Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పాకిస్తాన్ కు ఆసియాకప్ ఇచ్చేసిన ఏసీసీ ఛీఫ్..! భారత్ తో వివాదం వేళ..!

ఈ ఏడాది దుబాయ్, పాకిస్తాన్ వేదికలుగా నిర్వహించిన ఆసియా కప్ ట్రోఫీని టీమిండియా గెల్చుకుంది. ఫైనల్లో పాకిస్తాన్ ను చిత్తు చేసి ఈ ట్రోఫీ సాధించిన భారత్ దాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఛీఫ్ కూడా అయిన ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఛీఫ్ మొహసిన్ నక్వీ చేతుల మీదుగా తీసుకునేందుకు నిరాకరించింది. దీంతో ఆయన ఆసియా కప్ ట్రోఫీని తీసుకుని వెళ్లిపోయాడు. వాస్తవంగా భారత్ కు దక్కాల్సిన ఈ ట్రోఫీని తన చేతుల మీదుగా తీసుకునేందుకు నిరాకరించిందన్న కోపంతో యూఏఈ క్రికెట్ బోర్డు వద్ద ఉంచాడు. దీని కోసం భారత్ ఐసీసీ స్ధాయిలో లాబీయింగ్ చేసినా ఫలితం దక్కడం లేదు.

ఈ నేపథ్యంలో ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఛీఫ్ మరో ఆసియా కప్ ట్రోఫీని పాకిస్తాన్ జట్టుకు అందజేశాడు. తాజాగా ఖతార్ రాజధాని దోహాలో జరిగిన ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీ ఫైనల్లో పాకిస్తాన్ షహీన్స్, బంగ్లాదేశ్ ఏ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ షహీన్స్, బంగ్లాదేశ్ ఏ జట్టు కూడా 125 పరుగులు మాత్రమే చేయడంతో టై అయింది. ఈ దశలో నిర్వహించిన సూపర్ ఓవర్ లో బంగ్లాదేశ్ ఆరు పరుగులు చేయగా.. పాకిస్తాన్ షహీన్స్ జట్టు ఏడు పరుగుల లక్ష్యాన్ని ఛేదించి విజేతగా నిలిచింది. దీంతో ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ ట్రోఫీని దక్కించుకుంది. ఆ ట్రోఫీని మొహసిన్ నక్వీ పాకిస్తాన్ కెప్టెన్ ఇర్ఫాన్ ఖాన్ కు అందజేశాడు.

ACC Chief Mohsin Naqvi Honors Pakistan s Rising Stars Amid Seniors Trophy Row

పాకిస్తాన్ పై భారత్ ఆసియా కప్ ట్రోఫీని గెలిచినప్పుడు ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఛీఫ్ హోదాలో దాన్ని ఇచ్చేందుకు ముందుకొచ్చిన నక్వీ.. ట్రోఫీని టీమిండియా తీసుకోకపోతే మరో అధికారిని పిలిపించి అందజేయకుండా అలాగే దాన్ని పట్టుకుపోయాడు. ఇప్పటికీ దాన్ని టీమిండియాకు ఇవ్వడం లేదు. ట్రోఫీ కావాలంటే అధికారికంగా ఓ కార్యక్రమం ఏర్పాటు చేస్తే అక్కడ దాన్ని ఇచ్చేస్తానని ఆఫర్లు ఇస్తున్నాడు. కానీ పాకిస్తాన్ గెల్చుకున్న ట్రోఫీని మాత్రం వారికి సగౌరవంగా అందించాడు. దీనిపై భారత అభిమానులు మండిపడుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+