బెస్ట్ ఫీచర్లతో "రెడ్‌మీ 15R 5G".. కేవలం రూ.13 వేలకే !!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ సంస్థలు సైతం కస్టమర్లను ఆకర్షించేందుకు కొత్త కొత్త ఫీచర్లతో స్మార్ట్ ఫోన్స్ ని రిలీజ్ చేస్తున్నాయి. అందులోనే భాగంగా ప్రపంచవ్యాప్తంగా బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల కోసం షావోమీ ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్‌ను తీసుకొస్తుంది. ఇప్పుడు లేటెస్ట్ గా షావోమి సంస్థ రెడ్‌మీ బ్రాండ్ నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ ను చైనా మార్కెట్లో విడుదల చేసింది.
రెడ్‌మీ 15R 5G అనే కొత్త 5G ఫోన్‌ను విడుదల చేసింది. తక్కువ ధరలో పెద్ద డిస్‌ప్లే, భారీ బ్యాటరీ, కొత్త సాఫ్ట్‌వేర్ సపోర్ట్‌తో ఈ ఫోన్ మార్కెట్‌లో బడ్జెట్ లవర్స్‌ను ఆకట్టుకోనుంది. తక్కువ ధరలోనే 5G ఫోన్ కావాలనుకునే వారికి ఇది కూడా మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు. అయితే కెమెరా సెగ్మెంట్‌లో కొంత వెనకబడి ఉన్నా.. డిజైన్, బ్యాటరీ, పనితీరు బడ్జెట్ కస్టమర్లను ఖచ్చితంగా ఆకట్టుకుంతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

రెడ్‌మీ 15R 5G ఫీచర్లు..
డిస్‌ప్లే..
రెడ్‌మీ 15R 5Gలో 6.9 అంగుళాల పెద్ద డిస్‌ప్లేను ఇచ్చారు.
రిజల్యూషన్: 720×1600 పిక్సెల్స్
రిఫ్రెష్ రేట్: 120Hz
టచ్ శాంప్లింగ్ రేట్: 240Hz
దీంతో స్క్రోలింగ్, గేమింగ్ చాలా స్మూత్‌గా ఉంటుంది. డిస్‌ప్లే 810 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ కలిగి ఉండడంతో బహిరంగ ప్రదేశాల్లో కూడా ఫోన్ క్లియర్‌గా కనిపిస్తుంది. అంతేకాక, TÜV Rheinland సర్టిఫికేషన్తో బ్లూ లైట్‌ను తగ్గించడం ద్వారా కళ్లకు రక్షణ కలిగిస్తుంది.
పనితీరు..
ఈ ఫోన్‌లో మేడియాటెక్ డైమెన్సిటీ 6300 ఆక్టా-కోర్ ప్రాసెసర్ ఉంది. అలానే RAM గరిష్టంగా 12GB LPDDR4X.. స్టోరేజ్ గరిష్టంగా 256GB UFS 2.2 వరకు అందిస్తున్నారు. దీంతో మల్టీటాస్కింగ్ సులభంగా ఉంటుందని అంటున్నారు.
సాఫ్ట్‌వేర్..
ఈ స్మార్ట్‌ఫోన్ Android 15 ఆధారంగా HyperOS 2పై పనిచేస్తుంది. రెడ్‌మీ డివైసులకు ఆప్టిమైజ్ చేసిన ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి. సులభమైన నావిగేషన్, క్లీనర్ UIతో ఫోన్ యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. రెగ్యులర్ సెక్యూరిటీ అప్‌డేట్స్, ఆప్టిమైజేషన్ షావోమీ నుండి అందుతాయి.
కెమెరా..
వెనుక కెమెరా: 13MP సింగిల్ లెన్స్ - సాధారణ ఫోటోలు, వీడియోలు తీయడానికి సరిపోతుంది.
ముందు కెమెరా: 5MP సెల్ఫీ షూటర్ - వీడియో కాల్స్, బేసిక్ సెల్ఫీలకు అనుకూలం.
ఈ సెక్టార్‌లో ఫోన్ బడ్జెట్ రేంజ్‌కి సరిపడేలా ఉంది కానీ, కెమెరా లవర్స్‌కి ఇది మైనస్ పాయింట్‌గా అనిపించవచ్చు.
బ్యాటరీ & ఛార్జింగ్..
ఫోన్ హైలైట్ 6000mAh భారీ బ్యాటరీ.
33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది.
డిజైన్..
బరువు: 205 గ్రాములు
మందం: 7.99mm
భారీ బ్యాటరీ ఉన్నప్పటికీ ఫోన్ చాలా సన్నగా డిజైన్ చేశారు.
రంగులు..
ఈ ఫోన్ క్లౌడీ వైట్, లైమ్ గ్రీన్, షాడో బ్లాక్, ట్విలైట్ పర్పుల్ కలర్స్‌లో లభిస్తుంది.
ధర & వేరియంట్లు..
రెడ్‌మీ 15R 5G పలు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది:
4GB RAM + 128GB స్టోరేజ్ → CNY 1,099 (సుమారు రూ.13,000)
6GB RAM + 128GB స్టోరేజ్ → CNY 1,599 (రూ.19,000)
8GB RAM + 128GB స్టోరేజ్ → CNY 1,699 (రూ.23,000)
8GB RAM + 256GB స్టోరేజ్ → CNY 1,899 (రూ.25,000)
12GB RAM + 256GB స్టోరేజ్ → CNY 2,299 (రూ.28,000)
కనెక్టివిటీ & ఇతర ఫీచర్లు..
5G సపోర్ట్
Wi-Fi 802.11 a/b/g/n/ac
బ్లూటూత్ 5.4
USB టైప్-C పోర్ట్
సెన్సార్లు: యాక్సిలరోమీటర్, ఈ-కంపాస్, వర్చువల్ డిస్టెన్స్ సెన్సార్, యాంబియంట్ లైట్ సెన్సార్.
IP64 రేటింగ్ కలిగి ఉండడంతో కొంతమేరకు నీరు, దుమ్ము నుంచి రక్షణ లభిస్తుంది. కానీ ఇది పూర్తిగా వాటర్‌ప్రూఫ్ కాదు.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications