ఐఫోన్ 17కి పోటీగా షియోమి 17 సిరీస్.. లాంఛ్ ఎప్పుడంటే ??
చైనాకు చెందిన ప్రముఖ సంస్థ షియోమి (Xiaomi) ప్రతి ఏడాది వినూత్న ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ప్రత్యేక గుర్తింపూ తెచ్చుకుంది. గత ఏడాది షియోమి 15 సిరీస్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చిన ఈ కంపెనీ, ఈసారి మరో భారీ అప్‌గ్రేడ్‌తో ముందుకొస్తోంది. 15 తర్వాత నేరుగా షియోమి 17 సిరీస్ పేరుతో ఫ్లాగ్‌షిప్ మొబైల్స్‌ను సెప్టెంబర్ 30న విడుదల చేయబోతోంది. ఇప్పటికే చైనాలో ప్రీ-బుకింగ్స్ మొదలయ్యాయి.
ఐఫోన్ 17 లాంచ్ ఫీవర్..
అయితే సెప్టెంబర్ 19న విడుదలైన ఐఫోన్ 17 సిరీస్ కోసం ప్రపంచవ్యాప్తంగా క్యూలు భారీ డిమాండ్ ఉంది. ఈ జోష్ కొనసాగుతుండగానే.. షియోమి తన సొంత 17 సిరీస్ని మార్కెట్లోకి తీసుకొస్తూ, నేరుగా యాపిల్‌కు పోటీ ఇవ్వబోతోంది. ఫీచర్లు, డిజైన్, కెమెరా, బ్యాటరీ సామర్థ్యం పరంగా యాపిల్‌తో సమానంగా లేదా కొన్ని అంశాల్లో మించిపోతుందనే అభిప్రాయం టెక్ వర్గాల్లో వినిపిస్తోంది.

షియోమి 17 సిరీస్ ఫీచర్లు..
ప్రాసెసర్..
Qualcomm Snapdragon 8 Elite Gen 5 ప్రాసెసర్
మెరుగైన AI సామర్థ్యాలు, గేమింగ్, హై-పర్ఫార్మెన్స్ యూజర్ల కోసం ప్రత్యేకంగా డిజైన్
కెమెరా..
వెనుక ట్రిపుల్ కెమెరా సెట్‌ప్
50MP ప్రైమరీ + 50MP టెలిఫోటో + 50MP అల్ట్రా-వైడ్
లైకా ఆప్టిమైజేషన్‌తో మరింత సహజమైన ఫొటోలు
8K వీడియో రికార్డింగ్ సపోర్ట్
మ్యాజిక్ బ్యాక్ స్క్రీన్.. (సెకండరీ డిస్‌ప్లే)
కెమెరా మాడ్యూల్ పక్కన సెకండరీ స్క్రీన్
కాల్స్, మ్యూజిక్ కంట్రోల్, నోటిఫికేషన్లు, క్విక్ విడ్జెట్స్
డిస్‌ప్లే..
షియోమి 17 ప్రో: 6.3-అంగుళాల LTPO AMOLED 1.5K డిస్‌ప్లే
120Hz రిఫ్రెష్ రేట్, HDR10+ సపోర్ట్
షియోమి 17: 6.3-అంగుళాల 1.5K LTPO OLED
బ్యాటరీ & ఛార్జింగ్..
Xiaomi 17 Pro: 6,300mAh బ్యాటరీ
Xiaomi 17: 7,000mAh బ్యాటరీ
రెండింటిలోనూ 100W వైర్డు ఛార్జింగ్ + 50W వైర్‌లెస్ ఛార్జింగ్
సెక్యూరిటీ & సాఫ్ట్‌వేర్..
Ultrasonic In-Display Fingerprint Sensor
HyperOS 3, Android 16 ఆధారంగా
దీర్ఘకాలిక సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ హామీ
డ్యూరబిలిటీ..
IP68 + IP69 సర్టిఫికేషన్లు
డస్ట్, వాటర్, హై-ప్రెజర్ రెసిస్టెన్స్
ఐఫోన్ 17 వర్సెస్ షియోమి 17..
ప్రాసెసర్: యాపిల్ A19 Bionic VS Snapdragon 8 Elite Gen 5
కెమెరా: యాపిల్ 48MP + AI ఆప్టిమైజేషన్ VS షియోమి లైకా ట్రిపుల్ 50MP
బ్యాటరీ: ఐఫోన్ 17 - సుమారు 4500mAh vs షియోమి 17 - 6300/7000mAh
ఛార్జింగ్: ఐఫోన్ 35W వరకు vs షియోమి 100W వైర్డు + 50W వైర్‌లెస్
డిస్‌ప్లే: రెండింటిలోనూ AMOLED, కానీ షియోమి అధిక బ్యాటరీ + సెకండరీ డిస్‌ప్లేతో ఆకర్షణ
షియోమి 17 సిరీస్ స్పెసిఫికేషన్లను బట్టి చూస్తే.. ఐఫోన్ 17కు గట్టి పోటీ ఇచ్చేలా ఉంది. ముఖ్యంగా బ్యాటరీ సామర్థ్యం, ఫాస్ట్ ఛార్జింగ్, లైకా కెమెరా, మ్యాజిక్ బ్యాక్ స్క్రీన్ వంటి ఫీచర్లు దీనిని ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి. సెప్టెంబర్ 30 తర్వాత ఈ సిరీస్ అంతర్జాతీయ మార్కెట్లలోకి రాగానే ఐఫోన్ 17ను ఎంతవరకు మించగలదో చూడాలి.












Click it and Unblock the Notifications