంలోని ఔత్సాహికులు ఒకవేళ ఈ అద్బుత దృశ్యాన్ని చూడాలని భావిస్తే బుధవారం ఉదయాన్నే నిద్రలేవాలి మరి.

బుధవారం ఉదయం 5:19 గంటలకు చంద్రాస్తమయం జరగడం ప్రారంభమవుతుంది. ఆ సమయంలో అత్యంత ప్రకాశవంతంగా మెరిసిపోతున్న సంపూర్ణ చంద్రుడిని మనం వీక్షించవచ్చు. అదే సమయంలో ఆకాశంలో లిరిడ్ ఉల్కాపాతం కూడా సంభవిస్తుంది. అంటే ఉల్కలు రాలడం కూడా మనకు కనిపిస్తుంది.
పింక్ మూన్ ఈసారి స్పైకా నక్షత్రం దగ్గరగా ఉన్న కన్య రాశిలో కనిపిస్తుందని నాసా అంచనా వేస్తోంది. కాగా, మంగళ, బుధ, గురువారాల్లో దీన్ని చూడొచ్చు. అయితే అత్యంత ప్రకాశవంతమైన సంపూర్ణ చంద్రుడిని చూడాలంటే మాత్రం మంగళవారమే(అమెరికా కాలమానం ప్రకారం) ఉత్తమ సమయం అని నాసా పేర్కొంది.
భారత్, శ్రీలంకలో పింక్ మూన్ విశిష్టత
మన దేశంలో పింక్ మూన్‌ను హనుమంతుని పవిత్రమైన జన్మదిన వేడుక(హనుమాన్ పుట్టినరోజు)తో ముడిపెట్టి చూస్తారు. శ్రీలంక ప్రజలు 'బక్ పోయా' పండుగతో ఈ ఫుల్‌మూన్‌కు సంబంధం ఉందని భావిస్తుంటారు. ఈ సంపూర్ణ చంద్రగ్రహణం రోజునే బుద్ధుడు శ్రీలంకను సందర్శించి తమ దేశంలో అంతర్యుద్ధాన్ని ఆపారని శ్రీలంకలోని బౌద్ధులు విశ్వసిస్తారు.

పింక్ మూన్ ఎలా అయ్యింది?: విదేశాల్లో నమ్మకాలు ఇలా..
విదేశాల్లోనూ ఈ పింక్ మూన్ నమ్మకాలు వేర్వేరుగా ఉన్నాయి. పింక్ మూన్ అంటే చాలామంది చంద్రుడి గులాబీ రంగులో కనిపిస్తాడని భావిస్తుంటారు. కానీ, అలాంటిదేం జరగదు. వసంత కాలంలో వచ్చే తొలి పున్నమిని ఇంగ్లిష్ వాళ్లు పింక్ మూన్ అని పిలుస్తారు. వసంత కాలం ప్రారంభం కాగానే ఉత్తర అమెరికా ప్రాంతంలోని అడవుల్లో వికసించే 'క్రీపింగ్ ఫ్లోక్స్' లేదా 'మోస్ ఫ్లోక్స్' అనే జాతి పువ్వులు గులాబి రంగులో ఉంటాయి. అందుకే ఈ సమయంలో వచ్చిన ఫుల్ మూన్‌కు పింక్ మూన్ అనే పేరు పెట్టడం గమనార్హం.
అమెరికాలోని వివిధ తెగలకు చెందిన ప్రాచీన శాస్త్రాల ప్రకారం ప్రతి పున్నమి చంద్రుడికి ఒక్కోపేరు ఉంది. వాటన్నింటిలోనూ చాలా ఫేమస్ ఈ పింక్ మూన్. అమెరికాలోని ప్రాచీన తెగ ఓగ్లాలా ఈ ఫుల్ మూన్‌ను 'రెడ్ గ్రాస్ అప్పీయరింగ్ మూన్' అని పిలుస్తుంటుంది. ఆ దేశానికే చెందిన ట్లింగిట్స్ అనే మరో తెగ ప్రజలు దీన్ని 'స్ప్రౌటింగ్ గ్రాస్ మూన్' అని పిలుస్తుంటారు. యూదులు పింక్ మూన్‌ను 'పాసోవర్ మూన్' అని పిలుస్తారు. పాసోవర్ మూన్ అంటే ఈస్టర్‌కు ముందు వచ్చే సంపూర్ణ చంద్రుడు అని అర్థం.
-
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
Hormuz: హార్ముజ్ లో అసలు నష్టం భారత్ కే? కేంద్రం షాకింగ్ ..! -
భారత్ కు మెషిన్ గన్స్ పంపించిన ఇజ్రాయెల్.. పాకిస్థాన్ పని ఖతం.. -
Hormuz: హార్ముజ్ కోసం రంగంలోకి 35 దేశాలు-భారత్ కీలక నిర్ణయం..! -
ఆంజనేయుడి దివ్యమంత్రం -
షుగరు బాధితులు వేసవిలో ఎలాంటి స్నాక్స్ తినాలి..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగుతున్నారా - అయితే, ఇది మీ కోసమే..!! -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!!











Click it and Unblock the Notifications