Stargate: 500 బిలియన్ డాలర్ల అతిపెద్ద AI ప్రాజెక్ట్: దశ తిరిగినట్టే

Donald Trump: ఈ క్షణం నుంచే అమెరికా స్వర్ణయుగం ఆరంభమైందంటూ ఆ దేశాధ్యక్షుడి హోదాలో డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన హామీ- కార్యరూపాన్ని దాల్చుతున్నట్టే కనిపిస్తోంది. ప్రమాణ స్వీకారం చేసిన మూడో రోజే అతి పెద్ద ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్ట్‌ను ప్రకటించారు.

దీని విలువ- 500 బిలియన్ డాలర్లు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సెగ్మెంట్‌లో పని చేస్తోన్న ఓపెన్ ఏఐ, ఒరాకిల్‌తో పాటు జపాన్‌కు చెందిన ఫైనాన్షియల్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ సాఫ్ట్ బ్యాంక్.. దీన్ని నెలకొల్పబోతోన్నాయి. ఈ ప్రాజెక్ట్‌కు స్టార్ గేట్ అని పేరు పెట్టారు డొనాల్డ్ ట్రంప్.

Stargate OpenAI Oracle and Softbank joined for AI

దీనికి అనుబంధంగా- మైక్రోసాఫ్ట్, అబుదాబికి ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ ఎంజీఎక్స్, చిప్ తయారీ రంగంలో పని చేస్తోన్న ఎన్‌విడియా పని చేస్తాయి. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, డేటా సెంటర్లను ఏర్పాటు చేయడానికి అవసరమైన సాంకేతిక సహకారాన్ని అందజేస్తాయి. దీనికి కావాల్సిన మౌలిక సదుపాయాలను అమెరికా ప్రభుత్వం సమకూర్చుతుంది. ఈ ప్రాజెక్ట్‌లో భాగస్వామిగా ఉంటుంది.

వైట్‌హౌస్‌లో ఒరాకిల్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ల్యారీ ఎల్లిసన్, సాఫ్ట్‌ బ్యాంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మసయోషి సన్, ఓపెన్ ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మాన్‌లతో సమావేశం అయ్యారు. స్టార్ గేట్ ప్రాజెక్ట్‌కు అవసరమైన మౌలిక సదుపాయాలు, ఆర్థిక- మానవ వనరులు, విస్తరణ.. వంటి అంశాలపై చర్చించారు. అనంతరం దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.

టెక్సాస్‌లో ఇది ఏర్పాటు కానుంది. ఇందులో భాగంగా ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్లు అక్కడ రూపుదిద్దుకోనున్నాయి. తొలిదశలో 100 బిలయన్ డాలర్లను ఇందులో ఇన్వెస్ట్ చేయనున్నారు. క్రమంగా అయిదు దశల్లో 500 బిలియన్ డాలర్లను ఇందులో పెట్టుబడిగా పెడతారు. తొలి విడతలో సాఫ్ట్‌బ్యాంక్, ఓపెన్ ఏఐ జాయింట్‌గా 19 బిలియన్ డాలర్లను పెట్టుబడిగా పెట్టాలని నిర్ణయించాయి.

దీనివల్ల అమెరికాతో పాటు ఇతర దేశాలకు చెందిన నిపుణులకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలను లభిస్తాయని బ్లూమ్‌బర్గ్ అంచనావేసింది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, దీనికి అనుబంధ సంస్థలు విస్తృతంగా ఏర్పాటవుతాయని, సాఫ్ట్‌వేర్ రంగంలో ఇదొక విప్లవాత్మక మార్పునకు శ్రీకారం చుట్టినట్టవుతుందని వ్యాఖ్యానించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+