అంబరాన మరో అద్భుతం
నేడు రాఖీ పౌర్ణమి. ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో వచ్చే పౌర్ణమి రోజును రక్షా బంధన్‌గా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అన్నా చెల్లెళ్ల మధ్య ఉండే అనుబంధాలకు ప్రతీక.. ఈ పండుగ. తన తోడబుట్టిన వాడు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని, క్షేమంగా ఉండాలని కోరుకుంటూ అక్కా చెల్లెళ్లు చేతికి రక్షను కడతారు.
ఈ సారి రక్షా బంధన్ పండగ శ్రావణ సోమవారం నాడు రావడం ప్రత్యేకతను సంతరించుకుంది. దేశవ్యాప్తంగా శివాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేస్తోన్నారు. శివలింగాలకు అభిషేకిస్తోన్నారు. వారణాశి, ఉజ్జయినీ, ప్రయాగ్‌రాజ్, సోమ్‌నాథ్, అయోధ్యలోని నాగేశ్వరనాథ్.. వంటి ఆలయాలు భక్తులతో పోటెత్తాయి.

అదే సమయంలో నేడు అంబరాన మరో అద్భుతం సంభవించబోతోంది. పున్నమి చంద్రుడు బ్లూ సూపర్ మూన్‌గా కనువిందు చేయనున్నాడు. భూమికి మరింత చేరువకు వస్తాడు చంద్రుడు. 90 శాతం అధిక ప్రకాశవంతంగా కనిపిస్తాడు. ఈ ఏడాదిలో ఇదే తొలి బ్లూ సూపర్ మూన్ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
భూమికి చందమామ గరిష్ఠ సమీపానికి వచ్చినప్పుడు సూపర్‌మూన్ ఏర్పడుతుంది. ఈ ఏడాదిలో వరుసగా నాలుగు సూపర్‌మూన్‌లలో ఇది మొదటిది. దీని తరువాత సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్‌లల్లో సూపర్‌మూన్ ఏర్పడతాయి.
సెప్టెంబర్ 17వ తేదీన సూపర్ మూన్ ఏర్పాడుతుంది. దీనికి హార్వెస్ట్ మూన్‌గా పిలుస్తారు. పాక్షికంగా గ్రహణం సంభవించనుందారోజున. అక్టోబర్‌లో ఏర్పడే పౌర్ణమి నాటి చందమామను హంటర్స్ మూన్ అని పేరు పెట్టారు. ఈ సంవత్సరంలో చివరి సూపర్‌మూన్ నవంబర్ 15వ తేదీన సంభవిస్తుంది.
సాధారణంగా ఒక ఏడాదిలో రెండు లేదా మూడు సూపర్‌మూన్‌లు ఏర్పడుతుంటాయి. చందమామ కక్ష్య భూమికి దగ్గరగా ఉన్నప్పుడు సూపర్‌మూన్ ఆవిష్కృతమౌతుంది. సాధారణ పౌర్ణమి రోజుల్లో కంటే కూడా సూపర్ మూన్ సమయంలో చందమామ మరింత ప్రకాశవంతంగా కనువిందు చేస్తాడు. పరిమాణంలోనూ భారీగా కనిపిస్తాడు.
ఫార్మర్స్ అల్మానాక్ ప్రకారం చూసుకుంటే.. ఈ సంవత్సరంలో మొదటి పౌర్ణమి ఇదే. దీన్ని స్టర్జన్ సూపర్‌మూన్‌గా పిలుస్తారు. స్టర్జన్ చంద్రుడిని గ్రీన్ కార్న్ మూన్, గ్రెయిన్ మూన్, ఫ్లయింగ్-అప్ మూన్, హార్వెస్ట్ మూన్, రైజింగ్ మూన్, బ్లాక్ చెర్రీస్ మూన్, మౌంటెన్ షాడో మూన్ అని కూడా పిలుస్తారు.












Click it and Unblock the Notifications