Realme 15x 5G ఫీచర్స్ మామూలుగా లేవుగా.. ధర ఎంతంటే ?
\యువతరానికి దగ్గరైన స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గా చైనీస్ సంస్థ "రియల్‌మీ" ప్రత్యేకమైన గుర్తింపు పొందింది. లేటెస్ట్ గా భారత మార్కెట్‌లో కొత్త మోడల్ Realme 15x 5Gను అధికారికంగా విడుదల చేసింది. 7,000mAh బ్యాటరీ, 50MP సోనీ AI కెమెరా, IP69 రేటింగ్, 144Hz డిస్‌ప్లే వంటి ఫీచర్లతో టెక్ ప్రియులను ఆకర్షిస్తోంది.
కాగా ఈ స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధరను రూ.16,999గా నిర్ణయించారు. రూ.20 వేల లోపే ఈ వస్తుండడంతో Redmi Note 14 Pro, iQOO Z9x, Samsung Galaxy M15 5G వంటి ఫోన్లతో పోటీ పడనుందని అంచనా వేస్తున్నారు. ఈ ఫోన్ ఫీచర్స్ ఏంటో మీకోసం ప్రత్యేకంగా..

Realme 15x 5G ఫీచర్లు..
బ్యాటరీ & ఛార్జింగ్..
Realme 15x 5Gలో 7,000mAh భారీ బ్యాటరీని అందించారు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే రెండ్రోజుల వరకు సులభంగా ఉపయోగించుకోవచ్చని కంపెనీ హామీ ఇస్తోంది. అదనంగా, 60W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటం వల్ల 50 శాతం బ్యాటరీని కేవలం 25 నిమిషాల్లోనే ఛార్జ్ చేసుకోవచ్చు.
IP69 రేటింగ్..
ఫోన్‌కు IP69 రేటింగ్ ఉండటం దీని ప్రధాన ప్రత్యేకత. దీనివల్ల ఫోన్‌కి ధూళి, నీటి నిరోధకత లభిస్తుంది. కేవలం నీటి చుక్కలు మాత్రమే కాదు, తక్కువ లోతు నీటిలో కూడా కొంతసేపు ఫోన్‌కి హాని కలగదని కంపెనీ చెబుతోంది.
డిస్‌ప్లే..
Realme 15x 5Gలో 6.8 అంగుళాల HD+ సన్‌లైట్ డిస్‌ప్లే ఉంది. ఇది 144Hz రిఫ్రెష్ రేట్, 180Hz టచ్ శాంప్లింగ్ రేట్ కలిగి ఉండటంతో గేమింగ్, వీడియో స్ట్రీమింగ్‌లో సూపర్ స్మూత్ అనుభవాన్ని అందిస్తుంది. 1,200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ వల్ల నేరుగా ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుంది. అదనంగా, ఐ ప్రొటెక్షన్ మోడ్, స్లీప్ మోడ్, డైనమిక్ స్క్రీన్ రిఫ్రెష్ స్విచింగ్ ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఫోన్ బరువు 212 గ్రాములు, మందం 8.28mm మాత్రమే.
ప్రాసెసర్ & స్టోరేజ్..
ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 (6nm) చిప్‌సెట్పై పనిచేస్తుంది. ఇది గరిష్టంగా 2.4GHz క్లాక్ స్పీడ్ను అందిస్తుంది. గ్రాఫిక్స్ కోసం ARM Mali-G57 MC2 GPUని ఉపయోగించారు. మెమరీ పరంగా 6GB/8GB ర్యామ్ వేరియంట్లలో, 128GB/256GB స్టోరేజ్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. అదనంగా, 2TB వరకు మైక్రో SD కార్డ్ సపోర్ట్ కూడా ఉంది.
కెమెరా..
