ఈ ఏడాదిలో రిలీజ్ అయిన రూ.10 వేల లోపు టాప్ 5జీ ఫోన్స్ ఇవే..!
ప్రపంచంలో రోజుకో కొత్త స్మార్ట్ ఫోన్ మార్కెట్ లోకి రిలీజ్ అవుతోంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లతో తక్కువ ధరలోనే ఫోన్లను అందించేందుకు కంపెనీలు సైతం పోటీ పడుతున్నాయి. స్మార్ట్ ఫోన్‌ల కంపెనీలు సైతం వినియోగదారులను ఆకట్టుకునేందుకు కొత్త కొత్త ఫీచర్లతో తక్కువ ధరకే 5జీ ఫోన్ లను లాంఛ్ చేస్తున్నాయి. ఈ కారణం గానే ప్రీమియం ఫీచర్ల కోసం భారీ మొత్తం చెల్లించాల్సిన అవసరం లేకుండానే.. ఉత్తమ స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేసుకునే అవకాశం ఇప్పుడు వినియోగదారులకు లభిస్తోంది.
కాగా భారతీయ మొబైల్ మార్కెట్‌లో ఈ ఏడాది హై-ఎండ్, ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లు వార్తల్లో నిలిచినప్పటికీ.. నిజమైన అమ్మకాల ఉత్సాహాన్ని మాత్రం బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లునే నింపాయి. ముఖ్యంగా రూ.10,000 లోపు ధరలోనే 5G కనెక్టివిటీ, హై రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లేలు, పెద్ద బ్యాటరీలు వంటి ఫీచర్లను అందిస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. POCO, Samsung, Motorola వంటి ప్రముఖ బ్రాండ్‌లు ఈ సెగ్మెంట్‌లో పోటీపడి వినియోగదారులకు మంచి విలువను అందిస్తున్నాయి. ఈ ఏడాది విడుదలైన మూడు అత్యుత్తమ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లు ఏవో మీకోసం ప్రత్యేకంగా..

POCO M7 5G.. ధర రూ.8,999
ఈ ఏడాది బడ్జెట్ 5G ఫోన్లలో POCO M7 5G ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన భారీ 6.88 అంగుళాల HD+ LCD డిస్‌ప్లే రోజువారీ వినియోగానికి మృదువైన అనుభవాన్ని అందిస్తుంది. ఇందులో ఉన్న Qualcomm Snapdragon 4 Gen 2 చిప్‌సెట్ సాధారణ గేమింగ్, మల్టీటాస్కింగ్‌కు సరైన పనితీరును ఇస్తుంది.
ఫోటోగ్రఫీ పరంగా 50MP ప్రధాన కెమెరాతో కూడిన డ్యూయల్ కెమెరా సెటప్, ముందు భాగంలో 8MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. అలాగే 5,160mAh బ్యాటరీ రోజంతా ఉపయోగించుకునేంత బ్యాకప్ ఇస్తుంది. ఆకర్షణీయమైన డిజైన్, 5G సపోర్ట్, తక్కువ ధరలో మంచి ఫీచర్లు కోరే వారికి ఇది మంచి ఎంపికగా నిలుస్తుంది.
Samsung Galaxy M06 5G - ధర రూ.9,999
Samsung బ్రాండ్‌పై నమ్మకం ఉన్నవారికి Galaxy M06 5G ఒక బ్యాలెన్స్‌డ్ బడ్జెట్ ఫోన్‌గా కనిపిస్తుంది. ఇందులో 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల LCD డిస్‌ప్లే ఉండగా, స్మూత్ స్క్రోలింగ్ అనుభవాన్ని అందిస్తుంది. MediaTek Dimensity 6300 ప్రాసెసర్తో పాటు 4GB RAM ఉండటం వల్ల రోజువారీ యాప్‌లు, సోషల్ మీడియా వినియోగానికి సరిపడ పనితీరును అందిస్తుంది.
కెమెరా విభాగంలో వెనుక 50MP + 2MP డ్యూయల్ కెమెరా సెటప్, ముందు భాగంలో 8MP కెమెరా ఉన్నాయి. 5000mAh బ్యాటరీతో దీర్ఘకాలిక బ్యాకప్ లభిస్తుంది. ముఖ్యంగా Samsung యొక్క One UI ఇంటర్‌ఫేస్, రెగ్యులర్ సెక్యూరిటీ అప్‌డేట్స్ ఈ ఫోన్‌కు అదనపు బలం.
Moto G06 Power - ధర రూ.7,999
బ్యాటరీ లైఫ్‌కి అత్యంత ప్రాధాన్యతనిచ్చే వినియోగదారుల కోసం Moto G06 Power ఉత్తమ ఎంపికగా నిలుస్తుంది. ఇందులో ఉన్న భారీ 7,000mAh బ్యాటరీ ఒక్కసారి ఛార్జ్‌తో రెండు రోజుల వరకు ఉపయోగించే అవకాశాన్ని ఇస్తుంది. 6.88 అంగుళాల డిస్‌ప్లే, MediaTek Helio G81 Extreme ప్రాసెసర్, 4GB RAM సాధారణ వినియోగానికి సరిపడ పనితీరును అందిస్తాయి.
ఫోటోగ్రఫీకి 50MP డ్యూయల్ రియర్ కెమెరా, ముందుభాగంలో 8MP వైడ్-యాంగిల్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ముఖ్యంగా స్టాక్ ఆండ్రాయిడ్ అనుభవం, తక్కువ బ్లోట్‌వేర్ ఉండటం వల్ల ఫోన్ మరింత స్మూత్‌గా పనిచేస్తుంది. తక్కువ ధరలో భారీ బ్యాటరీ కోరే వారికి ఇది బెస్ట్ చాయిస్.












Click it and Unblock the Notifications