6,200mAh భారీ బ్యాటరీ, ZEISS కెమెరాతో "vivo X200T"..
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వివో స్మార్ట్ ఫోన్ ప్రియులకు ఇది అదిరిపోయే శుభవార్త. vivo మరోసారి టెక్నాలజీ ప్రేమికుల దృష్టిని ఆకర్షించింది. తన గత ఏడాది ఫ్లాగ్‌షిప్ X200 సిరీస్‌కు కొనసాగింపుగా.. తాజాగా vivo X200Tను అధికారికంగా విడుదల చేసింది. ఇప్పటికే మార్కెట్‌లో X300 సిరీస్ అందుబాటులో ఉన్నప్పటికీ, X200 సిరీస్‌కు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని అప్‌గ్రేడెడ్ స్పెసిఫికేషన్లతో ఈ రీఫ్రెష్డ్ మోడల్‌ను vivo తీసుకొచ్చింది.
vivo X200T లాంచ్‌తో, ఫ్లాగ్‌షిప్ స్థాయి ఫీచర్లను కొంత తక్కువ ధరలో అందించాలన్న కంపెనీ వ్యూహం స్పష్టంగా కనిపిస్తోంది. అద్భుతమైన కెమెరా, సూపర్ ఫాస్ట్ ప్రాసెసర్ , వినూత్నమైన AI ఫీచర్లతో రాబోతున్న ఈ ఫోన్ గురించి సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఈ ఫోన్ ప్రీమియం సెగ్మెంట్‌లో బలమైన పోటీదారుగా నిలుస్తోంది. ఫ్లాగ్‌షిప్ అనుభవాన్ని కొంచెం తక్కువ ధరలో కోరుకునే వినియోగదారులకు ఇది మంచి ఆప్షన్‌గా నిలవనుందని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

vivo X200T ఫీచర్స్..
ధర & వేరియంట్లు..
vivo X200T రెండు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది.
• 12GB RAM + 256GB స్టోరేజ్ - రూ.59,999
• 12GB RAM + 512GB స్టోరేజ్ - రూ.69,999
లాంచ్ ఆఫర్లలో భాగంగా Axis, HDFC, SBI బ్యాంక్ కార్డులతో కొనుగోలు చేస్తే రూ.5,000 వరకు తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది.
కలర్స్..
స్టెల్లార్ బ్లాక్, సీసైడ్ లైలాక్ రంగుల్లో ఈ ఫోన్ లభిస్తుంది.
డిస్‌ప్లే..
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.67 అంగుళాల AMOLED FHD+ డిస్‌ప్లేను అందించారు. 120Hz రిఫ్రెష్ రేట్‌తో స్మూత్ స్క్రోలింగ్, గేమింగ్ అనుభవాన్ని అందిస్తుంది. LTPO టెక్నాలజీ లేకపోయినా, సన్నని బెజెల్స్‌తో ఫ్లాగ్‌షిప్ లుక్‌ను కలిగి ఉంది.
డిజైన్ & బిల్డ్..
vivo X200T అల్యూమినియం అల్లాయ్ ఫ్రేమ్‌తో, రెండు వైపులా గ్లాస్ ఫినిష్‌తో ప్రీమియం డిజైన్‌ను అందిస్తుంది. అదనంగా IP68, IP69 వాటర్ & డస్ట్ రెసిస్టెన్స్ రేటింగ్‌లు ఉండటంతో కఠిన పరిస్థితుల్లోనూ భద్రత కల్పిస్తుంది.
పనితీరు..
ఈ ఫోన్‌లో MediaTek Dimensity 9400+ ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇది హై-ఎండ్ గేమింగ్, మల్టీటాస్కింగ్‌ను సులభంగా నిర్వహిస్తుంది. Android 16 ఆధారిత OriginOS 6తో ఈ డివైస్ వస్తుంది. vivo ఐదు సంవత్సరాల OS అప్‌డేట్లు, ఏడు సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్లకు హామీ ఇచ్చింది.
బ్యాటరీ & ఛార్జింగ్..
vivo X200Tలో 6,200mAh భారీ బ్యాటరీను అమర్చారు. ఇది 90W వైర్డ్ ఫ్లాష్ ఛార్జింగ్‌తో పాటు 40W వైర్‌లెస్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. ఒకసారి ఛార్జ్ చేస్తే రోజంతా వినియోగానికి సరిపోతుందని కంపెనీ తెలిపింది.
కెమెరా..
ZEISS సహకారంతో రూపొందించిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఈ ఫోన్‌లో ఉంది.
• 50MP Sony LYT702 ప్రైమరీ కెమెరా (OIS)
• 50MP అల్ట్రా వైడ్ లెన్స్
• 50MP టెలిఫోటో కెమెరా (3x ఆప్టికల్ జూమ్)
సెల్ఫీల కోసం ముందు భాగంలో 32MP కెమెరా అందించారు.
కనెక్టివిటీ & ఇతర ఫీచర్లు..
ఈ ఫోన్‌లో 3D అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, డ్యూయల్ సిమ్ సపోర్ట్, అధునాతన 5G కనెక్టివిటీ, డ్యూయల్-బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్ 5.4 వంటి అన్ని ఆధునిక ఫీచర్లు ఉన్నాయి.












Click it and Unblock the Notifications