Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఈ ఏడాది తొలి సూర్య గ్రహణం- అక్కడ మాత్రమే

Solar Eclipse 2025: ఈ ఏడాది మొట్టమొదటి పాక్షిక సూర్యగ్రహణం పలు దేశాల్లో కనువిందు చేస్తోంది. అత్యంత అరుదైన గ్రహణం ఇది. లక్షలాది మంది స్వయంగా దీన్ని వీక్షిస్తోన్నారు. ఈ అరుదైన సంపూర్ణ సూర్యగ్రహణాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది.

ఉత్తర అమెరికా ఖండంలో మాత్రమే కనిపిస్తోంది. ఆయా దేశాల ప్రజలు ఈ సూర్యగ్రహణాన్ని వీక్షించగలుగుతున్నారు. అమెరికా, కెనడాల్లో కొన్ని ప్రాంతాల్లోనే గ్రహణం కనువిందు చేస్తోంది. అమెరికా కాలమానం ప్రకారం న్యూయార్క్‌లో తెల్లవారు జామున 6:35 నిమిషాలకు గ్రహణకాలం ఆరంభమైంది.

Solar eclipse 2025 Sky gazers witness for a celestial spectacle as a partial solar eclipse

పెన్సిల్వేనియా- 6:46, న్యూజెర్సీ- 6:43, వర్జీనియా- 6:50 నిమిషాలకు గ్రహణం మొదలైంది. భారత కాలమానాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఈ మధ్యాహ్నం 2:20 నిమిషాలకు గ్రహణం మొదలైంది. సాయంత్రం 6:13 నిమిషాల వరకు కొనసాగుతుంది. బోస్టన్, ఉత్తర అమెరికాలోని కొన్ని ప్రాంతాల ప్రజలు ఈ సంపూర్ణ సూర్యగ్రహణాన్ని వీక్షించగలుగుతున్నారు.

న్యూ హాంప్‌షైర్, వెర్మాంట్, మసాచుసెట్స్, రోడ్ ఐలాండ్, కనెక్టికట్, డెలావేర్, మేరీల్యాండ్‌‌‌లల్లో నివసించే ప్రజలు సూర్యగ్రహణాన్ని చూడగలుగుతున్నారు. మసాచుసెట్స్‌- 55, న్యూ హాంప్‌షైర్- 57, వెర్మాంట్- 53, న్యూయార్క్‌- 45 శాతం వరకు సూర్య గ్రహణం కనిపించింది.

బోస్టన్- 43, ఫిలడెల్ఫియా- 12 శాతం వరకు మాత్రమే చంద్రుడి ఛాయ సూర్యుడిని కమ్మేసింది. వాషింగ్టన్ డీసీలో కనిపించిన సూర్యగ్రహణం ఒక శాతం. వర్జీనియా బీచ్‌కు దక్షిణ దిశతో పాటు న్యూయార్క్‌లోని బఫెలోకు తూర్పు దిక్కున గ్రహణం కనిపించలేదు.

యూరప్, దక్షిణ అమెరికా- ఆసియా ఉత్తర ప్రాంతాలు, ఆఫ్రికాలోని వాయవ్య దేశాలు, అట్లాంటిక్, ఆర్కిటిక్ ప్రాంతాల్లో ఈ పాక్షిక సూర్యగ్రహణం కనిపిస్తోన్నట్లు టైమ్ అండ్ డేట్ వెబ్‌సైట్ తెలిపింది. కెనడా, గ్రీన్ ల్యాండ్, ఐస్‌లాండ్, నార్వే, పోర్చుగల్, ఆస్ట్రియా, బార్బడొస్, బెలారస్, బెల్జియం, బెర్ముడా, బ్రెజిల్, బ్రిటీష్ వర్జీనియా ఐలండ్స్, క్రొయేషియా వంట దేశాల్లో పాక్షిక సూర్యగ్రహణం సంభవించింది.

తదుపరి సూర్యగ్రహణం 2026 ఆగస్టు 12వ తేదీన సంభవిస్తుంది. ఇది సంపూర్ణ గ్రహణం. చాలా ప్రాంతాలలో పాక్షికంగానే కనిపించినప్పటికీ ప్రధానంగా యూరప్, ఉత్తర ఆసియా, ఉత్తర/పశ్చిమ ఆఫ్రికా, ఉత్తర అమెరికాలో ఎక్కువ భాగం, పసిఫిక్, అట్లాంటిక్ మరియు ఆర్కిటిక్ వంటి కొన్ని ప్రాంతాలు సంపూర్ణంగా కనిపిస్తుంది.

ఎలాంటి పరికరాలు లేకుండా సూర్యగ్రహణాన్ని వీక్షించవచ్చా?

చంద్రగ్రహణం తరహాలో సూర్యగ్రహణాన్ని ఎలాంటి పరికరాలు లేకుండా వీక్షించకూడదు. సూర్యగ్రహణాన్ని చూడాలనుకుంటే ఎక్స్‌రే వంటి బ్లాక్ ఫిల్మ్‌లను వినియోగించాలి. సైంటిస్టులు, ఆస్ట్రో ఫొటోగ్రాఫర్లు ప్రత్యేక ఫిల్టర్లను ఉపయోగిస్తారు.

సూర్యగ్రహణం మళ్లీ ఎప్పుడు సంభవిస్తుంది?

ఈ ఏడాది సెప్టెంబర్ 21వ తేదీన మరోసారి పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఇది కూడా భారత్‌లో కనిపించదు. దక్షిణ పసిఫిక్, న్యూజిలాండ్, అంటార్కిటికాల్లోనే ఈ పాక్షిక సూర్యగ్రహణాన్ని చూడొచ్చు.

సూర్యగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది?

సూర్యుడు- భూమి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు సూర్యగ్రహణం సంభవిస్తుంది. సూర్యుడి నుంచి ప్రసరించే కాంతిని చంద్రుడు అడ్డుకుంటాడు. ఫలితంగా- భూమిపై చంద్రుడి నీడ ఏర్పడుతుంది. ఇది కొన్ని ప్రాంతాలలో సూర్యుని కాంతిని పూర్తిగా లేదా పాక్షికంగా అడ్డుకుంటుంది. అలాంటప్పుడు పాక్షిక, లేదా సంపూర్ణ సూర్యగ్రహణం సంభవిస్తుంది. భూమి నుంచి చూసేవాళ్లకు చంద్రుడు అడ్డుగా ఉండటం వల్ల సూర్యుడు సంపూర్ణంగా కనిపించడు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+