బడ్జెట్ రేంజ్‌లో సామ్‌సంగ్ నుంచి మూడు కొత్త ఫోన్లు లాంఛ్.. ఎంతంటే ??
స్మార్ట్ ఫోన్ లలో టాప్ బ్రాండ్స్ అంటే సామ్‌సంగ్ ఖచ్చితంగా గుర్తొస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో రోజూ ఒక కొత్త ఫోన్ లాంఛ్ అవుతూనే ఉంటుంది. వినియోగదారులను ఆకట్టుకునేందుకు కొత్త కొత్త ఫీచర్లతో తక్కువ ధరకే 5జీ ఫోన్ లను లాంఛ్ చేస్తున్నాయి.
ఇప్పుడు సామ్‌సంగ్ తమ బ్రాండ్ నుంచి కొత్తగా మూడు కొత్త స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. Galaxy A07 4G, Galaxy F07 4G, Galaxy M07 4G లాంటివి భారత వినియోగదారుల కోసం ప్రత్యేకంగా లాంచ్ చేశారు. మూడు ఫోన్లు ఒకే ఫీచర్లు కలిగి ఉన్నప్పటికీ.. పేర్లు, రంగులు, ధరలలో తేడాలు ఉన్నాయి. ఈ ఫోన్స్ గురించి పూర్తి వివరాలు మీకోసం ప్రత్యేకంగా..

Galaxy A07 4G..
ధర..
Galaxy A07 4G రూ.8,999కి లాంచ్ చేయబడింది. మూడు రంగులలో.. నలుపు, ఆకుపచ్చ, లేత వయొలెట్ అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ శాంసంగ్ అధికారిక స్టోర్‌లో, ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు.
ఫీచర్లు..
- 6.7 అంగుళాల HD+ LCD డిస్‌ప్లే
- MediaTek Helio G99 ప్రాసెసర్
- 4GB RAM, 64GB ఇంటర్నల్ స్టోరేజ్ (మైక్రో ఎస్డీతో 2TB వరకు విస్తరించవచ్చు)
- డ్యూయల్ రియర్ కెమెరా: 50MP ప్రధాన + 2MP డెప్త్ సెన్సార్, 8MP ఫ్రంట్ కెమెరా
- 5000mAh బ్యాటరీ, 25W ఫాస్ట్ ఛార్జింగ్ మద్దతు
- 90Hz రిఫ్రెష్ రేట్, IP54 రేటింగ్
- Android 15, One UI 7 OS
Galaxy F07 4G..
ధర..
Galaxy F07 4G రూ.7,699 ధరతో లభిస్తుంది. ఆకుపచ్చ రంగులో మాత్రమే అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేకంగా కొనుగోలు చేయవచ్చు.
ఫీచర్లు..
- 6.7 అంగుళాల HD+ LCD డిస్‌ప్లే
- MediaTek Helio G99 ప్రాసెసర్
- 4GB RAM, 64GB స్టోరేజ్ (2TB వరకు విస్తరించదగిన మైక్రో ఎస్డీ కార్డ్ సపోర్ట్)
- 50MP + 2MP డ్యూయల్ రియర్ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరా
- 5000mAh బ్యాటరీ, 25W ఫాస్ట్ ఛార్జింగ్
- Android 15, One UI 7 OS
- 90Hz రిఫ్రెష్ రేట్, IP54 రేటింగ్
Galaxy M07 4G..
ధర..
Galaxy M07 4G రూ.6,999కి అమెజాన్‌లో ప్రత్యేకంగా అందుబాటులో ఉంది.
ఫీచర్లు..
- 6.7 అంగుళాల HD+ LCD డిస్‌ప్లే
- MediaTek Helio G99 ప్రాసెసర్
- 4GB RAM, 64GB స్టోరేజ్ (2TB వరకు విస్తరించదగిన మైక్రో ఎస్డీ కార్డ్ సపోర్ట్)
- 50MP + 2MP డ్యూయల్ రియర్ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరా
- 5000mAh బ్యాటరీ, 25W ఫాస్ట్ ఛార్జింగ్ మద్దతు
- Android 15, One UI 7 OS
- 90Hz రిఫ్రెష్ రేట్, IP54 రేటింగ్
ముఖ్యమైన ఫీచర్లు..
- మూడు ఫోన్లూ 4G మద్దతుతో వస్తాయి.
- పెద్ద బాటరీ, వేగవంతమైన ఛార్జింగ్ సామర్ధ్యం.
- హై రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే, IP54 రేటింగ్
- Android 15 ఆధారంగా One UI 7 OS, ఆరు ప్రధాన సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ మద్దతు.
-
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!!












Click it and Unblock the Notifications