24GB ర్యామ్, 8000 mAh బ్యాటరీ.. Red Magic 11 Pro గేమింగ్ ఫోన్ !
చైనాకు చెందిన నుబియా (Nubia) మొబైల్ గేమింగ్ ఫోన్ల మార్కెట్లో టాప్ బ్రాండ్ గా కొనసాగుతోంది. గేమింగ్ ఫోన్ల తయారీలో ప్రత్యేకత చూపుతూ నుబియా స్మార్ట్‌ఫోన్లను అధునాతన హార్డ్‌వేర్, ఫాస్ట్ ప్రాసెసింగ్.. అత్యాధునిక టెక్నాలజీతో రూపొందిస్తుంది. ఇప్పటికే రెడ్ మ్యాజిక్ 6, 7, 8 సిరీస్‌లు గేమింగ్ ప్రియులలో మంచి గుర్తింపు పొందాయి. ఇప్పుడు కొత్తగా రెడ్ మ్యాజిక్ 11 ప్రో సిరీస్ ను విడుదల చేసింది.
24GB ర్యామ్, 8000 mAh బ్యాటరీ వంటి అదిరిపోయే ఫీచర్లతో ఈ మొబైల్ గేమర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. అత్యాధునిక ప్రాసెసర్, హై-ఎండెడ్ కూలింగ్ సిస్టమ్, సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్లు గేమింగ్ అనుభవాన్ని పూర్తిగా కొత్త స్థాయికి తీసుకువెళ్తాయి. ఇది ఫోన్ ఉష్ణోగ్రతను సమర్థవంతంగా నియంత్రిస్తూ.. ఫోన్ ని చల్లగా ఉంచుతుంది. అంతే కాకుండా యాక్టివ్ ఫ్యాన్ 24,000 rpm వేగంతో తిరుగుతూ.. ఓవర్ హీటింగ్ సమస్యను నివారిస్తుందని పేర్కొన్నారు. ఐపీఎక్స్ 8 రేటింగ్‌తో వాటర్ రెసిస్టెంట్ కావడంతో గేమర్‌లు సైతం ఈ ఫోన్ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.

Red Magic 11 Pro ఫీచర్స్..
ప్రాసెసర్ & పనితీరు..
- Snapdragon 8 Elite Gen 5 చిప్‌సెట్ ఈ ఫోన్ల హృదయం.
- 24GB వరకు RAM మరియు 1TB స్టోరేజ్ ఆప్షన్‌లు ఉన్నాయి.
- AI-ఆప్టిమైజ్డ్ Cube Game Engine 3.0 గేమ్‌ప్లేను సులభతరం చేస్తుంది.
- భారీ AAA గేమ్స్ కూడా సులభంగా, లాగ్ లేకుండా రన్ అవుతాయి.
- Adreno GPU గ్రాఫిక్స్ ప్రదర్శనను మరింత రియలిస్టిక్‌గా మారుస్తుంది.
- డ్యూయల్ లిక్విడ్ + ఎయిర్ కూలింగ్ ( విండ్స్ అండ్ వాటర్ డ్యూయల్ కూలింగ్ సిస్టమ్తో ఫోన్ వేగంగా గేమ్ ఆడితే కూడా చల్లగా ఉంటుంది)
- యాక్టివ్ ఫ్యాన్ 24,000 RPM వేగంతో పనిచేస్తుంది.
- లిక్విడ్ కూలింగ్ ఛాంబర్ ఫోన్ ఉష్ణోగ్రతను 16°C వరకు తగ్గిస్తుంది.
- IPX8 వాటర్ రెసిస్టెంట్ - ఏ రకమైన నీటి సమస్య లేకుండా ఉపయోగించవచ్చు.
డిస్‌ప్లే & డిజైన్..
- 6.85-అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లే.
- 144Hz రిఫ్రెష్ రేట్, 95.3% స్క్రీన్-టు-బాడీ రేషియో.
- Star Shield Eye Protection 2.0 - దీర్ఘకాలిక గేమింగ్‌లో కళ్లను కాపాడుతుంది.
- వెట్ హ్యాండ్ టచ్ సపోర్ట్ మరియు ఫుల్ మెటల్ బాడీ.
- IP68 డస్ట్ & వాటర్ రెసిస్టెన్స్.
బ్యాటరీ & ఛార్జింగ్..
- 8,000mAh బుల్ డెమన్ కింగ్ 3.0 బ్యాటరీ.
- 120W వైర్డ్, 80W వైర్‌లెస్ ఛార్జింగ్ మద్దతు.
- సూపర్ స్పీడ్ ఛార్జింగ్ - నిమిషాల్లోనే ఫోన్ ఫుల్.
- AI పవర్ మేనేజ్‌మెంట్ తో గేమింగ్ మరియు డेली యూజ్ లో బ్యాటరీ లైఫ్ పొడగుతుంది.
కెమెరా..
- 50MP OIS ప్రైమరీ కెమెరా.
- 50MP అల్ట్రావైడ్ + 2MP మ్యాక్రో లెన్స్.
- 50MP ఫ్రంట్ కెమెరా - లైవ్ స్ట్రీమింగ్, వీడియో కాల్స్ కోసం.
- AI Eraser, వన్-క్లిక్ ఫోటో ఎడిటింగ్.
గేమింగ్ ఫీచర్లు & కనెక్టివిటీ..
- 3.5mm హెడ్‌ఫోన్ జాక్, డ్యూయల్ స్పీకర్స్, మూడు మైక్రోఫోన్‌లు.
- వై-ఫై 7, NFC, IR బ్లాస్టర్, 360° యాంటెన్నా డిజైన్.
- లీనియర్ మోటార్ హ్యాప్టిక్ ఫీడ్‌బ్యాక్ - రియలిస్టిక్ కంట్రోల్ అనుభవం.
కలర్ ఆప్షన్..
- ప్రో మోడల్ - Dark Night, Lord War God.
- ప్రో+ మోడల్ - ట్రాన్స్‌పరెంట్ డిజైన్, ప్రత్యేక స్టైలిష్ లుక్స్.
డిజైన్ వేరియంట్స్..
- ప్రస్తుతం 16GB RAM వేరియంట్ అందుబాటులో ఉంది.
- త్వరలో 24GB RAM వేరియంట్ కూడా లాంఛ్ చేయనున్నారు.
ధర..
ఈ ఫోన్ ప్రారంభ ధర చైనాలో సీఎన్‌వై 4,999 (సుమారు రూ.62,000).
ప్రో+ మోడల్ సీఎన్‌వై 5,699 నుండి మొదలై, టాప్ వేరియంట్ సీఎన్‌వై 7,699 వరకు ఉంటుంది. భారత్‌లో త్వరలోనే విడుదల కానుంది.












Click it and Unblock the Notifications