ఒకే వరసలో అష్ట గ్రహాలు- ఎవరికి అరిష్టం?
Parade Of Planets: అంతరిక్షంలో మరో అద్భుతం సంభవించబోతోంది. అష్ట గ్రహాలు ఒకే వరుసలో రానున్నాయి. జూన్ 3వ తేదీన ఈ అద్భుతం ఆవిష్కృతమౌతుంది. బుధ, గురు, అంగారక, శని, యురేనస్, నెప్ట్యూన్, గ్రహాలు ఒకే అమరికలోకి వస్తాయి. 24 గంటల పాటు ఇలా కనువిందు చేస్తాయి. ఎలాంటి పరికరాలు లేకుండా వాటిని మనం నేరుగా చూడొచ్చు.
భూమికి సుదూరంగా, పాలపుంతకు చివరన ప్రకాశ రహితంగా ఉండే యురేనస్, నెప్ట్యూన్‌ను చూడటానికి బైనాక్యులర్లు అవసరమౌతాయి. పరిణామంలో మెర్క్యురి చిన్నది కావడం వల్ల దీన్ని చూడటానికి కూడా బైనాక్యులర్ లేదా టెలిస్కోప్ అవసరమౌతుంది. బృహస్పతి గ్రహాన్ని చూడటం సులువు. అత్యంత ప్రకాశవంతంగా మెరుస్తూ కనిపిస్తుందా ప్లానెట్.

గ్రహాలన్నీ ఒకే వరసలో ఉన్న వేర్వేరు రాశుల్లోకి ప్రవేశించినప్పుడు ఇలాంటి అద్భుతం సంభవిస్తుంటుంది. ఇది సాధారణంగా జరిగే ప్రక్రియే. ఇదివరకు చంద్రుడు, గురుడు, శని గ్రహాలు ఒకే వరుసలో కనిపించాయి. వాటితో పాటు మరో సందర్భంలో గురు, అంగారక, శని, యురేనస్, నెప్ట్యూన్ ప్లానెట్లు కూడా ఒకే అలైన్‌మెంట్‌లో వచ్చాయి.
ఇప్పుడు మళ్లీ అలాంటి అద్భుతమే ఆకాశంలో కనువిందు చేయబోతోంది. ఈ పరేడ్- తొలుత శనిగ్రహం రాకతో ఈ పరేడ్ ఆరంభమౌతుంది. శని గ్రహం కుంభ రాశిలోకి ప్రవేశిస్తుంది. ఆ తరువాత వరుసగా నెప్ట్యూన్- మీనం, జుపిటర్, యురేనస్ గ్రహాలు మేషరాశిలో, బుధగ్రహం వృషభరాశిలో ప్రవేశించాయి.
శనిగ్రహం-0.9, నెప్ట్యూన్- 7.9, గురుగ్రహం- మైనస్ 2.2, యురేనస్- 5.8, బుధుడు- మైనస్ 0.9 కక్ష్యలో కనిపించే అవకాశం ఉంది. చివరగా బుధగ్రహం రాకతో ఈ లైనప్ పరిపూర్ణమౌతుంది. 3వ తేదీన సూర్యోదయానికి 25 నిమిషాల ముందు ఈ అద్భుతాన్ని మనం సాధారణ కంటితో చూడొచ్చు.
On June 4th, a rare event known as the Parade of Planets will occur.
— Massimo (@Rainmaker1973) May 21, 2024
6 planets + the crescent Moon will align in a straight line. pic.twitter.com/qLotKGF4qy
వీటిల్లో బుధ, గురు, శని గ్రహాలను సాధారణ కంటితో చూడొచ్చు.మిగిలిన మూడింటినీ వీక్షించడానికి స్పేస్ టెలిస్కోప్, బైనాక్యులర్లు అవసరమౌతాయి. కాగా వీటిని వీక్షించడానికి నాసా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. వాటిని తన అధికారిక యూట్యూబ్ ఛానల్‌లో లైవ్ టెలికాస్ట్ చేసింది. ఇలా గ్రహాలు ఒకే వరసలోకి రావడం వల్ల వాటి ప్రత్యేక స్థితిగతులను అధ్యయనం చేయడానికి వీలవుతుందని తెలిపింది.












Click it and Unblock the Notifications