Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

"అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్"లో టాప్ 10 వాటర్‌ ప్రూఫ్ ఫోన్లు ఇవే..!!!

దసరా పండుగను పురస్కరించుకొని "అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్" 2025 ధమాకా ఆఫర్స్ తీసుకొచ్చింది. సెప్టెంబర్ 23 నుంచి ఈ సేల్స్ ప్రారంభం అవ్వగా.. స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, టీవీలు, ఇయర్‌ బడ్స్, స్మార్ట్‌వాచ్‌లు సహా పలు వస్తువులపై భారీ తగ్గింపులు తీసుకొచ్చాయి. అయితే ముఖ్యంగా వర్షాకాలం సీజన్‌ కావడంతో వాటర్‌ప్రూఫ్ ఫోన్ల కొనుగోలు చేయడానికి ఇదే సరైన సమయం అని నిపుణులు సూచిస్తున్నారు.

వాటర్‌ప్రూఫ్ ఫోన్ ఎందుకు కొనాలి..?

వర్షాకాలం కావడంతో వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికీ అర్దం కావట్లేదు. అందుకే ఈ సమయంలో వాటర్ ప్రూఫ్ కొనుక్కోవడం ఉత్తమం అని సలహా ఇస్తున్నారు. ఇక పండుగ సీజన్‌లో కొత్త ఫోన్ కొనాలి అనుకునే వారికి.. సేల్ ఆఫర్స్ లో డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్‌లు, పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ డీల్స్, నో-కాస్ట్ EMI ద్వారా ఫోన్లు అందుబాటులో రావడం మంచి ఛాన్స్ అని చెబుతున్నారు. అంతే కాకుండా SBI క్రెడిట్ కార్డ్‌తో అదనపు 10% తగ్గింపు కూడా పొందే అవకాశం కూడా ఉంది. అందుకే త్వరపడి సేల్ ముగిసేలోపు ఫోన్ ఆర్డర్ చేయడం మంచిదని.. టెక్ ప్రియులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు.

top-10-waterproof-phones-in-amazon-great-indian-festival

టాప్ 10 వాటర్‌ ప్రూఫ్ ఫోన్లు ఇవే..

1. వివో V60 5G..

వివో V60 5G (8GB/128GB) అమెజాన్‌లో రూ.36,999కి లభిస్తోంది. SBI క్రెడిట్ కార్డ్‌తో రూ.2,450 తగ్గింపు తర్వాత ధర రూ.34,549కి చేరుతుంది. పాత ఫోన్ ఎక్స్ఛేంజ్‌లో గరిష్టం రూ.35,149 వరకు ఆదా చేయవచ్చు. ఈ ఫోన్ IP68/IP69 రేటింగ్‌తో నీరు, దుమ్ము నుంచి రక్షణ ఇస్తుంది. 6.77 అంగుళాల AMOLED డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 ప్రాసెసర్ వేగవంతమైన పనితీరు అందిస్తుంది.

2. ఒప్పో రెనో 13 5G..

ఒప్పో రెనో 13 5G (8GB/128GB) ధర రూ.26,999. SBI కార్డ్‌తో రూ.1,250 తగ్గింపు పొందవచ్చు, ధర రూ.25,749కి పడుతుంది. IP66 + IP68 + IP69 రేటింగ్‌తో నీటిలో మునిగినా ఎలాంటి సమస్యలు ఉండవు. మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ప్రాసెసర్ గేమింగ్‌కు అద్భుతంగా పనిచేస్తుంది. 5,800 mAh బ్యాటరీ ఎక్కువ కాలం చార్జ్ ఇస్తుంది. 50MP ట్రిపుల్ కెమెరాతో ఫోటోలు అద్భుతంగా తీయవచ్చు.

3. మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ 5G

మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ 5G (8GB/128GB) ధర రూ.22,344. SBI కార్డ్‌తో ₹1,250 తగ్గించి ₹21,094లో కొనుగోలు చేయవచ్చు. IP68 రేటింగ్‌ నీరు, దుమ్ము నుంచి రక్షిస్తుంది. 6.67 అంగుళాల డిస్‌ప్లే 120 Hz రిఫ్రెష్ రేట్‌తో స్మూత్ స్క్రోల్ ఇస్తుంది. 5,500 mAh బ్యాటరీ 68W ఫాస్ట్ ఛార్జింగ్‌తో ఎక్కువ కాలం పనిచేస్తుంది.

4. రెడ్‌మీ నోట్ 14 ప్రో 5G

రెడ్‌మీ నోట్ 14 ప్రో 5G (8GB/128GB) ధర రూ.21,998. SBI కార్డ్‌తో 10% తగ్గింపు (రూ.1,250) తర్వాత ధర రూ.20,748. IP68 రేటింగ్‌తో నీటి రక్షణ, 50MP ప్రైమరీ కెమెరా, 1.5K 3D కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 5,500 mAh బ్యాటరీ 45W ఫాస్ట్ ఛార్జింగ్ అందిస్తుంది.

5. రియల్‌మీ P3x 5G

రియల్‌మీ P3x 5G (8GB/128GB) ధర రూ.12,999. SBI కార్డ్‌తో రూ.1,250 తగ్గింపు తర్వాత ధర రూ.11,749. IP68 + IP69 రేటింగ్, 6,000 mAh బ్యాటరీ, 6.72 అంగుళాల 120 Hz డిస్‌ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 6400 ప్రాసెసర్ గేమింగ్‌కు అనుకూలంగా ఉంటుంది.

6. సామ్‌సంగ్ గెలాక్సీ S23

సామ్‌సంగ్ గెలాక్సీ S23 (8GB/256GB) IP68 రేటింగ్‌తో ఉంటుంది. 6.1 అంగుళాల Dynamic AMOLED 2X డిస్‌ప్లే, Snapdragon 8 Gen 2 ప్రాసెసర్, 3,900 mAh బ్యాటరీ 25W ఫాస్ట్ ఛార్జింగ్ ఇస్తుంది. అమెజాన్ సేల్‌లో రూ.10,000 వరకు తగ్గింపు అవకాశం.

7. ఐఫోన్ 15

ఐఫోన్ 15 (128GB) IP68 వాటర్‌ప్రూఫ్ సర్టిఫికేషన్‌తో, A16 బయోనిక్ చిప్‌తో, 6.1 అంగుళాల Super Retina XDR డిస్‌ప్లే, డ్యూయల్ కెమెరా సిస్టమ్‌తో వస్తుంది. SBI కార్డ్ డిస్కౌంట్‌తో కొన్ని వేల రూపాయలు ఆదా చేసుకోవచ్చు.

8. వన్‌ప్లస్ 11R 5G

వన్‌ప్లస్ 11R 5G (12GB/256GB) IP68 రేటింగ్, 6.7 అంగుళాల AMOLED డిస్‌ప్లే, Snapdragon 8+ Gen 1 ప్రాసెసర్, 5,000 mAh బ్యాటరీ 100W ఫాస్ట్ ఛార్జింగ్. SBI డిస్కౌంట్‌తో అదనపు ఆదా.

9. షియోమి 13T Pro

షియోమి 13T Pro (12GB/256GB) IP68 రేటింగ్, 6.67 అంగుళాల AMOLED డిస్‌ప్లే, Snapdragon 7+ Gen 2, 5,200 mAh బ్యాటరీ 67W ఫాస్ట్ ఛార్జింగ్. అమెజాన్ సేల్‌లో ₹12,000 వరకు తగ్గింపు.

10. నోకియా X100

నోకియా X100 (6GB/128GB) IP68 రేటింగ్, 6.67 అంగుళాల FHD+ డిస్‌ప్లే, Snapdragon 480 5G ప్రాసెసర్, 4,470 mAh బ్యాటరీ. అమెజాన్ సేల్‌లో సౌకర్యవంతమైన ధరలో లభిస్తుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+