లాంఛ్‌కి రెడీ అయిన "Vivo V70 సిరీస్".. ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్ !!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వివో స్మార్ట్ ఫోన్ ప్రియులకు అదిరిపోయే శుభవార్త ప్రకటించింది. తమ సంస్థ నుంచి V-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లతో భారత మార్కెట్‌లో మరోసారి సంచలనం సృష్టించేందుకు సిద్ధమవుతోంది. తాజా లీకుల ప్రకారం, Vivo V70 సిరీస్ ఫిబ్రవరి మధ్యలో భారతదేశంలో లాంచ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ సిరీస్‌లో తొలి దశలో Vivo V70, Vivo V70 Elite మోడళ్లను కంపెనీ పరిచయం చేయనుందని సమాచారం. దీంతో వివో ప్రీమియం మిడ్‌రేంజ్ నుంచి హై-ఎండ్ సెగ్మెంట్ వైపు మరింత దూకుడుగా అడుగులు వేస్తోందని స్పష్టంగా చెబుతున్నాయి.
ప్రీమియం వైపు వివో అడుగులు..
V70 సిరీస్‌తో వివో తన V-లైన్‌ను కేవలం స్టైలిష్ మిడ్‌రేంజ్ ఫోన్లకే పరిమితం చేయకుండా, ప్రీమియం ఫీల్ ఇచ్చే ఫీచర్లతో ముందుకు తీసుకెళ్లాలని చూస్తోంది. స్టాండర్డ్ Vivo V70 డిజైన్, కెమెరా, పనితీరు మధ్య మంచి బ్యాలెన్స్‌తో యువతను ఆకట్టుకునేలా ఉండనుంది. మరోవైపు Vivo V70 Elite మాత్రం V-సిరీస్, X-సిరీస్ మధ్య ఉన్న గ్యాప్‌ను తగ్గిస్తూ, దాదాపు ఫ్లాగ్‌షిప్ అనుభూతిని అందించేలా డిజైన్ చేయబడినట్టు తెలుస్తోంది.

అంచనా ధరలు..
ధరల విషయానికి వస్తే
Vivo V70 ధర సుమారు రూ.40,000 నుంచి రూ.45,000 మధ్య ఉండవచ్చని అంచనా.
Vivo V70 Elite ధర రూ.50,000 నుంచి రూ.55,000 వరకు ఉండే అవకాశం ఉంది.
ఈ ధరలతో వివో, సామ్‌సంగ్ గెలాక్సీ S FE సిరీస్, వన్‌ప్లస్, షియోమీ ప్రీమియం మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.
అంచనా స్పెసిఫికేషన్లు..
Vivo V70 ఫీచర్స్..
- క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్
- AMOLED డిస్‌ప్లేతో హై రిఫ్రెష్ రేట్ (120Hz వరకు)
- ZEISS ట్యూన్ చేసిన కెమెరాలు, ఫోటోగ్రఫీపై ప్రత్యేక ఫోకస్
- పెద్ద బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
- గరిష్టంగా 12GB RAM, 256GB స్టోరేజ్ వేరియంట్లు
ఈ మోడల్ స్టైల్, కెమెరా, రోజువారీ పనితీరు కోరుకునే యూజర్లకు టార్గెట్ చేయబడినట్టు కనిపిస్తోంది.
Vivo V70 Elite ఫీచర్స్..
Vivo V70 Elite మరింత శక్తివంతమైన ఫీచర్లతో రానుంది.
- Snapdragon 8s Gen 3 ప్రాసెసర్ - హైఎండ్ మిడ్‌రేంజ్ చిప్‌సెట్
- 6.59 అంగుళాల 1.5K OLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్
- ట్రిపుల్ కెమెరా సెటప్:
- 50MP మెయిన్ కెమెరా
- 50MP టెలిఫోటో లెన్స్
- 8MP అల్ట్రా వైడ్ కెమెరా
- భారీ 6,500mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్
కలర్స్..
కొత్త బ్రౌన్ కలర్ ఆప్షన్తో పాటు మరికొన్ని ప్రీమియం కలర్స్ లో ఈ ఫోన్స్ అందుబాటులోకి రానున్నాయి.
-
శక్తిమంతమైన పాప విమోచన ఏకాదశి- నెయ్యితో దీపాన్ని వెలిగించితే చాలు -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications