క్రికెట్ లవర్స్‌కు బంపర్ ఆఫర్.. ఐపీఎల్ కోసం జియో స్పెషల్ ఆఫర్

ప్రతీ సమ్మర్‌ లానే ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఈ సమ్మర్ లో కూడా క్రికెట్ ఫ్యాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఉర్రూతలూగించేందుకు రాబోతుంది ఐపీఎల్. 18వ సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రారంభం కాబోతున్న తరుణంలో.. ఐపీఎల్ ఫ్యాన్స్ కోసం రిలయన్స్ జియో అదిరిపోయే ఆఫర్ తీసుకువస్తోంది. క్రికెట్ ప్రియులే టార్గెట్ గా కొత్తగా ఒక రీఛార్జ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది.

రీఛార్జ్ ప్లాన్ బెనిఫిట్స్..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ స్టార్ట్ కాబోతున్న నేపధ్యంలో.. ఒక స్పెషల్ ఆఫర్ ను తీసుకువచ్చింది. ఇప్పటికే రూ. 299 కంటే ఎక్కువ ప్లాన్‌లను ఉపయోగిస్తున్న జియో కస్టమర్‌లు.. రూ. 100 రీఛార్జ్‌తో 90 రోజుల పాటు అన్ని ఐపీఎల్ ఉచితంగా వీక్షించడానికి వీలు కల్పిస్తోంది. కొత్త జియో సిమ్ కస్టమర్‌లు రూ. 299 లేదా అంతకంటే ఎక్కువ ప్లాన్‌తో కొత్త జియో సిమ్‌ని పొందవలసి ఉంటుంది. మార్చి 17లోపు రీఛార్జ్ చేసుకున్న కస్టమర్‌లు రూ. 100 డేటా యాడ్-ఆన్ ప్యాక్‌ని తీసుకోవడం ద్వారా కొత్త ఆఫర్‌ను పొందగలరు.

reliance-jio-special-recharge-offer-for-new-ipl-season

ఈ అపరిమిత క్రికెట్ ఆఫర్‌లో కస్టమర్‌లు టీవీ / మొబైల్‌లో 90 రోజుల ఉచిత JioHotstar సభ్యత్వాన్ని పొందుతారు. దీంతో 22 మార్చి 2025 నుంచి ప్రారంభమయ్యే IPL క్రికెట్ సీజన్‌ను కస్టమర్‌లు ఉచితంగా ఆస్వాదించగలరు. అది కూడా 4K నాణ్యతతో మ్యాచ్ లను తిలకించే అవకాశం కల్పిస్తోంది. దీనితో పాటు, జియో గృహాలకు జియో ఫైబర్ లేదా జియో ఎయిర్‌ఫైబర్ ఉచిత ట్రయల్ కనెక్షన్‌ను కూడా అందిస్తుంది. అల్ట్రా-ఫాస్ట్ ఇంటర్నెట్ ఉచిత ట్రయల్ కనెక్షన్ 50 రోజుల పాటు ఉచితంగా పొందవచ్చు. జియో ఫైబర్ లేదా ఉచిత ట్రయల్ కనెక్షన్‌తో 800+ టీవీ ఛానెల్‌లు, 11+ OTT యాప్‌లు, అపరిమిత WiFi కూడా అందుబాటులో ఉన్నాయి.

ఐపీఎల్ 2025 సీజన్ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్‌ రైడర్స్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో తలపడనుంది. మార్చి 22న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. అదే స్టేడియంలో మే 25న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. మరోవైపు ఇక ఈ లీగ్‌లో క్వాలిఫయర్-1 మ్యాచ్‌తో పాటు.. ఎలిమినేటర్ మ్యాచ్‌కు కూడా హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+