Youtube News:మానిటైజేషన్ రూల్స్ మారాయి..మీ ఛానెల్‌కి ఎసరు పడుతుందా? పూర్తి వివరాలు ఇవే!
Youtube New Monetization policy:యూట్యూబ్ క్రియేటర్లకు అలర్ట్! మీరు యూట్యూబ్ నుంచి డబ్బు సంపాదిస్తున్నారా? అయితే ఈ వార్త మీకోసమే.ఇందులో గుడ్‌న్యూస్ బ్యాడ్‌న్యూస్ రెండూ ఉన్నాయి. జూలై 15, 2025 నుంచి యూట్యూబ్ పార్ట్‌నర్ ప్రోగ్రామ్ (YPP) కింద మానిటైజేషన్ పాలసీల్లో కొన్ని కీలక మార్పులు రాబోతున్నాయి. ముఖ్యంగా, 'రీసైకిల్' చేసే వీడియోలు, AI ద్వారా ఆటోమేటిక్‌గా తయారయ్యే కంటెంట్‌కు చెక్ పెట్టడమే దీని ఉద్దేశం. ఈ కొత్త రూల్స్‌పై క్రియేటర్లలో చాలా కన్ఫ్యూజన్ ఉంది. వాటిపై యూట్యూబ్ ఏం చెప్పిందో చూద్దాం.
అసలు ఏం మారబోతోంది?
యూట్యూబ్ క్రియేటర్ లియైసన్ రెనీ రిచీ ఒక వీడియోలో చాలా క్లియర్‌గా వివరించారు. యూట్యూబ్ పార్ట్‌నర్ ప్రోగ్రామ్( YPP) పాలసీలు అప్‌డేట్ అవుతున్నాయని చెప్పారు. ఇది క్రియేటర్‌కు సంబంధించిన రియాక్షన్ వీడియోలు, క్లిప్పింగ్ ఛానెల్స్‌పై ప్రభావం చూపుతుందని కంగారు పడుతుంటే, అంత భయపడాల్సిన పని లేదని స్పష్టం చేశారు. ఇది ఎప్పటి నుంచో ఉన్న YPP పాలసీలకు చిన్న అప్‌డేట్ మాత్రమే అని ఆయన భరోసా ఇచ్చారు. ఈ మార్పుల ముఖ్య ఉద్దేశం ఏమిటంటే.. ఓ కంటెంట్ పెద్ద మొత్తంలో ఒకేసారి తయారయ్యిందా, లేక రిపీటెడ్‌గా ఉందా అని పసిగట్టడమేనట.

ముఖ్యమైన మార్పులు ఏంటంటే...
- మాస్ ప్రొడక్షన్, రిపీటెడ్ కంటెంట్: ఒకేసారి పెద్ద ఎత్తున తయారు చేసే కంటెంట్, అలాగే ఒకే విషయంపై పదేపదే వీడియోలు చేసేవాళ్లపై యూట్యూబ్ నజర్ వేస్తుంది. ఇవి ఇప్పటికే మానిటైజేషన్‌కు అనర్హం. ఇప్పుడు వీటిని మరింత కఠినంగా చూస్తారు.
- రియాక్షన్/కంపైలేషన్ ఛానెల్స్: మీరు వేరే వీడియోలపై రియాక్షన్ ఇస్తున్నా, లేదా వీడియోల క్లిప్స్‌తో కంపైలేషన్స్ చేస్తున్నా, వాటికి మీరు 'అర్థవంతమైన విలువ' (Meaningful Value) యాడ్ చేయాలి. ఎక్కడో దొరికిన క్లిప్‌లను తీసుకొచ్చి, వాటిని మళ్లీ యూజ్ చేస్తే కుదరదు. AI వాయిస్‌తో కేవలం వాయిస్ ఓవర్ ఇచ్చేస్తే లాభం లేదు.
- ట్యుటోరియల్స్/వ్లాగ్‌లు: ట్యుటోరియల్స్, వ్లాగ్‌లు చేసేవాళ్లు కూడా వేరే వీడియో క్లిప్స్ వాడినా, టెక్స్ట్-టు-స్పీచ్ వాయిస్‌లు వాడినా జాగ్రత్తగా ఉండాలి. మీ కంటెంట్‌కు మీ ప్రత్యేకత కనిపించాలి.
- AI-జనరేటెడ్ వీడియోలు: ఒకవేళ మీ వీడియోలు పూర్తిగా AI టూల్స్‌తోనే తయారైతే, మీకు మానిటైజేషన్ పర్మిషన్ పోయే ప్రమాదం ఉంది.
మారకుండా అలాగే ఉన్నవి ..
కొత్త రూల్స్ వచ్చినా, యూట్యూబ్‌లో మానిటైజేషన్‌కు కావాల్సిన బేసిక్ అర్హతలు మాత్రం మారవు.
- సబ్‌స్క్రైబర్లు: ఛానెల్‌కు 1,000 మంది సబ్‌స్క్రైబర్‌లు ఉండాలి.
- వాచ్ అవర్స్/షార్ట్స్ వ్యూస్: గత 12 నెలల్లో 4,000 గంటల పబ్లిక్ వాచ్ అవర్స్ ఉండాలి. లేదా గత 90 రోజుల్లో 10 మిలియన్ల షార్ట్స్ వ్యూస్ ఉండాలి.
- రియాక్షన్ ఛానెల్స్‌కు బ్యాన్ లేదు: రియాక్షన్, కంపైలేషన్ ఛానెల్స్‌ను పూర్తిగా బ్యాన్ చేయట్లేదు. కానీ, క్రియేటర్లు తమ వీడియోలకు ఏదో ఒక ప్రత్యేక విలువను (అంటే, మీ సొంత అభిప్రాయం, ఎడిటింగ్, విశ్లేషణ వంటివి) కచ్చితంగా జోడించాలి.
ఎందుకీ మార్పులు?
ఇటీవలి కాలంలో యూట్యూబ్‌లో 'ఫేస్‌లెస్' (ముఖం కనిపించని), AI-ఆధారిత ఛానెల్‌లు బాగా పెరిగిపోయాయి. ఇవి కంటెంట్ క్వాలిటీ కంటే, కేవలం వీడియోలు తయారు చేయడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఇలాంటి వాటిని తగ్గించి, నిజమైన టాలెంట్ ఉన్న, నమ్మకమైన, తమ అభిరుచితో వీడియోలు చేసే క్రియేటర్‌లకు మళ్లీ ప్రాధాన్యత ఇవ్వడమే యూట్యూబ్ లక్ష్యం అని చెప్తున్నారు.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్‌లోని క్రేన్‌కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!! -
Kavuri Sambasiva Rao: కావూరి సాంబశివరావు మృతి వార్తలు ? క్లారిటీ ఇదే..!












Click it and Unblock the Notifications