Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

"రియల్‌మీ" కొత్త స్మార్ట్ ఫోన్.. కేవలం రూ.7,999 మాత్రమే !

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ "రియల్‌మీ" భారతీయ మార్కెట్లో బలమైన స్థానం సంపాదించింది. ఎక్కువగా యువతను ఆకర్షించే ఈ బ్రాండ్.. తక్కువ ధరలోనే బెస్ట్ ఫీచర్స్ అందిస్తూ వినియోగదారుల నమ్మకాన్ని పొందింది. కాగా ఇండియాలో రియల్‌మీ ప్రస్థానం 2018లో ప్రారంభమవ్వగా.. అప్పటి నుంచి బడ్జెట్‌ నుంచి ఫ్లాగ్‌షిప్ వరకూ పలు సెగ్మెంట్లలో ఫోన్లను విడుదల చేస్తూ పలు బ్రాండ్లకు గట్టి పోటీని ఇస్తోంది. లేటెస్ట్ గా రియల్ మీ 'P' సిరీస్‌లో నుంచి కొత్తగా మరో స్మార్ట్ ఫోన్ రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యింది.

తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు కోరుకునే యూజర్ల కోసం ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme భారత్‌లో కొత్త బడ్జెట్ ఫోన్ రియల్‌మీ P4 లైట్‌ను విడుదల చేసింది. ముఖ్యంగా ఎక్కువ బ్యాటరీ బ్యాకప్, స్మూత్ డిస్ప్లే, డైలీ యూజ్‌కు సరిపోయే పనితీరుతో ఈ ఫోన్ విద్యార్థులు మరియు బడ్జెట్ యూజర్లకు మంచి ఎంపికగా మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ ఫోన్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. అవేంటో మీకోసం ప్రత్యేకంగా..

realme-p4-lite-price-and-specifications-details-along-with-online-availabilty-and-launch-offers

ధర & లాంచ్ ఆఫర్లు..

బేస్ వేరియంట్ ధర సుమారు రూ.9,999 నుంచి ప్రారంభమవుతుంది. బ్యాంక్ ఆఫర్లు, కూపన్లు మరియు లాంచ్ డిస్కౌంట్లతో కలిపి సుమారు రూ.2,000 వరకు తగ్గింపు పొందే అవకాశం ఉంది. అన్ని ఆఫర్లు వర్తిస్తే ఈ ఫోన్‌ను కేవలం రూ.7,999 ధరకు కొనుగోలు చేయొచ్చు. ఫిబ్రవరి 24 నుంచి Flipkart మరియు రియల్‌మీ అధికారిక వెబ్‌సైట్‌లో సేల్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం ప్రీ-ఆర్డర్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది.

ఫీచర్స్..

బ్యాటరీ & పనితీరు..

రియల్‌మీ P4 లైట్‌లో 6300mAh భారీ బ్యాటరీ ఇవ్వడం ఈ ఫోన్ ప్రధాన హైలైట్. ఒకసారి ఛార్జ్ చేస్తే రోజంతా సులభంగా ఉపయోగించుకోవచ్చు. దీనికి సపోర్ట్‌గా 15W ఫాస్ట్ ఛార్జింగ్ కూడా అందిస్తున్నారు. డైలీ యాప్‌లు, సోషల్ మీడియా, వీడియో స్ట్రీమింగ్ వంటి పనులకు సరిపోయే ఆప్టిమైజ్డ్ ప్రాసెసర్‌తో స్మూత్ పనితీరు లభిస్తుంది.

డిస్ప్లే & డిజైన్..

ఈ ఫోన్‌లో 6.74 అంగుళాల HD+ డిస్ప్లే ఉంది. 90Hz రిఫ్రెష్ రేట్ ఉండటం వల్ల స్క్రోలింగ్, గేమింగ్ అనుభవం మరింత స్మూత్‌గా ఉంటుంది. పెద్ద స్క్రీన్ కారణంగా వీడియోలు, ఆన్‌లైన్ క్లాసులు, గేమింగ్‌కు మంచి అనుభవం లభిస్తుంది.

కలర్స్..

బీచ్ గోల్డ్, బ్లాక్, సీ బ్లూ అనే మూడు ఆకర్షణీయమైన కలర్స్‌లో ఫోన్ లభిస్తుంది.

కెమెరా..

ఫోటోగ్రఫీ కోసం వెనుకవైపు 13MP మెయిన్ కెమెరా ఇవ్వగా, సెల్ఫీలు మరియు వీడియో కాల్స్ కోసం 5MP ఫ్రంట్ కెమెరా అందించారు. AI కెమెరా మోడ్, నైట్ మోడ్, పోర్ట్రెయిట్ ఫీచర్లతో సాధారణ ఫోటోగ్రఫీ అవసరాలను సులభంగా తీర్చగలదు.

ఇతర ముఖ్యమైన ఫీచర్లు..

4GB ర్యామ్ + 128GB స్టోరేజ్ (మెమరీ ఎక్స్‌పాంషన్ సపోర్ట్)

సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్

IP54 వాటర్ & డస్ట్ రెసిస్టెన్స్

ఆండ్రాయిడ్ 15 ఆధారిత UI

డ్యూయల్ సిమ్, 4G కనెక్టివిటీ, బ్లూటూత్, వై-ఫై సపోర్ట్

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+