2025, డిసెంబర్ 19..ఏం జరుగనుంది.. NASA ఎందుకు ఉలిక్కిపడుతోంది
మన సౌర వ్యవస్థలోకి ఇటీవల ప్రవేశించిన ఓ తోకచుక్క అంతరిక్ష పరిశోధకులకు సవాల్ విసురుతోంది. దాని కదలికలు ఆశ్చర్యానికి గురి చేస్తోన్నాయి. ఎటు తిరిగి ఎటు వస్తుందో.. అనే ఆందోళన వారిలో నెలకొంది. దీని ప్రభావం భూమిపై ఉండకపోవచ్చనడానికి గ్యారంటీ ఇవ్వట్లేదు. దీనికి 3ఐ/అట్లాస్ (3I/ATLAS)గా పేరు పెట్టారు. ఇదొక ఇంటర్ స్టెల్లార్ తోకచుక్క. ఈ నెల ప్రారంభంలో దీన్ని గుర్తించారు. ఇలాంటి తోకచుక్కను గుర్తించడం ఇది మూడోసారి మాత్రమే.
జూలై 1వ తేదీన చిలీలో గల నాసా ATLAS టెలిస్కోప్ గుర్తించింది. ఈ ఆబ్జెక్ట్.. డిసెంబర్ 19వ తేదీన భూమికి అత్యంత దగ్గరగా రానుంది. ఈ నెల 29న సూర్యుడికి అతి సమీపానికి వెళ్లనుంది. అధికారికంగా ఇది ఒక తోకచుక్కగా నిర్ధారించినప్పటికీ భిన్న వాదనలు వ్యక్తమౌతున్నాయి. ఇంటర్ స్టెల్లార్ కామెట్ అనే వాదనను హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన భౌతిక శాస్త్రవేత్త ప్రొఫెసర్ లోబ్ కొట్టిపారేస్తోన్నారు.

దీన్ని గ్రహాంతరవాసులు పంపి ఉండొచ్చనే వాదనకు తెర తీశారు. ఇది ఏలియన్ల వాహనంగా భావిస్తోన్నారు. ఈ ఆబ్జెక్ట్ కక్ష్య, పరిమాణం, కదలికలు వంటి అంశాలు సహజంగా ఏర్పడినది కాదని ప్రొఫెసర్ లోబ్ తేల్చి చెబుతున్నారు. మనకంటే ఎంతో అభివృద్ధి చెందిన గ్రహాంతర నౌక లేదా ఓ ప్రోబ్ అయి ఉండవచ్చని పేర్కొన్నారు. ఈ కామెట్.. సూర్యుని చుట్టూ తిరిగే కక్ష్య- భూమి కక్ష్యకు అయిదు డిగ్రీల లోపే ఉండటం యాదృచ్ఛికంగా కాదని స్పష్టం చేస్తోన్నారు. ఇలాంటి యాదృచ్ఛిక ఘటనలు సంభవించే అవకాశం 0.2 శాతం మాత్రమే ఉంటుందని ఆయన తెలిపారు.
సాధారణ తోకచుక్కలతో పోల్చుకుంటే ఈ ఇంటర్ స్టెల్లార్ చాలా భిన్నంగా ఉండటం లోబ్ వాదనలకు బలాన్ని చేకూరుస్తోంది. దీని కక్ష్య పరిధి.. ఇతర తోకచుక్కలతో పోల్చుకుంటే అధికంగా ఉంటోంది. దాదాపు 20 కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉండటం.. ఓ సాధారణ గ్రహశకలం కంటే పరిణామంలో చాలా పెద్దదిగా ఉండటం చర్చనీయాంశమైంది. త్వరలోనే ఈ తోకచుక్క.. వీనస్, మార్స్, జుపీటర్ గ్రహాలకు అతి సమీపంలో నుంచి వెళ్లే అవకాశం ఉంది. ఒకవేళ దాని కదలికలు సహజ సిద్ధంగా ఉంటే ఇలాంటి అలైన్మెంట్ ఏర్పడే అవకాశం 0.005 శాతం మాత్రమేనని లోబ్ పేర్కొన్నారు.
🚨 BREAKING: Harvard astronomer Avi Loeb now says there is a 40% chance 3I/Atlas is alien technology pic.twitter.com/JNaXk079rm
— Pesquisador ! (@ospensadorestt) October 27, 2025
భూమికి ముప్పు కలిగించే అంతరిక్ష వస్తువులను ట్రాక్ చేసే ఇంటర్నేషనల్ ఆస్టరాయిడ్ వార్నింగ్ నెట్‌వర్క్ (IAWN).. సైతం దీనిపై ఓ కన్నేసింది. ఈ ఆబ్జెక్ట్ పై ప్రత్యేకంగా అధ్యయనం చేయనుంది. నవంబర్ 27 నుండి జనవరి 27వ తేదీ వరకు కొనసాగుతుందీ స్టడీ. దీని కింద ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఖగోళ శాస్త్రవేత్తలు ఈ రహస్య వస్తువును ఏకకాలంలో పరిశీలించి డేటాను సేకరిస్తారు. ఇందులో పాల్గొనడానికి ఆసక్తి గల సైంటిస్టులు నవంబర్ 7లోగా వర్క్‌షాప్‌లో చేరాల్సి ఉంటుంది.
