రూ.కేవలం 11 వేల లోపే.. POCO నుంచి రెండు కొత్త ఫోన్స్ లాంఛ్ !!
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో తక్కువ ధరకే మంచి ఫీచర్లను అందిస్తూ యువతలో ప్రత్యేక గుర్తింపు పొందిన POCO మరోసారి బడ్జెట్ సెగ్మెంట్‌లో తన దూకుడును కొనసాగించింది. ఎంట్రీ-లెవల్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని, కంపెనీ కొత్తగా POCO C81X, POCO C81 మోడళ్లను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. తక్కువ ధరలో పెద్ద డిస్‌ప్లే, భారీ బ్యాటరీ, AI ఫీచర్లు వంటి అంశాలతో ఈ ఫోన్లు మార్కెట్లో మంచి పోటీని సృష్టించేలా ఉన్నాయి.
కొత్త లాంచ్..
ఈ POCO C81 సిరీస్ ఫోన్లు ముఖ్యంగా రోజువారీ వినియోగం కోసం రూపొందించబడ్డాయి. స్టూడెంట్స్, మొదటిసారి స్మార్ట్‌ఫోన్ కొనేవారు, తక్కువ బడ్జెట్‌లో బెస్ట్ ఫోన్ కావాలనుకునే వారికి ఇవి సరైన ఎంపికగా కంపెనీ భావిస్తోంది. 4G కనెక్టివిటీతో వచ్చిన ఈ ఫోన్లు, బేసిక్ యూజ్‌తో పాటు స్మూత్ అనుభవాన్ని అందించేందుకు రూపొందించబడ్డాయి.

డిస్‌ప్లే & డిజైన్
POCO C81Xలో 6.88 అంగుళాల డిస్‌ప్లే ఉండగా, POCO C81లో 6.9 అంగుళాల పెద్ద స్క్రీన్ అందించారు. రెండు మోడళ్లలోనూ 120Hz రిఫ్రెష్ రేట్ ఉండటం వల్ల స్క్రోలింగ్ చాలా స్మూత్‌గా ఉంటుంది. C81లో 800 నిట్స్, C81Xలో 600 నిట్స్ బ్రైట్‌నెస్ ఉండటం వల్ల బయట వెలుతురులో కూడా క్లియర్ విజిబిలిటీ ఉంటుంది. 'వెట్ టచ్ టెక్నాలజీ 2.0', ఐ కంఫర్ట్ మోడ్ వంటి ఫీచర్లు యూజర్ ఫ్రెండ్లీ అనుభవాన్ని ఇస్తాయి.
పనితీరు (Performance)
ఈ ఫోన్లలో UNISOC T7250 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. డైలీ యూజ్, సోషల్ మీడియా, వీడియో స్ట్రీమింగ్ వంటి పనులకు ఇది సరిపోతుంది. 4GB వరకు ర్యామ్, అదనంగా వర్చువల్ ర్యామ్ సపోర్ట్ ఉండటం వల్ల మల్టీటాస్కింగ్ కూడా సులభమవుతుంది. సాఫ్ట్‌వేర్ పరంగా POCO C81 Android 16 ఆధారిత HyperOS 3పై, C81X Android 15 ఆధారిత HyperOS 2పై పనిచేస్తాయి. గూగుల్ జెమినీ, సర్కిల్ టు సెర్చ్ వంటి AI ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
కెమెరా
POCO C81 సిరీస్‌లో 13MP రియర్ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. సాధారణ ఫోటోగ్రఫీ, వీడియో కాల్స్‌కు ఇవి సరిపోతాయి. HDR+, నైట్ మోడ్ వంటి ఫీచర్లు లో-లైట్ ఫోటోగ్రఫీకి ఉపయోగపడతాయి. AI స్కై ఫీచర్ ద్వారా ఫోటోలను కస్టమైజ్ చేసుకోవచ్చు. డాక్యుమెంట్ మోడ్‌తో స్కానింగ్ సులభమవుతుంది.
బ్యాటరీ & ఛార్జింగ్
బ్యాటరీ ఈ సిరీస్‌లో హైలైట్. POCO C81Xలో 5200mAh బ్యాటరీ ఉండగా, POCO C81లో 6300mAh భారీ బ్యాటరీ ఉంది. ఒకసారి ఛార్జ్ చేస్తే రోజంతా ఉపయోగించుకునేలా ఉంటుంది. 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటం వల్ల తక్కువ సమయంలోనే ఛార్జ్ అవుతుంది.
ఇతర ఫీచర్లు
సైడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, ఫేస్ అన్‌లాక్, IP52 డస్ట్ & స్ప్లాష్ రెసిస్టెన్స్, డ్యూయల్ సిమ్, Wi-Fi, బ్లూటూత్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్ వంటి అన్ని బేసిక్ ఫీచర్లు అందించారు. స్టోరేజ్‌ను మెమరీ కార్డ్ ద్వారా విస్తరించుకునే అవకాశం కూడా ఉంది.
ధర & అందుబాటు..
POCO C81X (3GB + 64GB) ధర ₹9,999గా నిర్ణయించగా, POCO C81 (4GB + 64GB) ధర ₹10,999గా ఉంది. ఈ ఫోన్లు ఏప్రిల్ 27 నుండి Flipkartలో విక్రయానికి అందుబాటులోకి రానున్నాయి. బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్చేంజ్ డీల్స్‌తో మరింత తక్కువ ధరలో పొందే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications