Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఫ్లైట్ బుకింగ్ అస్తవ్యస్తం: ఇండిగో, స్పైస్‌జెట్‌కు దెబ్బ: సర్వీసులు రద్దు

Windows: ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ సర్వీసులు స్తంభించిపోయాయి. గ్లోబల్ అవుటేజ్ ఏర్పడింది. ప్రత్యేకించి మైక్రోసాఫ్ట్ విండోస్, ల్యాప్‌టాప్ వినియోగదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఆస్ట్రేలియా, అమెరికా సహా అనేక దేశాల్లో విండోస్ 10 సాఫ్ట్‌వేర్ మొత్తం క్రాష్ అయింది. ఉన్నట్టుండి కంప్యూటర్స్, ల్యాప్‌టాప్స్ పని చేయడం మానేశాయి.

బ్లూ స్క్రీన్ ఎర్రర్..

పర్సనల్ కంప్యూటర్‌లో సమస్యలు తలెత్తాయని, రీస్టార్ట్ చేయాల్సిన అవసరం ఉందంటూ బ్లూ స్క్రీన్ మెసేజ్ ప్రత్యక్షం కావడం వినియోగదారులకు కలవరపాటుకు గురి చేసింది. రీస్టార్ట్ చేసినా మళ్లీ మళ్లీ అదే స్క్రీన్ కనిపించడం యూజర్లు ఆందోళనకు గురయ్యారు. చాలామంది యూజర్లు తమ బ్లూ స్క్రీన్‌కు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

We continue to take mitigation actions says Microsoft on Crowdstrike causing IT problems

కారణాలు ఇవే..

దీనితో #Windows, #Microsoft, #BSoD, అనే హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్ అవుతున్నాయి. దీనికి కారణాలు లేకపోలేదు. కొత్త క్రౌడ్‌స్ట్రైక్ అప్‌డేట్ కారణంగా ఈ సమస్య తలెత్తింది. క్రౌడ్‌స్ట్రైక్ అప్‌డేట్ అసంపూర్తిగా లోడ్ కావడం, విండోస్ 10 సాఫ్ట్‌వేర్ దీనికి సపోర్ట్ చేయకపోవడం, అన్-ఇన్‌‌స్టాల్ మెసేజీలు రావడం వంటి కారణాల వల్ల బ్లూ స్క్రీన్ ప్రత్యక్షమౌతున్నట్లు అంచనా వేస్తోన్నారు.

స్తంభించిన బ్యాంకింగ్..

దీని ప్రభావం వల్ల పలు దేశాల్లో బ్యాంకింగ్ సేవలు స్తంభించిపోయాయి. ఆన్‌లైన్ ఫ్లైట్ బుకింగ్ వంటి కార్యకలాపాలపై దీని ప్రభావం పడింది. సూపర్ మార్కెట్లల్లో బిల్లింగ్ నిలిచిపోయింది. దీనికి బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్ అంటూ పేరు పెట్టారు నెటిజన్లు. చివరికి అమెరికాలోని కొన్ని మీడియా హౌస్‌లు కూడా ఈ సమస్య వల్ల ఇబ్బందులు పడ్డాయి.

భారత్‌కూ దెబ్బ..

మైక్రోసాఫ్ట్ విండోస్ క్రాష్ కావడం విమాన సర్వీసులపైనా తీవ్ర ప్రభావం చూపింది. తీవ్రంగా అస్తవ్యస్తం అయ్యాయి. విమాన సర్వీసులన్నింటినీ నిలిపివేసినట్లు జర్మనీ వెల్లడించింది. బెర్లిన్ విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేసినట్లు పేర్కొంది. దీని ప్రభావం భారత్‌పైనా పడింది.

ఆకాశ, ఇండిగో, స్పైస్‌జెట్..

సర్వీస్ ప్రొవైడర్‌కు సంబంధించిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సమస్యల వల్ల బుకింగ్, చెక్-ఇన్ సహా ఆన్‌లైన్ సేవలు కొన్ని తాత్కాలికంగా అందుబాటులో ఉండట్లేదని భారత్‌కు చెందిన ఆకాశ, ఇండిగో, స్పైస్‌జెట్ ఎయిర్‌వేస్ సంస్థలు తెలిపాయి. విమానాశ్రయాల్లో మాన్యువల్ చెక్-ఇన్, బోర్డింగ్ సేవలు మాత్రమే అందుబాటులో ఉన్నాయని, టికెట్లను బుక్ చేసుకున్న ప్రయాణికులు చెక్-ఇన్ కోసం నిర్దేశిత గడువు కంటే ముందే చేరుకోవాల్సి ఉంటుందని సూచించాయి.

We continue to take mitigation actions says Microsoft on Crowdstrike causing IT problems

మైక్రోసాఫ్ట్ ఏం చెబుతోంది?

ఈ గందరగోళంపై మైక్రోసాఫ్ట్ సంస్థ స్పందించింది. సర్వీసులను ఇంప్రూవ్ చేస్తోన్నామని తెలిపింది. క్లౌడ్ సాఫ్ట్‌లో తలెత్తిన ఇబ్బందులను తొలగించడానికి తమ ఉద్యోగులు ప్రయత్నిస్తోన్నారని, దీనికి అవసరమైన పూర్తి సమాచారాన్ని అడ్మిన్ సెంటర్ MO821132లో పొందుపర్చామని వివరించింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+