Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

"గేమ్ ఆఫ్ థ్రోన్స్" లవర్స్‌కి గుడ్ న్యూస్.. రియల్‌మీ సర్‌ప్రైజ్ !!

చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ రియల్‌మీ కి యువతలో మంచి క్రేజ్ ఉంది. ఈ సంస్థ Realme 15 Pro, Realme 15 బేస్ మోడల్స్‌ను భారత మార్కెట్‌లో లాంచ్ చేసింది. అయితే ఇప్పుడు ప్రత్యేక కలెక్షన్ ఫోన్ల అభిమానులకు సర్ప్రైజ్ ఇవ్వబోతోంది. భారత్‌లో Realme 15 Pro 5G Game of Thrones Limited Edition ఫోన్‌ను త్వరలో లాంచ్ చేయబోతోంది. కంపెనీ ఇప్పటికే ఈ ప్రత్యేక ఎడిషన్‌కు సంబంధించిన టీజర్‌ను విడుదల చేసింది.

డిజైన్‌లో స్పెషల్ టచ్..

నివేదికల ప్రకారం.. ఈ లిమిటెడ్ ఎడిషన్‌లో హార్డ్‌వేర్ అప్‌గ్రేడ్‌లు ఉండవు. ప్రాసెసర్, RAM, స్టోరేజ్, కెమెరా సెటప్ అన్నీ సాధారణ Realme 15 Pro 5G వెర్షన్‌లాగే ఉంటాయి. మార్పులు ప్రధానంగా డిజైన్, లుక్ మరియు కస్టమైజ్డ్ UI ఎలిమెంట్స్ రూపంలో కనిపిస్తాయి. అయితే ధర, లాంచ్ తేదీ, పూర్తిస్థాయి వివరాలను ఇంకా ప్రకటించాల్సి ఉంది. ఈ ఎడిషన్ ఇప్పటికే మలేషియాలోని SIRIM సర్టిఫికేషన్ ప్లాట్‌ఫామ్‌లో జాబితా అయ్యింది.

realme-launching-15-pro-smart-phones-with-game-of-thrones-edition

ప్రత్యేకతలు..

"గేమ్ ఆఫ్ థ్రోన్స్" ఎడిషన్‌లో ప్రత్యేకమైన కస్టమ్-థీమ్ డిజైన్, సిరీస్‌ ప్రేరేపిత UI వాల్‌పేపర్లు, ఐకాన్లు, లిమిటెడ్ ఎడిషన్ బాక్స్ ప్యాకేజింగ్, కలెక్టబుల్ స్టిక్కర్లు, థీమ్‌డ్ సిమ్ ఇజెక్టర్ పిన్ వంటి అంశాలు ఉంటాయని ఊహిస్తున్నారు. ఫ్యాన్స్ కోసం ఈ ఎడిషన్ మరింత ఆకర్షణీయంగా ఉండేలా డీటైల్డ్ ఆర్ట్‌వర్క్ ఉండవచ్చని లీకులు సూచిస్తున్నాయి.

Realme 15 Pro 5G Game of Thrones ఫీచర్లు..

కెమెరా సెటప్..

ప్రైమరీ కెమెరా - 50MP సోనీ IMX896 సెన్సార్ (OIS సపోర్ట్‌తో)

సెకండరీ లెన్స్ - 50MP అల్ట్రా-వైడ్ లెన్స్

ఫ్రంట్ కెమెరా - 50MP సెల్ఫీ షూటర్

వీడియో రికార్డింగ్ - 4K 60fps సపోర్ట్, HDR మోడ్, AI ఫీచర్లు

బ్యాటరీ & ఛార్జింగ్..

ఈ ఫోన్‌లో భారీ 7,000mAh బ్యాటరీ ఉండి, 80W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. దీని వల్ల కేవలం 30 నిమిషాల్లో 60% వరకు ఛార్జ్ అవుతుంది.

డిస్ ప్లే..

సైజు - 6.8 అంగుళాల AMOLED

రిఫ్రెష్ రేట్ - 144Hz

బ్రైట్నెస్ - 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్

ప్రొటెక్షన్ - కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i

ప్రాసెసర్..

Qualcomm Snapdragon 7 Gen 4

RAM - 8GB / 12GB LPDDR4X

స్టోరేజ్ - 256GB / 512GB UFS 3.1

OS - Android 15 ఆధారిత Realme UI 6

కనెక్టివిటీ & ఫీచర్లు..

5G (SA/NSA)

Wi-Fi 6

Bluetooth 5.3

ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్

స్టీరియో స్పీకర్లు, డాల్బీ ఆట్మాస్ సపోర్ట్

IP54 రేటింగ్ (డస్ట్, స్ప్లాష్ ప్రొటెక్షన్)

ధర..

జూలైలో విడుదలైన స్టాండర్డ్ మోడల్‌లో

8GB RAM + 128GB - రూ. 31,999

8GB + 256GB - రూ. 33,999

12GB + 256GB - రూ. 35,999

12GB + 512GB - రూ. 38,999

మరి ఇప్పుడు ఈ కొత్త ఎడిషన్ ధరల్లో మార్పులు ఉండే అవకాశం ఉండవచ్చని సమాచారం.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+