అంబరాన వీధిలో.. ఎన్ని వేల రంగులో..!!

అమెరికాలో నార్తరన్ లైట్స్ కనువిందు చేస్తోన్నాయి. దాదాపుగా 21 నుంచి 25 రాష్ట్రాలు.. చీకట్లో నార్తరన్ లైట్స్ వెలుగులో ప్రకాశిస్తోన్నాయి. ఆకాశం వింత రంగులను వెదజల్లుతోంది. దీపావళి తరహా కాంతులు అలముకుంటోన్నాయి. ఇదే తరహా వాతావరణం ఈ నెల 17వ తేదీ వరకు కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కళ్లు మిరుమిట్లు గొలిపించే ఈ ఉత్తరధృవపు కాంతులను చూడాలనుకునే వారికి ఇదొక అద్భుత అవకాశం.

అమెరికాలో దాదాపుగా సగం దేశం వరకు ఈ కాంతులు కనిపించడం అనేది అతి అరుదుగా ఇటువంటి వాతావరణం ఏర్పడుతుందని నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. అమెరికా కాలమానం ప్రకారం ఈ నెల 11వ తేదీ రాత్రి నార్తరన్ లైట్స్ కనిపించడం మొదలుపెట్టాయి. దాదాపుగా 25 రాష్ట్రాల్లో ఇది కనువిందు చేసింది. 21 రాష్ట్రాల్లో అంబరం.. స్పష్టంగా మెరుపులీనింది. మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో మేఘావృతం వల్ల కొంత అస్పష్టత నెలకొంది.

Witness the Breathtaking Northern Lights Tonight in US

అలస్కా నుండి ఇండియానా వరకు ఇవి కనిపించే అవకాశం ఉంది. రెండు కరోనల్ మాస్ ఎజెక్షన్స్ కారణంగా భూ అయస్కాంత తుఫాను పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. భూ అయస్కాంత ఆకర్షణ, వాటి వల్ల సంభవించే ఈ లైట్స్ అతి తీవ్రస్థాయికి అంటే G3 లెవెల్ కు చేరుకోవచ్చని అంచనా వేసింది.

అలస్కా, నార్త్ డకోటా, మిన్నెసోటా, మోంటానా, విస్కాన్సిన్, మిచిగాన్, మైన్, సౌత్ డకోటా, ఇడహో, వెర్మోంట్, వాషింగ్టన్, న్యూ హాంప్‌షైర్, వ్యోమింగ్, న్యూయార్క్, అయోవా, మసాచుసెట్స్, పెన్సిల్వేనియా, నెబ్రాస్కా, ఒహియో, ఇల్లినాయిస్, ఇండియానా, నెబ్రస్కాల్లో నార్తరన్ లైట్స్ స్పష్టంగా కనిపించింది.

సూర్యాస్తమయం తర్వాత కొద్దిసేపటికే పసుపు, ఆకుపచ్చ, ఎరుపు, ఆరెంజ్ రంగుల్లో ఆకాశం మెరిసిపోయింది. సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు స్వల్పస్థాయిలో ఆరంభం అయ్యే ఈ కాంతులు.. సౌర తుఫాన్ తీవ్రత పెరుగుతున్న కొద్దీ G1 నుండి మిడిల్ లెవెల్ G2 స్థాయిలో కనిపించాయి.

రాత్రి 10 గంటల నుండి వేకువజామున ఒంటి గంట మధ్య అతి తీవ్ర స్థాయి అంటే G3 లెవెల్ కు చేరాయి. ఇదే తరహా వాతావరణం ఈ నెల 13, 14 తేదీల వరకు ఉంటుందని, ఆ తర్వాత క్రమంగా వీటి వెలుగు క్షీణిస్తుందని అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ వివరించింది. 12వ తేదీ వీటి వెలుగు గరిష్ఠస్థాయిలో ఉంటుందని పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+