తోకచుక్కలను అధ్యయనం చేయడం చాలా కష్టమని IAWN పేర్కొంది. వాటి మెరిసే వాయు మేఘాలు, తోకలు ఖచ్చితమైన స్థానాన్ని గుర్తించడాన్ని క్లిష్టతరం చేస్తాయని, అవి ప్రయాణించే మార్గాలను వంద శాతం ఖచ్చితత్వంతో కొలవడం గానీ, గుర్తించడం గానీ చేయలేమని తెలిపింది. లోయెబ్ గెలీలియో ప్రాజెక్ట్ బృందం 3I/అట్లాస్ గురించి ఎనిమిది వింత లక్షణాలను గుర్తించింది. ఇవి సాధారణ తోకచుక్కల్లో కనిపించేవి కావు.
An amateur astronomer captured these images when he pointed his telescope at 3I/ATLAS. @DobsonianPower on YouTube https://t.co/gG0PdGB4mC #ufotwitter #3iatlas pic.twitter.com/ewyQRKCcgb
— RAEFOS Network (@RAEFOSnetwork) October 2, 2025
1. అసాధారణ కక్ష్య: దీని మార్గం గ్రహాల కక్ష్యలతో దాదాపు సంపూర్ణంగా సరిపోలుతుంది. ఇది యాదృచ్చికంగా జరగడం చాలా అరుదు.
2. సూర్యుని వైపు ఇంజెక్ట్: ఇది సూర్యుని వైపు స్పేస్ మెటీరియల్ ను ఇంజెక్ట్ చేస్తోంది. ఓ సాధారణ తోకచుక్కలతో పోల్చుకుంటే ఇది పూర్తి విరుద్ధం.
3. భారీ పరిమాణం: ఈ తోకచుక్క అతి భారీ పరిమాణంలో ఉండటం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఓముయామువా, బోరిసోవ్ కంటే చాలా భారీగా కనిపిస్తోంది. అంతే వేగంతో పరిభ్రమిస్తోంది.
4. ఖచ్చితమైన సమయం: ఇది మార్స్, వీనస్, జూపిటర్ గ్రహాలకు అతి దగ్గరగా.. ఎవరో ట్యూన్ చేసినట్లుగా ప్రయాణించింది.
5. ఐరన్ క్లూస్: ఈ తోకచుక్క ప్రయాణిస్తోన్నప్పుడు వెలువడే వాయు మేఘాల్లో నికెల్ ఎక్కువగా ఉండటాన్ని సైంటిస్టులు గుర్తించారు. ఇది సాధారణ తోకచుక్కల్లో అస్సలు కనిపించదు.
6. తక్కువ నీటి శాతం: ఇందులో నాలుగు శాతం మాత్రమే నీటిని గుర్తించారు. ఇతర తోకచుక్కలు ప్రధానంగా నీటితో కూడి ఉంటాయి.
7. వింత కాంతి ప్రతిబింబం: ఇది ఏ ఇతర తోకచుక్క చూపని విధంగా కాంతిని ప్రతిబింబిస్తోంది.
8. వింత సిగ్నళ్లు: ఇది 1977లో కనుగొన్న రేడియో సిగ్నల్స్ ను పోలిన సంకేతాలు ఇందులో నుంచి వెలువడటం ప్రాధాన్యతను సంతరించుకుంది.
3I/ATLAS Mars Perseverance Rover Image
— RAEFOS Network (@RAEFOSnetwork) October 4, 2025
NASA's Mars Perseverance rover acquired this image using its onboard Right Navigation Camera (Navcam). The camera is located high on the rover's mast and aids in driving.
Original Photo and then our edit.
This image was acquired on Oct.… pic.twitter.com/pULtINxPVB
ఈ వారం చివరి నాటికి, ఇది మార్స్ నుండి 29 మిలియన్ కిలోమీటర్ల పరిధిలోకి వస్తుందని, అక్కడ నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, చైనీస్ స్పేస్ ఏజెన్సీ పంపించిన అనేక ఆర్బిటర్లు ఉన్నాయని, వాటి ద్వారా దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకోవచ్చని లోబ్ తెలిపారు. 30 కిలోమీటర్ల పిక్సెల్ పరిమాణంతో ఫొటో తీసి, ఆ స్పేస్ ఆబ్జెక్ట్ ఎంత పెద్దదనేది అంచనా వేయాలని అన్నారు. ప్రస్తుతం ఇది 33 బిలియన్ టన్నుల కంటే ఎక్కువ బరువు ఉందని అంచనా వేశారు.
-
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు -
కుప్పకూలుతున్న బంగారం రేట్లు- ఈ వారంలో












Click it and Unblock the Notifications