తెలుపు, నలుపు, ఎరుపు.. ఏ రంగు కారు కొంటే లాభం? తెలుసుకోండి!

Car Best Colour: ఇటీవల జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న సంచలన నిర్ణయంతో కార్ల ధరలు తగ్గనున్నాయి. ఈ నేపథ్యంలో చాలా మంది కార్లు కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉంటారు. అయితే మీరు కూడా కొత్త కారు కొనాలని కలలు కంటున్నారా? అయితే కారు మోడల్, ఇంజిన్, ఫీచర్స్ లాంటి విషయాలతో పాటు ఏ రంగు కారు కొనాలనే సందిగ్ధంలో ఉన్నారా? అయితే ఈ వార్త మీ కోసమే.

ఎందుకంటే కారు ఫీచర్లతో పాటు కారు రంగు కూడా చాలా కీలకమే. కారు రంగు కేవలం అందం కోసం మాత్రమే కాకుండా.. దాని విలువ, భద్రత, నిర్వహణ ఖర్చులపై కూడా ప్రభావం చూపుతుంది. సాధారణంగా చాలా మంది వినియోగదారులు తమ ఇష్టమైన రంగులు అంటూ నలుపు, ఎరుపు లేదా బ్లూ రంగు కార్లను ఎంచుకుంటారు. కానీ నిపుణులు తెలుపు రంగు కారు ఎన్నో విధాలుగా లాభదాయకమని సూచిస్తున్నారు.

Which Car Colour is Best Why White Cars Are a Smart Choice

తెలుపు రంగు కారుతో అదనపు లాభాలు
కారు రంగు మీ జీవితాన్ని ఎలాంటి ప్రభావితం చేయదు.. కానీ అది మీ జేబుపై మాత్రం ఖచ్చితంగా ప్రభావం చూపుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. తెలుపు కారు కొనడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే..

వేసవిలో చల్లగా ఉంటుంది: ఇండియాలో వేసవి కాలం అత్యంత వేడిగా ఉంటుంది. నలుపు, ముదురు రంగుల కార్లు సూర్యరశ్మిని ఎక్కువగా గ్రహిస్తాయి. దీనివల్ల కారు లోపల వేడి పెరిగి అసౌకర్యంగా అనిపిస్తుంది. కానీ తెలుపు రంగు కారు సూర్యరశ్మిని, వేడిని పరావర్తనం చేస్తుంది. దీంతో కారు లోపల చల్లగా ఉంటుంది. దీంతో ఎయిర్ కండిషనర్ మీద భారం తగ్గి, ఇంధనం ఆదా అవుతుంది. దీని వల్ల డబ్బు ఆదా అవుతుంది.

ప్రమాదాలు జరిగే అవకాశం తక్కువ: రాత్రి వేళల్లో, పొగమంచు ఉన్న వాతావరణంలో తెల్లటి రంగు కారు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రోడ్డుపై ప్రమాదాలు జరిగే అవకాశం తగ్గుతుంది. కారు రక్షణ, భద్రత విషయంలో తెలుపు కారు మంచి ఎంపిక అని చెప్పవచ్చు.

నిర్వహణ సులభం: తెలుగు రంగు కార్ల మీద దుమ్ము, ధూళి, చిన్నపాటి గీతలు అంత ఈజీగా కనిపించవు. ముదురు రంగు కార్లపై ఈ మరకలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. తరచుగా కారును శుభ్రం చేయవలసి వస్తుంది. కానీ తెలుపు రంగు కారును ఎప్పుడో ఒక్కసారి శుభ్రం చేసినా కూడా అది కొత్తగానే కనిపిస్తుంది.

రీసేల్ వాల్యూ ఎక్కువ: కారును తిరిగి అమ్ముకునేటప్పుడు తెలుపు రంగు కార్లకు మంచి డిమాండ్ ఉంటుంది. చాలా మంది వినియోగదారులు తెలుపు రంగును ప్రీమియం రంగుగా పరిగణిస్తారు. అందువల్ల రీసేల్ మార్కెట్లో మంచి ధర లభిస్తుంది.

రంగు ఎక్కువ కాలం కొత్తగా: నలుపు, ఎరుపు, బ్లూ వంటి రంగుల కార్లు సూర్యరశ్మికి గురైతే త్వరగా రంగు మారిపోతాయి. తెల్లటి కారు రంగుపై సూర్యరశ్మి ఎఫెక్ట్ తక్కువగా ఉండడం వల్ల దాని రంగు ఎక్కువ కాలం కొత్తగా కనిపిస్తుంది.

ఈ కారణాల వల్ల, మీరు తక్కువ నిర్వహణ ఖర్చులతో, ఎక్కువ కాలం ఉండే, అధిక రీసేల్ విలువ గల కారు కొనాలనుకుంటే, తెలుపు రంగు కారు ఉత్తమ ఎంపిక అని నిపుణులు సూచిస్తున్నారు. కారు కొనేటప్పుడు ఈ విషయాలను కూడా పరిగణనలోకి తీసుకోవడం చాలా ముఖ్యం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+