అదిరిపోయే ఫీచర్స్‌తో Realme P4x 5G.. ధర ఎంతంటే ??
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ "రియల్‌మీ" తక్కువ కాలంలోనే భారతీయ మార్కెట్లో బలమైన స్థానం సంపాదించింది. ఎక్కువగా యువతను ఆకర్షించే ఈ బ్రాండ్.. తక్కువ ధరలోనే బెస్ట్ ఫీచర్స్ అందిస్తూ వినియోగదారుల నమ్మకాన్ని పొందింది. కాగా భారత మార్కెట్‌లో రియల్‌మీ ప్రస్థానం 2018లో ప్రారంభమవ్వగా.. అప్పటి నుంచి బడ్జెట్ నుంచి ఫ్లాగ్‌షిప్ వరకూ పలు సెగ్మెంట్లలో ఫోన్లను విడుదల చేస్తూ పలు బ్రాండ్లకు గట్టి పోటీని ఇస్తోంది.
కాగా లేటెస్ట్ గా రియల్ మీ 'P' సిరీస్‌లో నుంచి కొత్తగా మరో స్మార్ట్ ఫోన్ రిలీజ్ చేసింది. Realme P4x 5G అనే పేరుతో లాంఛ్ అయిన ఈ మొబైల్ ని భారత మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. భారీ బ్యాటరీ, శక్తివంతమైన ప్రాసెసర్, స్టైలిష్ డిజైన్‌లతో ఉన్న ఈ ఫోన్.. బడ్జెట్ రేంజ్ లో ఈ కేటగిరీలో ఉన్న స్మార్ట్‌ఫోన్ లకు మార్కెట్లో మంచి పోటీ ఇస్తుందని అంచనా వేస్తున్నారు. అంతే కాకుండా మ్యాట్ సిల్వర్, ఎలిగెంట్ పింక్, లేక్ గ్రీన్ అనే మూడు స్టైలిష్ కలర్లలో అందుబాటులోకి వచ్చింది.

Realme P4x 5G ఫీచర్స్..
డిజైన్ & డ్యూరబిలిటీ..
ఫోన్ వెనుక భాగం మ్యాట్ ఫినిష్‌తో ఉండటం వల్ల ఫింగర్‌ప్రింట్లు సులభంగా కనిపించకుండా ఉంటుంది. IP64 రేటింగ్‌తో ధూళి, నీటి తుంపర్ల నుండి రక్షణ కల్పించడం వల్ల అవుట్‌డోర్ యూజర్లకు కూడా ఇది మంచి ఎంపికగా మారింది. ఫోన్‌లో 5300mm² పెద్ద వ్యాపర్ చాంబర్, స్టీల్ ప్లేట్, కాపర్-గ్రాఫైట్ కోటింగ్‌తో కూడిన Frozen Crown కూలింగ్ సిస్టమ్ ఉండటం ప్రత్యేక ఆకర్షణ. ఇది దీర్ఘకాలం గేమింగ్ చేసినప్పటికీ హీట్‌ను గణనీయంగా తగ్గిస్తుంది.
డిస్‌ప్లే..
ఈ ఫోన్ 6.72-అంగుళాల Full HD+ LCD డిస్‌ప్లేతో రాగ, 144Hz రిఫ్రెష్ రేట్‌తో గేమింగ్, స్క్రోలింగ్ మరింత స్మూత్‌గా అనిపిస్తుంది. అదనంగా 1,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఇవ్వడం వల్ల బాహ్య ప్రకాశంలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుంది. వీడియోలు, రీల్స్ చూసే వారికి ఇది మంచి విజువల్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది.
పనితీరు..
Realme P4x 5Gలో 6nm MediaTek Dimensity 7400 Ultra చిప్‌సెట్ వాడారు. గేమింగ్, మల్టీటాస్కింగ్, వీడియో ఎడిటింగ్ వంటి పనులను స్మూత్‌గా నిర్వహించడానికి ఈ చిప్‌సెట్ బలమైనది. 8GB వరకు RAM, 18GB వరకు వర్చువల్ RAM సపోర్ట్ ఇవ్వడం వల్ల ఎక్కువ యాప్స్ ఓపెన్ చేసినా కూడా లాగ్ లేకుండా పని చేస్తుంది. MicroSD సహాయంతో స్టోరేజ్‌ను 2TB వరకు విస్తరించుకోవచ్చని కంపెనీ తెలిపింది.
కెమెరా..
ఫోన్ వెనుక భాగంలో 50MP ప్రధాన కెమెరా, 2MP అదనపు సెన్సారుతో కూడిన డ్యూయల్ సెటప్ ఉంది. డేలైట్ ఫోటోలు, పోర్ట్రెయిట్స్, స్వల్ప లో-లైట్ షాట్స్‌లో ఇది మంచి పనితీరును ఇస్తుంది. ఫ్రంట్ భాగంలో 8MP కెమెరా సెల్ఫీలు, వీడియో కాలింగ్‌కు సరిపడా నాణ్యతను అందిస్తుంది. AI బ్యూటిఫికేషన్, పోర్ట్రెయిట్ మోడ్, HDR, నైట్ మోడ్ వంటి ఫీచర్లు కూడా అందించబడ్డాయి.
బ్యాటరీ..
Realme P4x 5G యొక్క ప్రధాన హైలైట్ 7,000mAh భారీ బ్యాటరీ. గేమింగ్, స్ట్రీమింగ్, సోషల్ మీడియా వంటి వాటిని ఎక్కువ గంటలు ఉపయోగించే యూజర్లకు ఇది పెద్ద ప్లస్. 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో పాటు బైపాస్ ఛార్జింగ్, రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటం దీని ప్రత్యేకత. మొత్తం మీద, ఒకసారి ఛార్జ్ చేస్తే 1.5-2 రోజుల బ్యాకప్ సులభంగా వస్తుందని కంపెనీ చెబుతోంది.
కనెక్టివిటీ & ఆడియో..
ఫోన్‌లో 5G, Wi-Fi, Bluetooth, GPS, USB Type-C వంటి అన్ని అవసరమైన కనెక్టివిటీ ఆప్షన్లు ఉన్నాయి. అదనంగా Hi-Res ఆడియో సర్టిఫికేషన్, OReality స్పీకర్ సపోర్ట్ ఫోన్ ఆడియో క్వాలిటీని మరింత మెరుగుపరుస్తాయి. వీడియోలు, పాటలు వినే వారికి ఇది స్పష్టమైన సౌండ్‌ను అందిస్తుంది.
ధరలు & వేరియంట్లు..
Realme P4x 5G మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది:
6GB + 128GB - రూ.15,499
8GB + 128GB - రూ.16,999
8GB + 256GB - రూ.17,999
₹15-18 వేల మధ్య ఈ ఫోన్ అందించే ఫీచర్లు చూస్తే, Poco X6, Redmi 15C, Samsung M14 వంటి ఫోన్లకు ఇది స్ట్రాంగ్ కాంపిటీటర్‌గా నిలుస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications