Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఇండియన్ మార్కెట్లోకి " టెక్నో " కొత్త 5G ఫోన్..!

మారుతున్న కాలానుగుణంగా పలు సంస్థలు రోజుకో స్మార్ట్ ఫోన్ ని రిలీజ్ చేస్తున్నాయి. భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో పోటీ రోజురోజుకూ పెరుగుతోంది. తక్కువ బడ్జెట్‌లో హై-ఎండ్ ఫీచర్లను అందించడానికి అనేక కంపెనీలు కొత్త మోడళ్లను తీసుకువస్తున్నాయి. రోజుకో కొత్త ఫోన్ రిలీజ్ అవుతోంది. ఒకదాన్ని మించి మరొకటి అన్నట్టు కస్టమర్లను ఆకర్షించేందుకు దిగ్గజ కంపెనీలు సైతం పోటీపడుతున్నారు.

ఈ క్రమంలోనే ప్రముఖ సంస్థ టెక్నో (TECNO) ఇండియన్ మార్కెట్లోకి కొత్త 5G స్మార్ట్‌ఫోన్ TECNO Spark 50 5Gను విడుదల చేసింది. మిడ్‌రేంజ్ వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ డివైస్, బలమైన బ్యాటరీ, స్టర్డీ డిజైన్, ఆధునిక కనెక్టివిటీ ఫీచర్లతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. రోజువారీ వినియోగంతో పాటు గేమింగ్, మల్టీటాస్కింగ్ అవసరాలను కూడా ఈ ఫోన్ సులభంగా నిర్వహించగలదని కంపెనీ చెబుతోంది. ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్స్, ధర ఎంతో మీకోసం ప్రత్యేకంగా..

tecno-spark-50-5g-mobile-launched-in-india-and-full-details-about-price-specifications-also-availab

TECNO Spark 50 5G ఫీచర్స్..

పనితీరు..

TECNO Spark 50 5G లో MediaTek Dimensity 6400 ప్రాసెసర్‌ను అందించారు. ఇది మల్టీటాస్కింగ్, సాధారణ గేమింగ్, యాప్‌ల మధ్య స్మూత్ స్విచింగ్‌కు అనుకూలంగా పనిచేస్తుంది. 4GB మరియు 6GB RAM వేరియంట్లు అందుబాటులో ఉండగా, వర్చువల్ RAM సపోర్ట్‌తో మొత్తం 18GB వరకు విస్తరించుకోవచ్చు.

స్టోరేజ్..

స్టోరేజ్ విషయంలో కూడా ఈ ఫోన్ మంచి ఫ్లెక్సిబిలిటీ ఇస్తుంది. 128GB అంతర్గత స్టోరేజ్‌తో పాటు మైక్రో SD కార్డ్ ద్వారా 2TB వరకు పెంచుకునే అవకాశం ఉంది. ఫోటోలు, వీడియోలు, యాప్‌లు ఎక్కువగా వాడే వారికి ఇది పెద్ద ప్లస్ పాయింట్‌గా మారుతుంది.

సాఫ్ట్‌వేర్ కాలింగ్..

ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత HiOS 16 పై నడుస్తుంది. యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్‌ఫేస్‌తో పాటు కస్టమైజేషన్ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. కాలింగ్ సమయంలో క్లియర్ వాయిస్ కోసం నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ ఇవ్వడం వల్ల శబ్దం ఉన్న ప్రదేశాల్లో కూడా స్పష్టమైన సంభాషణ సాధ్యమవుతుంది.

అదనంగా, స్మార్ట్ జెస్చర్స్, యాప్ క్లొనింగ్, గేమ్ మోడ్ వంటి ఫీచర్లు యూజర్ అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి.

భారీ బ్యాటరీ & ఫాస్ట్ ఛార్జింగ్..

ఈ ఫోన్‌లో 6500mAh భారీ బ్యాటరీని అందించారు. ఇది ఒకసారి ఛార్జ్ చేస్తే రోజంతా, కొన్నిసార్లు రెండో రోజుకూ సరిపడేలా పనితీరును ఇస్తుంది. 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటంతో తక్కువ సమయంలోనే ఫోన్ పూర్తి ఛార్జ్ అవుతుంది. పవర్ సేవింగ్ మోడ్, స్మార్ట్ బ్యాటరీ మేనేజ్‌మెంట్ వంటి ఫీచర్ల వల్ల బ్యాటరీ లైఫ్ మరింత పొడిగించవచ్చు. ఎక్కువగా వీడియోలు చూడడం, గేమ్స్ ఆడే వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది.