Realme 15x 5G వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ప్రధాన కెమెరా 50MP సోనీ IMX852 AI లెన్స్ (f/1.8) కాగా, దీనికి తోడుగా డెప్త్ సెన్సార్ అమర్చారు. ముందు భాగంలో 50MP OmniVision OV50D40 సెల్ఫీ కెమెరాని అందించారు. వీడియోల కోసం 1080p రికార్డింగ్, డ్యూయల్ వ్యూ వీడియో, స్లో మోషన్, టైమ్ లాప్స్, సినిమాటిక్ షూటింగ్, అండర్‌వాటర్ మోడ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
కనెక్టివిటీ & సెన్సార్లు..
కనెక్టివిటీ ఆప్షన్లలో 5G, 4G, Wi-Fi 5, బ్లూటూత్ 5.3, GPS, GLONASS, గెలీలియో, బీడౌ, QZSS ఉన్నాయి. సెన్సార్ల పరంగా ప్రాక్సిమిటీ సెన్సార్, అంబియెంట్ లైట్ సెన్సార్, కలర్ టెంపరేచర్ సెన్సార్, ఈ-కాంపాస్, యాక్సెలెరోమీటర్, గైరోస్కోప్ ఉన్నాయి.
ధరలు & వేరియంట్లు..
భారతదేశంలో Realme 15x 5G మూడు వేరియంట్లలో లభిస్తుంది:
6GB + 128GB - రూ.16,999
8GB + 128GB - రూ.17,999
8GB + 256GB - రూ.19,999
కలర్స్..
ఫోన్ ఆక్వా బ్లూ, మెరైన్ బ్లూ, మెరూన్ రెడ్ రంగుల్లో అందుబాటులోకి వచ్చింది. రియల్‌మీ అధికారిక వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.
ప్రత్యేక ఆఫర్లు..
కొనుగోలు దారులకు కంపెనీ ప్రత్యేక ఆఫర్లు అందిస్తోంది. UPI, క్రెడిట్/డెబిట్ కార్డుల ద్వారా రూ.1,000 తక్షణ డిస్కౌంట్, లేదా రూ.3,000 ఎక్స్చేంజ్ బోనస్ లభిస్తుంది. అదనంగా, 6 నెలల వడ్డీ లేని EMI సౌకర్యం కూడా ఉంది.
-
Todays Horoscope: ఈ రాశి వారికి ఆరోగ్య సమస్యలు- ఆ రాశి వారికి ధన లాభాలు..!! -
అనసూయకు అవమానం..? వీడియో -
వంట గ్యాస్ గండం, సిలిండర్ల బుకింగ్..సరఫరా పై తాజా ఆంక్షలు..!! -
డిగ్రీలెందుకు దండగ.. గాడిదలు ఉంటే పండగ! -
మనకు మరో వందేభారత్, రెండు అమృత్ భారత్ ఖరారు- ఇక 3 గంటల్లోనే, రూట్..!! -
ఇక సెలవ్.. బీహార్ లో ముగిసిన నితీష్ శకం..!! -
వాంఖెడే ఈ నలుగురికీ కొట్టిన పిండే: అయినా డేంజర్- అచ్చిరాని పిచ్ -
Ind Vs Eng:సెమీస్ వేళ బ్యాటింగ్ లో మార్పులు, గంభీర్ కొత్త లెక్కలు - సెంటిమెంట్..!! -
ఓటీటీలోకి 'పూకీ' మూవీ.. ఇక రచ్చ రచ్చే..! -
ఏపీలో అద్దిరిపోయే రైల్వే స్టేషన్- ఆ జిల్లాకు బెటర్ కనెక్టివిటీ -
వధువు కంటే వదినే హైలైట్.. ఆ రాయల్ లుక్ మామూలుగా లేదుగా! -
T20 World Cup:సెమీస్ వేళ పఠాన్ కీలక సూచన-సౌతాఫ్రికాను కొట్టిన కివీస్ ప్లాన్..!












Click it and Unblock the Notifications