Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అభిషేక్ శర్మ బ్యాట్‌లో స్ప్రింగ్.. ఆనాటి సీన్ రిపీట్! (వీడియో)

గౌహతి వేదికగా న్యూజిలాండ్ జట్టుతో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. అభిషేక్ బ్యాటింగ్ ధాటికి కివీస్ ఆటగాళ్లు నోరెళ్లబెట్టారు. మ్యాచ్ ముగిసిన తర్వాత న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్, డెవాన్ కాన్వే, జాకబ్ డఫీలు అభిషేక్ బ్యాట్‌ను పరిశీలిస్తూ నవ్వుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ దృశ్యం 2003 ప్రపంచకప్ ఫైనల్ నాటి 'రికీ పాంటింగ్ స్ప్రింగ్ బ్యాట్' పుకార్లను మరోసారి గుర్తుకు తెచ్చింది.

ఏమిటా 2003 స్ప్రింగ్ బ్యాట్ కథ?
2003 క్రికెట్ ప్రపంచకప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్ రికీ పాంటింగ్ భారత్‌పై 140 పరుగులు (నాటౌట్) చేసి మన ప్రపంచకప్ కలను ఛిన్నాభిన్నం చేశాడు. ఆ ఇన్నింగ్స్‌లో ఆయన కొట్టిన సిక్సర్లు చూసి, పాంటింగ్ బ్యాట్‌లో ఏదో 'స్ప్రింగ్' ఉందని, అందుకే బంతి అంత వేగంగా వెళ్తోందని అప్పట్లో పెద్ద ఎత్తున పుకార్లు షికారు చేశాయి. ఇప్పుడు అభిషేక్ శర్మ బ్యాటింగ్‌ను చూసి కివీస్ ఆటగాళ్లు కూడా సరదాగా అతని బ్యాట్‌ను చెక్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది.

abhishek sharma 14-Ball Fifty vs New Zealand Kiwis Players Inspect Bat Like Ricky Ponting Details

అభిషేక్ శర్మ మెరుపు ఇన్నింగ్స్
ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ కేవలం 20 బంతుల్లోనే 68 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కేవలం 14 బంతుల్లోనే అర్థసెంచరీ పూర్తి చేసి రికార్డు సృష్టించాడు. ఇది టీ20 ఇంటర్నేషనల్స్‌లో ఓ భారతీయ బ్యాటర్ సాధించిన రెండో వేగవంతమైన హాఫ్ సెంచరీ. ఈ విషయంలో యువరాజ్ సింగ్ (12 బంతుల్లో) మాత్రమే అభిషేక్ కంటే ముందున్నాడు.

కెప్టెన్ సూర్య కూడా తక్కువేం కాదు
మరోవైపు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా 57 పరుగులతో మెరుపులు మెరిపించాడు. వీరిద్దరి వీరబాదుడు ధాటికి 154 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం 10 ఓవర్లలోనే ఛేదించి, ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 3-0తో తిరుగులేని ఆధిక్యాన్ని సాధించింది.

టీ20 వరల్డ్ కప్ 2026 లక్ష్యంగా..
న్యూజిలాండ్ ఆటగాడు మార్క్ చాప్‌మన్ మాట్లాడుతూ, "అభిషేక్ బ్యాటింగ్ కేవలం పవర్‌ఫుల్ మాత్రమే కాదు, చాలా తెలివైనది కూడా. ఇలాంటి ఫామ్‌లో ఉన్న బ్యాటర్‌ను ఆపడం చాలా కష్టం" అని కొనియాడాడు. భారత్ తన తదుపరి లక్ష్యంగా ఫిబ్రవరి 7న ముంబైలో ప్రారంభం కానున్న ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ 2026 పై కన్నేసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+