డిస్‌ప్లే..

TECNO Spark 50 5G లో 6.78 అంగుళాల HD+ డిస్‌ప్లేను ఇచ్చారు. 120Hz రిఫ్రెష్ రేట్ వల్ల స్క్రోలింగ్, గేమింగ్ అనుభవం స్మూత్‌గా ఉంటుంది. పెద్ద స్క్రీన్ కారణంగా వీడియో స్ట్రీమింగ్, సోషల్ మీడియా వినియోగం మరింత ఆనందంగా ఉంటుంది.

కెమెరా..

ఫోటోగ్రఫీ కోసం వెనుక 50MP ప్రైమరీ కెమెరా ఉంది. ఇది డేలైట్ ఫోటోల్లో మంచి డిటైల్స్ అందిస్తుంది. ముందు భాగంలో 8MP సెల్ఫీ కెమెరా ఉంది. AI బ్యూటీ మోడ్, HDR, నైట్ మోడ్ వంటి ఫీచర్లు ఫోటో క్వాలిటీని మెరుగుపరుస్తాయి.

డిజైన్ & ప్రొటెక్షన్..

ఈ ఫోన్ యొక్క ప్రధాన ఆకర్షణ దాని బలమైన నిర్మాణం. MIL-STD-810H సర్టిఫికేషన్‌తో 1.5 మీటర్ల ఎత్తు నుంచి పడినా పెద్ద నష్టం కలగకుండా డిజైన్ చేశారు. IP64 PRO రేటింగ్ వల్ల దుమ్ము, నీటి చినుకుల నుంచి రక్షణ లభిస్తుంది.

స్లీక్ ఫినిష్‌తో పాటు ప్రీమియం లుక్ ఇచ్చేలా డిజైన్ చేయడం వల్ల ఇది స్టైలిష్‌గా కూడా కనిపిస్తుంది.

కనెక్టివిటీ..

Spark 50 5G లో కనెక్టివిటీకి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు. సిగ్నల్ బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో కూడా మంచి నెట్‌వర్క్ అందించేలా ఫీచర్లు ఉన్నాయి. UPS 3.0 టెక్నాలజీతో UPI పేమెంట్స్ వేగంగా పూర్తవుతాయి.

4x4 MIMO సపోర్ట్ వల్ల డౌన్‌లోడ్ స్పీడ్‌లు గణనీయంగా పెరుగుతాయి. అంతేకాకుండా, నెట్‌వర్క్ లేకపోయినా 1.5 కిలోమీటర్ల పరిధిలోని ఇతర డివైజ్‌లతో కనెక్ట్ అయ్యే ఆఫ్‌లైన్ కమ్యూనికేషన్ ఫీచర్ కూడా ఇందులో ఉంది.

అదనంగా, డ్యూయల్ 5G సపోర్ట్, బ్లూటూత్, వై-ఫై వంటి అన్ని ఆధునిక కనెక్టివిటీ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.

ధరలు & లభ్యత..

TECNO Spark 50 5G రెండు వేరియంట్లలో లభిస్తుంది. 4GB + 128GB మోడల్ ధర ₹16,999 కాగా, 6GB + 128GB మోడల్ ధర ₹18,999గా నిర్ణయించారు.

ఏప్రిల్ 3న మధ్యాహ్నం 12 గంటల నుంచి అమెజాన్‌తో పాటు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ స్టోర్లలో అమ్మకాలు ప్రారంభమవుతాయి.

కలర్స్..

ఫాంటసీ పర్పుల్, మింట్ గ్రీన్, ఇంక్ బ్లాక్, షాంపైన్ గోల్డ్ వంటి ఆకర్షణీయమైన రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది.

బడ్జెట్‌లో మంచి ఫీచర్లతో 5G ఫోన్ కోసం చూస్తున్న వినియోగదారులకు ఇది ఒక మంచి ఎంపికగా చెప్పొచ్చు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+