వాషింగ్ మిషన్ కొనాలనుకుంటున్నారా..? ఫ్రంట్ లోడ్ vs టాప్ లోడ్ ఏది బెస్ట్ ??

ఈ రోజుల్లో కొత్త వాషింగ్ మెషిన్ కొనాలనుకుంటే చాలా మందికి మొదట వచ్చే సందేహం ఒక్కటే. ఫ్రంట్ లోడ్ మంచిదా? లేక టాప్ లోడ్ మంచిదా? మార్కెట్లో ఎన్నో బ్రాండ్లు, ఫీచర్లు ఉండటంతో సరైన ఎంపిక చేయడం కాస్త కన్‌ఫ్యూజింగ్‌గా మారింది. అయితే మీ అవసరం, బడ్జెట్, వినియోగ విధానం తెలుసుకుని ఎంచుకుంటేనే డబ్బుకు నిజమైన విలువ దక్కుతుంది. వాషింగ్ మెషిన్ అనేది రోజువారీ ఉపయోగించే గృహోపకరణం. ఒకసారి కొనుగోలు చేస్తే కనీసం 7-10 సంవత్సరాలు వాడుతాం. కాబట్టి ప్రారంభంలో సరైన మోడల్ ఎంచుకోవడం చాలా ముఖ్యం. నీటి వినియోగం, కరెంట్ ఖర్చు, వాషింగ్ క్వాలిటీ ఇవన్నీ కలిపి బెస్ట్ ఆప్షన్ ఎంచుకోవడం ముఖ్యం.

ప్రస్తుతం LG Electronics, Samsung, Bosch వంటి కంపెనీలు ఫ్రంట్ లోడ్‌లో అత్యాధునిక మోడళ్లను అందిస్తున్నాయి. అలాగే Whirlpool, Godrej, Haier టాప్ లోడ్ సెగ్మెంట్‌లో మంచి బడ్జెట్ ఆప్షన్స్ ఇస్తున్నాయి. కుటుంబ సభ్యుల సంఖ్య (6kg, 7kg, 8kg ఎంపిక).. నీటి అందుబాటు, పవర్ కన్సంప్షన్, వారంటీ & సర్వీస్ సపోర్ట్, స్టీమ్, క్విక్ వాష్, ఇన్వర్టర్ టెక్ వంటి వాటిని బట్టి ఎంచుకోవచ్చు. మొత్తానికి మీరు హైజీన్, సేవింగ్స్ కోరుకుంటే - ఫ్రంట్ లోడ్.. మీరు బడ్జెట్, సింపుల్ యూజ్ కోరుకుంటే - టాప్ లోడ్ కొనుగోలు చేయొచ్చు.

want-to-buy-a-washing-machine-front-load-vs-top-load-which-is-best

ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషిన్ (Front Load)..

ఫ్రంట్ లోడ్ మెషిన్లు ముందు భాగంలో డోర్‌తో ఉంటాయి.

ముఖ్య ప్రయోజనాలు:

  • అద్భుతమైన వాషింగ్ క్వాలిటీ (మరకలు బాగా తొలగిస్తాయి)
  • తక్కువ నీటి వినియోగం
  • తక్కువ విద్యుత్ వినియోగం (లాంగ్ టర్మ్‌లో సేవింగ్)
  • బట్టలు ఎక్కువ కాలం మన్నుతాయి
  • అడ్వాన్స్‌డ్ ఫీచర్లు (AI వాష్, స్టీమ్ వాష్, హాట్ వాష్)

లోపాలు:

  • ధర ఎక్కువ
  • వాషింగ్ టైం ఎక్కువ
  • వాడటానికి కొంచెం నేర్చుకోవాలి
  • కిందికి వంగి బట్టలు వేయాలి

ఎవరికీ బెటర్?

  • హైజీన్‌పై ఎక్కువ ఫోకస్ ఉన్నవారు
  • చిన్న పిల్లలు ఉన్న కుటుంబాలు
  • ఎక్కువగా వాషింగ్ చేసే వారు

టాప్ లోడ్ వాషింగ్ మెషిన్ (Top Load)..

టాప్ లోడ్ మెషిన్లు పై భాగంలో డోర్‌తో ఉంటాయి.

ముఖ్య ప్రయోజనాలు:

  • తక్కువ ధరలో లభ్యం
  • వాడటం చాలా సులభం
  • వేగంగా వాషింగ్ పూర్తి
  • మధ్యలో బట్టలు జోడించే అవకాశం
  • వృద్ధులకు అనుకూలం

లోపాలు:

  • నీటి వినియోగం ఎక్కువ
  • కరెంట్ వినియోగం కొంచెం ఎక్కువ
  • వాషింగ్ క్వాలిటీ ఫ్రంట్ లోడ్ కంటే తక్కువ
  • బట్టలు కొంచెం త్వరగా పాడయ్యే అవకాశం

ఎవరికీ బెటర్?

బడ్జెట్ కస్టమర్లు

బ్యాచిలర్స్ / చిన్న కుటుంబాలు

డైలీ ఫాస్ట్ వాష్ అవసరమయ్యే వారు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+