అభిషేక్ కొట్టుడే కొట్టుడు- ఫాస్టెస్ట్ 50: ఆర్ష్‌దీప్ ఎక్స్ ట్రాల వర్షం
ఐపీఎల్ 2026లో భాగంగా పంజాబ్ కింగ్స్ తో తలపడబోతున్న సన్ రైజర్స్ హైదరాబాద్ జూలు విదిల్చింది. ధాటిగా ఆడుతోంది. ప్రత్యేకించి ఓపెనర్ అభిషేక్ శర్మ విరుచుకుపడుతున్నాడు. బౌలర్లకు చుక్కలు చూపెడుతున్నాడు. ఈ క్రమంలో ఫాస్టెస్ట్ 50 అందుకన్నాడు. 18 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడీ లెఫ్ట్ హ్యాండర్. అతని దెబ్బకు సన్ రైజర్స్ హైదరాబాద్ స్కోర్ బోర్డు పరుగులు పెడుతోంది. అభిషేక్ ఇన్నింగ్ లో ఆరు సిక్సర్లు, అయిదు బౌండరీలు ఉన్నాయి. మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్ సైతం చెలరేగుతున్నాడు.
న్యూ చండీగఢ్ మహారాజా యాదవీంద్ర సింగ్ స్టేడియంలో తొలుత బ్యాటింగ్ కు దిగింది సన్ రైజర్స్ హైదరాబాద్. తొలి ఓవర్ నుంచే ప్రతాపం చూపుతోంది. ఓపెనర్లు ధాటిగా ఆడుతున్నారు. ప్రత్యేకించి - అభిషేక్ శర్మ కరవుదీరా ఆడుతున్నాడు. అతని దెబ్బకు అర్ష్ దీప్ సింగ్ రెండు ఓవర్లలోనే 33 పరుగులు ఇచ్చుకున్నాడంటే బ్యాటింగ్ తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. బౌలర్లు జేవియర్ బార్ట్ లెట్, మార్కో జెన్ సెన్, విజయ్ కుమార్ వైశాఖ.. ఇలా ఏ ఒక్కరు కూడా వారిని కట్టడి చేయలేకపోతున్నారు.

అర్ష్ దీప్ సింగ్ మరీనూ. పూర్తిగా లైన్ అండ్ లెంగ్త్ మిస్ అయ్యాడు. బంతిని ఎక్కడ వేయాలో కూడా తెలియని గందరగోళంలో చిక్కుకున్నాడు. రెండో ఓవర్ లో వరుసగా మూడు బంతులు వైడ్ వేయడం దీనికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఆ ఓవర్ లో 10 బంతులు వేయాల్సొచ్చిందతనికి. ఓపెనర్ల దెబ్బకు పవర్ ప్లే ముగసేసరికి 105 పరుగులు చేసింది సన్ రైజర్స్ హైదరాబాద్. 17.50 యావరేజ్ ను నమోదు చేసింది.
సన్ రైజర్స్ హైదరాబాద్ తుదిజట్టులో- అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ (కెప్టెన్, వికెట్ కీపర్), హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా, అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, హర్ష్ దూబే, శివంగ్ కుమార్, హర్షల్ పటేల్, ఈషాన్ మలింగ ఆడుతున్నారు.
ఇంపాక్ట్ ప్లేయర్ ఎంపికలు: జయదేవ్ ఉనద్కత్, ప్రఫుల్ హింగే, లియామ్ లివింగ్‌స్టోన్, శివమ్ మావి, కమిందు మెండిస్
పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ 11లో- ప్రభ్ సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), ప్రియాంష్ ఆర్య, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), కూపర్ కొన్నోలీ, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సెన్, జేవియర్ బార్ట్‌లెట్, విజయ్‌కుమార్ వైశాఖ్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్ ఉన్నారు.
ఇంపాక్ట్ ప్లేయర్ ఎంపికలు: నేహాల్ వధేరా, విష్ణు వినోద్, సూర్యాంశ్ షెడ్గే, యష్ ఠాకూర్, హర్‌ప్రీత్ బ్రార్












Click it and Unblock the Notifications