2,700 డిగ్రీల సెల్సియస్ వేడి మధ్య.. అమెరికా తీరంలో స్ప్లాష్ డౌన్

చంద్రుని చుట్టూ సాగిన చారిత్రాత్మక యాత్ర విజయవంతంగా ముగిసింది. ఆర్టెమిస్ 2 సురక్షితంగా భూమికి తిరిగొచ్చింది. వ్యోమగాములు క్షేమంగా నేలకు చేరారు. వాళ్లు ప్రయాణించిన ఓరియన్ క్యాప్సూల్ కొద్దిసేపటి కిందటే పసిఫిక్ మహాసముద్రంలో స్ప్లాష్ డౌన్ అయింది. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ.. నాసా దీనికి సంబంధించిన ఓ అద్భుతమైన వీడియో ఫుటేజీని విడుదల చేసింది. ఈ దృశ్యం చంద్రుడిని జయించిన ఓ గొప్ప క్షణాన్ని ఆవిష్కరించింది.

అమెరికా ఈస్టర్న్ టైమ్ జోన్ ప్రకారం.. రాత్రి 8:07 నిమిషాల (భారత కాలమానం ప్రకారం.. ఈ తెల్లవారు జామున 6:10 నిమిషాలు) కు ఆర్టెమిస్ 2 వ్యోమగాములు భూమిపై సురక్షితంగా అడుగు పెట్టారు. మూడు భారీ పారాచూట్ల సహాయంతో ఈ క్యాప్సూల్ పసిఫిక్ మహాసముద్రం జలాల్లో దిగింది. ఈ సందర్భంగా నాసా వారిని స్వాగతించింది. "వెల్కమ్ హోమ్ రీడ్, విక్టర్, క్రిస్టినా, జెరెమీ! ఆర్టెమిస్ 2 వ్యోమగాములు ఏప్రిల్ 11న 8:07pm ఈటీ (0007 యూటీసీ)కి తిరిగి వచ్చారు. చారిత్రక 10 రోజుల మూన్ మిషన్‌ను విజయవంతంగా ముగించారు" అని ప్రకటించింది.

Watch Artemis II Splash Down NASA Shares Dramatic Footage of Orion s Pacific Ocean Landing In USA

ఈ మిషన్ నిజంగా చరిత్రను తిరగరాసింది. ఇంతకు ముందు ఏ మానవ మిషన్ కూడా అంతరిక్షంలో ప్రయాణించనంత దూరానికి వెళ్లింది. అపోలో శకాన్ని మటుమాయం చేసింది. భూమి నుండి చంద్రుడి వైపు 4,00,000 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించిందీ ఆర్టెమిస్ 2 ఓరియన్. చంద్రుడి అవతలి వైపు చుుట్టి వచ్చింది. ఆ సమయంలో అక్కడ సంభవించిన సంపూర్ణ సూర్యగ్రహణాన్ని రికార్డు చేసింది. దీనికి సంబంధించిన ఫొటోలు ఇదివరకే విడుదల అయ్యాయి. చంద్రుడికి అవతలివైపు గల వాతావరణం గురించి సమగ్రంగా తెలుసుకుంది.

తాజాగా ఈ ఓరియన్ క్యాప్సూల్ భూ వాతావరణంలోకి హైపర్‌సోనిక్ వేగంతో తిరిగి ప్రవేశించింది. ఆ సమయంలో దాని వేగం సెకెను 38,749 కిలోమీటర్లుగా రికార్డయింది. ఆ వేగాన్ని నియంత్రించడం నాసాకు అతిపెద్ద సవాల. ఆ సమయంలో మిషన్ కఠిన సవాళ్లను ఎదుర్కొంది. వ్యోమనౌక బయటి ఉష్ణోగ్రత సుమారు 2,700 డిగ్రీల సెల్సియస్ కు చేరాయి. అక్కడ సంభవించిన ప్లాస్మా షీత్ కారణంగా బ్లాక్‌ అవుట్ సైతం ఏర్పడింది.

ఒకదశలో నాసా గ్రౌండ్ స్టేషన్స్ తో కమ్యూనికేషన్స్ కొద్దిసేపు స్తంభించిపోయింది కూడా. ఈ క్లిష్ట దశను ఓరియన్ క్యాప్సూల్ విజయవంతంగా అధిగమించింది. నిర్దేశిత పాత్ వే నుంచి కొన్ని క్షణాల పాటు దారి మళ్లిన ఈ ఓరియన్ క్యాప్సూల్.. తన పారాచూట్లను సహాయంతో కక్ష్యలోకి పునఃప్రవేశించింది. సురక్షితంగా స్ప్లాష్ డౌన్ కావడానికి అవసరమైనంత వేగానికి తగ్గింది. అనంతరం పసిఫిక్ మహాసముద్రంలో పడింది.

అప్పటికే అక్కడ మోహరించివున్న నాసా సైంటిస్టులు, అమెరికా నౌకాదళాలు క్యాప్సుల్ నుంచి సురక్షితంగా నలుగురు వ్యోమగాములను బయటికి తీసుకొచ్చారు. వైద్యపరీక్షల కోసం తరలించారు. మిషన్‌లో భాగంగా వ్యోమగాములు చంద్రుని ఉపరితలం, భూమికి సంబంధించిన హైరిజల్యూషన్ చిత్రాలు, వీడియోలను కూడా తీశారు. ఈ డేటా భవిష్యత్ లో మరిన్ని అంతరిక్ష మిషన్ల ప్రణాళికలకు ఉపయోగపడుతుందని నాసా భావిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+