బడ్జెట్‌లో బెస్ట్ ఫోన్ కావాలా.. ఇండియన్ మార్కెట్ లోకి "రెడ్‌మి" కొత్త ఫోన్!
అందరి చేతిలోనూ సెల్ ఫోన్ ఒక నిత్యవసర వస్తువుగా మారిపోయింది. ఒక్కొక్కరు తమ స్థాయిని బట్టి ఫోన్లు కొనుగోలు చేస్తుంటారు. అందుకే ప్రముఖ స్మార్ట్ ఫోన్ సంస్థలు సైతం కస్టమర్లను ఆకర్షించేందుకు కొత్త కొత్త ఫీచర్లతో స్మార్ట్ ఫోన్స్ ని రిలీజ్ చేస్తున్నాయి. కాగా 5G ఫోన్‌ల ధరలు సాధారణంగా రూ.14,000-రూ.16,000 వరకు ఉండగా.. రెడ్‌మీ మాత్రం తక్కువ ధరకే అధునాతన ఫీచర్లతో కూడిన స్మార్ట్‌ఫోన్‌ను అందిస్తుంది. ఇప్పుడు లేటెస్ట్ గా షావోమి సంస్థ రెడ్‌మీ బ్రాండ్ నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ ను భారత మార్కెట్లో విడుదల చేసింది.
భారత మార్కెట్లో కొత్త మోడల్ రెడ్‌మి 15C ని రిలీజ్ చేసింది. గత సంవత్సరం మంచి సక్సెస్ అందుకున్న రెడ్‌మి 14Cకి ఇది అప్‌గ్రేడ్ వెర్షన్. ముఖ్యంగా డిస్‌ప్లే, బ్యాటరీ, డిజైన్, సాఫ్ట్‌వేర్ వంటి విభాగాలలో గణనీయమైన మార్పులు అందిస్తూ.. ఈ ఫోన్ రిలీజ్ చేసింది. రూ.15,000 లోపు రేంజ్‌లో రియల్‌మీ P4x, ఇన్‌ఫినిక్స్ హాట్ 60i, ఒప్పో K13 వంటి మోడళ్లకు ఇది గట్టి పోటీ ఇస్తోంది. సెప్టెంబర్‌లో గ్లోబల్‌గా లాంచ్ అయిన ఈ మోడల్ మూడు వేరియంట్లలో అందుబాటులో ఉండనుంది. ఈ ఫోన్ ఫీచర్స్ ఏంటో చూసేద్దాం..

"రెడ్‌మీ 15సీ" 5G ఫీచర్స్..
ప్రాసెసర్ & పనితీరు..
రెడ్‌మీ 15సీ 5Gలో MediaTek Dimensity 6300 చిప్‌సెట్‌ను ఉపయోగించారు.
గేమింగ్‌కు సరిపడ ప్రదర్శన
పవర్ ఎఫిషియెన్సీ
5G నెట్‌వర్క్‌లో స్థిరమైన కనెక్టివిటీ అందించగలదని కంపెనీ చెబుతోంది.
డిజైన్ & డిస్‌ప్లే..
ఈ మోడల్‌లో ఉన్న 6.9 అంగుళాల HD+ డిస్‌ప్లే బడ్జెట్ విభాగంలో అరుదుగా కనిపించే పెద్ద సైజ్.
120Hz రిఫ్రెష్ రేట్ - స్మూత్ స్క్రోలింగ్
240Hz టచ్ శాంప్లింగ్ రేట్ - గేమింగ్‌కు బెటర్ రెస్పాన్స్
810 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ - బాహ్య వెలుతురులో కూడా స్పష్టంగా కనిపించడానికి వీలు
బ్యాటరీ & ఛార్జింగ్..
6,000mAh భారీ బ్యాటరీ - ఒకసారి ఛార్జ్‌చేస్తే రోజు మొత్తం నడిచే అవకాశం
33W ఫాస్ట్ ఛార్జింగ్ - త్వరగా ఛార్జ్ అయిపోవడం
ఈ ఫీచర్లతో దీన్ని పవర్ యూజర్లు కూడా సులభంగా ఉపయోగించవచ్చు.
కెమెరా..
50MP రియర్ కెమెరా - AI ఎన్హాన్స్‌మెంట్‌తో క్లియర్ ఫోటోలు
8MP ఫ్రంట్ కెమెరా - స్టడీ సెల్ఫీలు, వీడియో కాల్స్‌కు సరిపడ మానసికత
బడ్జెట్ సెగ్మెంట్‌కు కావాల్సిన కెమెరా స్టాన్డర్డ్స్‌ను ఇది పూర్తిగా నెరవేరుస్తుంది.
కనెక్టివిటీ & అదనపు ఫీచర్లు..
బ్లూటూత్ 5.4
Wi-Fi సపోర్ట్
3.5mm హెడ్‌ఫోన్ జాక్ - కొత్త ఫోన్‌లలో అరుదుగా కనిపించే ఫీచర్
IP64 రేటింగ్ - స్ప్లాష్ & డస్ట్ ప్రొటెక్షన్
సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్
AI ఫేస్ అన్‌లాక్
హై-రెసల్యూషన్ ఆడియో సపోర్ట్
వేరియంట్లు..
రెడ్‌మి 15C మూడు కలర్ వేరియంట్లలో లభిస్తుంది:
Moonlight Blue, Dusk Purple, Midnight Black
స్టోరేజ్ ఆప్షన్లు & ధరలు..
4GB + 128GB → రూ.12,499
6GB + 128GB → రూ.13,999
8GB + 128GB → రూ.15,499
డిసెంబర్ 11 నుండి Amazon, Mi.com, రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉంటుంది.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ??












Click it and Unblock the Notifications