17న అరుదైన సూర్యగ్రహణం- విజువల్ వండర్: మళ్లీ ఇప్పట్లో చూడలేం
త్వరలో ఓ అద్భుతమైన ఖగోళ సంఘటన చోటు చేసుకోనుంది. ఈ సంవత్సరం మొట్టమొదటి సూర్యగ్రహణం సంభవించబోతోంది. సూర్యగ్రహణాలు ఏర్పడటం సాధారణమే అయినప్పటికీ.. దీనికి మాత్రం చాలా ప్రత్యేకత ఉంది. అందుకే దీనికోసం శాస్త్రవేత్తలతో పాటు ఖగోళ వీక్షకులు కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్నారు. నాసా, యూరోపియన్ స్పేస్ సెంటర్స్ ఈ సూర్యగ్రహణాన్ని లైవ్ టెలికాస్ట్ చేయనున్నాయి.
ఫిబ్రవరి 17వ తేదీన మంగళవారం ఈ సూర్యగ్రహనం సంభవించనుంది. ఇది సాధారణ గ్రహణం కాదు. యాన్యులార్ సోలార్ ఎక్లిప్స్.. అంటే వార్షిక సూర్యగ్రహణం. దీనిని రింగ్ ఆఫ్ ఫైర్ గా కూడా పిలుస్తారు. చంద్రుడి ఛాయ చుట్టూ ప్రకాశవంతమైన వృత్తాకార సూర్యకాంతి వలయం ఏర్పడుతుంది. ఇటువంటి గ్రహణాలు దృశ్యపరంగా అద్భుతమైనవి. ఈ గ్రహణ కాలం మొత్తం రెండు గంటలకు పైగా కొనసాగనుంది. ఇది సాయంత్రం 5:26కు ప్రారంభమౌతుంది. 7:57 నిమిషాల వరకు ముగుస్తుంది.

రింగ్ ఆఫ్ ఫైర్ గరిష్ట సమయం సుమారు 2 నిమిషాల 20 సెకన్ల పాటు ఉంటుంది. కనువిందు చేస్తుంది. భూమికి, సూర్యుడికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుందనేది తెలిసిన విషయమే. యాన్యులార్ సూర్యగ్రహణ సమయంలో చంద్రుడు భూమి నుండి మరింత దూరంలో ఉండటం వల్ల అది సూర్యుని కంటే చిన్నదిగా కనిపిస్తుంది. ఈ వ్యత్యాసం కారణంగా చంద్రుడు సూర్యుడిని పూర్తిగా కప్పలేడు. దాని అంచులు ప్రకాశవంతమైన వలయంగా నిప్పుల కుంపటిలా కనిపిస్తాయి. అందుకే దీనికి రింగ్ ఆఫ్ ఫైర్ అని పేరు.
యాన్యులార్ గ్రహణ సమయంలో చంద్రుడు సూర్యునిలో దాదాపు 96 శాతం కప్పి ఉంచుతాడు. చంద్రుడు భూమి నుండి ఎక్కువ దూరంలో ఉండటం వల్ల అది కొద్దిగా చిన్నదిగా కనిపిస్తుంది సూర్యుడిని పూర్తిగా నిరోధించదు. ఫలితంగా సూర్యుని బయటి అంచు ప్రకాశవంతమైన వృత్తాకార వలయాన్ని ఏర్పరుస్తూ కనిపిస్తూ ఉంటుంది. ఇది చాలా అరుదైన దృశ్యం. అదే దీని ప్రత్యేకత. ఈ సూర్యగ్రహణం భారత్ లో ఎక్కడా కనిపించదు
దక్షిణార్ధగోళంలోని అనేక ప్రాంతాల ప్రజలు దీన్ని చూడగలుగుతారు. ఈ అద్భుత ఖగోళ సంఘటనను నేరుగా చూడగలిగే దేశాల్లో దక్షిణాఫ్రికా, అర్జెంటీనా, చిలీ, టాంజానియా, నమీబియా, జింబాబ్వే, మొజాంబిక్, మడగాస్కర్, బోట్సువానా వంటివి ఉన్నాయి. అంటార్కిటికా, మారిషస్, సౌత్ జార్జియా, బ్రిటిష్ ఇండియన్ ఓషన్ టెరిటరీ, ఫ్రెంచ్ సదరన్ టెరిటరీస్ వంటి ఇతర సుదూర ప్రాంతాల నుండి కూడా ఈ గ్రహణం స్పష్టంగా కనిపిస్తుంది. రింగ్ ఆఫ్ ఫైర్ ను ప్రత్యక్షంగా వీక్షించగలుగుతారు.
-
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications