కొత్త కారు కొనేముందు TCS గురించి తెలుసుకోండి!
దేశంలో జీఎస్టీ రేట్లు తగ్గిన నేపథ్యంలో కొత్త కారు కొనాలని ఆలోచిస్తున్నారా? కొత్త జీఎస్టీ రేట్ల వల్ల కార్ల ధరలు తగ్గాయి. అయితే మీరు చెల్లించాల్సిన టీసీఎస్(Tax Collected at Source) గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ కొత్త ధరలు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వస్తాయి.
టీసీఎస్ అంటే ఏమిటి, ఎప్పుడు చెల్లించాలి?
టీసీఎస్ (TCS) అనేది మీరు కారు కొనుగోలు చేసేటప్పుడు చెల్లించాల్సిన ఓ అడ్వాన్స్ ట్యాక్స్. ఇది కేంద్ర సర్కారు వసూలు చేసే పన్ను. మీ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ.10 లక్షల కంటే ఎక్కువగా ఉంటే, డీలర్ మీ నుంచి 1% టీసీఎస్ వసూలు చేస్తాడు. ఉదాహరణకు, మీరు రూ.15 లక్షల విలువైన కారు కొనుగోలు చేస్తే.. మీరు రూ.15,000 టీసీఎస్ చెల్లించాలి. ఈ మొత్తం మీ మొత్తం చెల్లింపులో భాగంగా ఉంటుంది.

టీసీఎస్ డబ్బులు ఎక్కడికి వెళ్తాయి?
మీరు చెల్లించిన టీసీఎస్ డబ్బును డీలర్ నేరుగా ప్రభుత్వానికి జమ చేస్తాడు. ఈ మొత్తం మీ ఫారం 26AS, AISలో కనిపిస్తుంది. మీరు ఆదాయ పన్ను రిటర్న్ (ITR) దాఖలు చేసేటప్పుడు, ఈ టీసీఎస్ మొత్తాన్ని మీ మొత్తం పన్ను బాధ్యతలో సర్దుబాటు చేసుకోవచ్చు. ఒకవేళ మీరు అదనపు పన్ను చెల్లించినట్లయితే, మీకు ఆ మొత్తం రీఫండ్ అవుతుంది. అయితే, ఈ టీసీఎస్ మొత్తంపై మీకు ఎలాంటి వడ్డీ లభించదు.
కొత్త కారు కొనేటప్పుడు ఈ విషయాలు గుర్తుంచుకోండి
*మీ ఇన్వాయిస్‌లో టీసీఎస్ మొత్తం సరిగ్గా రాసి ఉందో లేదో తనిఖీ చేసుకోండి.
*చెల్లింపు చేసిన తర్వాత, డీలర్ నుంచి తప్పనిసరిగా ఫారం 27D తీసుకోండి.
*ఐటీఆర్ దాఖలు చేసేటప్పుడు ఈ మొత్తాన్ని సులభంగా సర్దుబాటు చేసుకోవచ్చు.
సెప్టెంబర్ 22 నుంచి జీఎస్టీ రేట్లు తగ్గడం వల్ల కార్ల ధరలు తగ్గుతాయి. అయితే, మీరు రూ.10 లక్షలకు మించి విలువైన కారు కొనుగోలు చేస్తే, ఒక శాతం టీసీఎస్ చెల్లించడం తప్పనిసరి. కాబట్టి, కారు కొనుగోలు చేయడానికి ముందు ఈ చిన్న ట్యాక్స్ లెక్కను తప్పకుండా అర్థం చేసుకోండి.
-
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా? -
నియోజకవర్గాల పెంపు వేళ బిగ్ ట్విస్ట్, ఎవరికి అనుకూలం..!! -
ఫ్లాప్ రికార్డులన్నీ బ్రేక్ చేసిన హీరో అతనే.. రూ.45 కోట్లతో బడ్జెట్ - రూ. 60 వేలు కలెక్షన్స్ !












Click it and Unblock the Notifications