రియల్‌మీ నుంచి అల్ట్రా-ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ లాంఛ్.. బాగా కాస్ట్లీ !!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ "రియల్‌మీ" తక్కువ కాలంలోనే భారతీయ మార్కెట్లో బలమైన స్థానం సంపాదించింది. ఎక్కువగా యువతను ఆకర్షించే ఈ బ్రాండ్.. తక్కువ ధరలోనే బెస్ట్ ఫీచర్స్ అందిస్తూ వినియోగదారుల నమ్మకాన్ని పొందింది. కాగా భారత మార్కెట్‌లో రియల్‌మీ ప్రస్థానం 2018లో ప్రారంభమైంది. అప్పటి నుంచి బడ్జెట్ నుంచి ఫ్లాగ్‌షిప్ వరకూ పలు సెగ్మెంట్లలో ఫోన్లను విడుదల చేస్తూ.. పలు బ్రాండ్లకు గట్టి పోటీని ఇస్తోంది.
కాగా ఇప్పుడు ఫ్లాగ్‌షిప్ సెగ్మెంట్‌ను లక్ష్యం చేసుకుని రియల్‌మీ భారత మార్కెట్లో తన అత్యంత శక్తివంతమైన రియల్‌మీ GT 8 ప్రోను విడుదల చేసింది. క్వాల్కమ్ తాజా Snapdragon 8 Elite Gen 5 చిప్‌సెట్, రికో GR సహకారంతో రూపొందించిన ప్రొఫెషనల్ కెమెరా.. AI సామర్థ్యాలు, మాడ్యులర్ డిజైన్ ఈ ఫోన్‌ను మరింత ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ ప్రారంభ ధర రూ.72,999, స్పెషల్ డ్రీమ్ ఎడిషన్ ధర రూ.79,999 గా నిర్ణయించారు. విక్రయాలు నవంబర్ 25 నుంచి రియల్‌మీ వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభం కానున్నాయి.

స్విచ్చబుల్ కెమెరా బంప్..
ఈ ఫోన్లో ప్రపంచంలోనే మొదటి మాడ్యులర్ కెమెరా బంప్ డిజైన్ రూపొందించారు. వినియోగదారులు కెమెరా ఐల్యాండ్‌ను వేర్వేరు డిజైన్‌లతో మార్చుకోవచ్చు. పర్సనలైజేషన్‌ను తదుపరి స్థాయికి తీసుకెళ్లే ఫీచర్ ఇది అని అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇక ప్రత్యేక డ్రీమ్ ఎడిషన్‌లో ఆస్టన్ మార్టిన్ ఆరామ్‌కో F1 టీమ్ డిజైన్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. ఇది ఇప్పటివరకు ఏ స్మార్ట్‌ఫోన్‌లోనూ చూడని డిజైన్ కాన్సెప్ట్.
రియల్‌మీ జీటీ 8 ప్రో ఫీచర్స్..
పనితీరు..
- Snapdragon 8 Elite Gen 5 + Realme HyperVision AI చిప్
- శక్తివంతమైన పనితీరును అందించేందుకు GT 8 ప్రోలో
- Snapdragon 8 Elite Gen 5
- Realme HyperVision+ AI చిప్
- ఈ ఫోన్ AnTuTuలో 4 మిలియన్ పైగా స్కోర్ సాధించింది.
గేమింగ్ కోసం AI ఫీచర్లు..
- AI Gaming Super Frame Engine
- Ultra Stable High FPS
- 7k Ultimate VC Cooling System
AI ఫీచర్స్..
- ఆండ్రాయిడ్ 16 ఆధారిత Realme UI 7.0లో AI కీలక పాత్ర పోషిస్తోంది:
- AI Notify Brief - నోటిఫికేషన్‌లను స్మార్ట్‌గా సారాంశం చేస్తుంది
- AI Framing Master - ఫోటోలలో డైనమిక్ ఫ్రేమింగ్ సూచనలు
- AI Smart Reply - కంటెంట్ బట్టి రిప్లైలు
- AI Gaming Coach - గేమ్ ప్యాటర్న్, సెట్టింగుల ఆధారంగా సలహాలు
- Multitask Sidebar - 12 యాప్‌ల వరకు స్మూత్ మల్టీటాస్కింగ్
- ఇవి ఫోన్‌ను పూర్తిగా AI-డ్రైవన్ డివైస్‌గా మార్చుతున్నాయి.
కెమెరా..
- ఫోటోగ్రఫీ GT 8 ప్రో యొక్క అతిపెద్ద USP.
- ప్రైమరీ 50MP కెమెరా రికో GR ప్రత్యేక క్యాలిబ్రేషన్‌తో వస్తుంది.
- 28mm & 40mm ఫోకల్ లెంగ్త్‌లు
- Snap Focus Mode (అతి వేగంగా ఫోటో క్లిక్)
- 200MP Periscope Telephoto (12× Lossless Zoom)
- 50MP Ultra Wide Lens
- ProRAW, AI Night, Cinematic Portrait Modes, 4K @ 120fps, 8K @ 30fps, Ultra HDR Video Mode
డిస్‌ప్లే..
రియల్‌మీ జీటీ 8 ప్రోలో 6.79 అంగుళాల QHD+ AMOLED డిస్‌ప్లేను ఉపయోగించారు. ఇది 144Hz రిఫ్రెష్ రేట్, 2K రిజల్యూషన్, మరియు 7000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. HDR10+ సపోర్ట్, అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, IP69/68 రేటింగ్ తో ఫోన్ బలంగా కనిపిస్తుంది.
ఆడియో, హాప్టిక్స్, కనెక్టివిటీ..
- Dual symmetric stereo speakers
- Smart Haptic Engine Max
- Wi-Fi 7, Bluetooth 5.4
- Dual-frequency GPS
- NFC మల్టీ-ఫంక్షన్ సపోర్ట్
బ్యాటరీ & ఛార్జింగ్..
- 7000mAh బ్యాటరీ
- 120W SuperVOOC Charging
- 50W Wireless Charging
స్టోరేజ్..
- 12GB / 16GB LPDDR5X RAM
- 256GB / 512GB / 1TB UFS 4.1 Storage
ఇతర కీలక ఫీచర్లు..
- In-display Fingerprint
- Enhanced Glass Design (స్క్రాచ్ రెసిస్టెంట్)
- IP65 Dust & Water Resistance
-
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు












Click it and Unblock the Notifications