సంక్రాంతి విన్నర్ ఎవరో తేలిపోయింది.. చిరుకి షాకిచ్చిన యంగ్ హీరో..!!
తెలుగువారికి సంక్రాంతి అంటే కేవలం పండుగ మాత్రమే కాదు, థియేటర్ల వద్ద సినిమాల పండగ కూడా. ఈ ఏడాది పోటీ చాలా గట్టిగానే ఉంది. ప్రభాస్ 'ది రాజాసాబ్', మెగాస్టార్ క్లాసిక్ టచ్‌తో 'మన శంకరవరప్రసాద్ గారు', నవీన్ పొలిశెట్టి మార్క్ 'అనగనగా ఒక రాజు' వంటి సినిమాలు లైన్లో ఉన్నా.. ప్రేక్షకులు మాత్రం 'నారి నారి నడుమ మురారి' వైపే మొగ్గు చూపుతున్నారు.
అగ్ర హీరోల సినిమాలు బరిలో ఉన్నప్పటికీ, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో, వారిని కడుపుబ్బ నవ్వించడంలో 'నారి నారి నడుమ మురారి' అసలైన సంక్రాంతి విజేతగా నిలిచింది. చార్మింగ్ స్టార్ శర్వానంద్ తనదైన మేనరిజంతో బాక్సాఫీస్ వద్ద చేస్తున్న ర్యాంపేజ్ సృష్టిస్తున్నాడు. థియేటర్ల దగ్గర పరిస్థితి చూస్తుంటే 'బొమ్మ బ్లాక్‌బస్టర్' అని ఫిక్స్ అయిపోవచ్చు. సినిమా ప్రారంభం నుండి ముగింపు వరకు ఎక్కడా వేగం తగ్గకుండా దర్శకుడు రామ్ అబ్బరాజు మలిచిన తీరు అద్భుతం.

ముఖ్యంగా శర్వానంద్ కామెడీ టైమింగ్, భావోద్వేగాలను పండించిన తీరుకు ఫ్యామిలీ ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. థియేటర్ లోపల విజిల్స్, గోల చూస్తుంటే శర్వా మళ్ళీ తన ఫామ్‌లోకి పక్కాగా వచ్చేశాడని అర్థమవుతోంది. సినిమా టైటిల్‌కు తగ్గట్టే ఇద్దరు భామల మధ్య నలిగిపోయే మురారి పాత్రలో శర్వానంద్ ఒదిగిపోయారు. సమ్యూక్త మీనన్, సాక్షి వైద్య తమ అందచందాలతోనే కాకుండా, నటనతోనూ పోటీ పడ్డారు. ముఖ్యంగా శర్వా,సమ్యూక్తల మధ్య వచ్చే సీన్స్ యూత్‌ను ఆకట్టుకుంటుంటే, ఫ్యామిలీ ఎమోషన్స్ పెద్దలను కట్టిపడేస్తున్నాయి. విశాల్ చంద్రశేఖర్ సంగీతం ఈ సినిమాకు వెన్నెముకగా నిలిచింది.
ముఖ్యంగా యాజిన్ నిజార్ పాడిన మెలోడీలు, మాస్ బీట్స్ థియేటర్లలో ప్రేక్షకులను సీట్లలో కూర్చోనివ్వడం లేదు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాణ విలువలు సినిమాను విజువల్ వండర్‌గా మార్చాయి. మొత్తానికి ఐదు సినిమాల పోటీలో, కలెక్షన్లలోనూ, వినోదంలోనూ అగ్రస్థానంలో నిలిచి సంక్రాంతి విన్నర్ అనిపించుకుంది ఈ చిత్రం. బాక్సాఫీస్ వద్ద ఈ మురారి చేస్తున్న సందడి ఇప్పుడప్పుడే తగ్గేలా లేదు. ఈ సంక్రాంతికి ఫ్యామిలీతో కలిసి హాయిగా నవ్వుకోవాలి అనుకుంటే, 'నారి నారి నడుమ మురారి' బెస్ట్ ఛాయిస్.












Click it and Unblock the Notifications