ఐపీఎల్ వేలం వేళ- తడాఖా చూపిన కావ్యా పాప డ్రీమ్ ప్లేయర్..!!
IPL 2026 Auction: ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తోన్న ఐపీఎల్ మినీ ఆక్షన్ కు గడువు సమీపించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని అబుదాబి వేదికగా ఈ నెల 16వ తేదీన జరగనుందీ బిగ్ ఈవెంట్. రెండు రోజుల పాటు కొనసాగుతుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:30 గంటలకు అబుదాబిలోని ఎతిహాద్ అరేనాలో ప్రారంభమవుతుంది. మొదట క్యాప్డ్, ఆ తర్వాత అన్ క్యాప్డ్ ప్లేయర్ల వేలం పాటను నిర్వహిస్తారు ప్రజెంటర్లు.
ఈ పరిస్థితుల మధ్య సన్ రైజర్స్ హైదరాబాద్ డాషింగ్ ఓపెనర్ ఇషాన్ కిషన్ ఫుల్ ఫామ్ లోకి వచ్చేశాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భగంగా పుణె మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జార్ఖండ్, మధ్యప్రదేశ్ మధ్య జరిగిన మ్యాచ్ లో దుమ్మురేపాడు. ఈ పోరులో జార్ఖండ్ ఒక పరుగు తేడాతో మధ్యప్రదేశ్‌ను ఓడించింది. జార్ఖండ్ కేప్టెన్ ఇషాన్ కిషన్ మెరుపు బ్యాటింగ్‌తో జట్టును ముందుండి నడిపించాడు.

టాస్ గెలిచిన మధ్యప్రదేశ్ కేప్టెన్ రజత్ పటిదార్ బౌలింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన జార్ఖండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. ఓపెనర్‌గా ఇషాన్ కిషన్ 30 బంతుల్లో 63 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 5 సిక్సులు, 4 ఫోర్లున్నాయి. అనూకుల్ రాయ్ 21 బంతుల్లో 29 పరుగులు చేశాడు. మధ్యప్రదేశ్ బౌలర్లలో వెంకటేష్ అయ్యర్- 3, త్రిపురేష్ సింగ్- 2 వికెట్లు పడగొట్టారు. మంగేష్ యాదవ్, శివం శుక్లా, రాహుల్ బాథమ్ తలో ఒక వికెట్ పడగొట్టారు.
182 పరుగుల లక్ష్యంతో ఛేదనకు దిగిన మధ్యప్రదేశ్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 180 పరుగులు మాత్రమే చేసి ఒక పరుగు తేడాతో ఓటమిపాలైంది. మధ్యప్రదేశ్ తరఫున హర్‌ప్రీత్ సింగ్ భాటియా 77 పరుగులతో నాటౌట్‌గా నిలిచినా, జట్టును గెలిపించలేకపోయాడు. జార్ఖండ్ బౌలర్లలో సుశాంత్ మిశ్రా, బాలకృష్ణ తలో వికెట్ పడగొట్టారు. బౌలింగ్‌లో మెరిసిన వెంకటేష్ అయ్యర్ బ్యాటింగ్ లో విఫలం అయ్యాడు. 9 బంతుల్లో 8 పరుగులకే రనౌట్ అయ్యాడు.
ముస్తాక్ అలీ టోర్నమెంట్ లో ఇషాన్ కిషన్ పరుగుల వరద పారించాడు. ఇప్పటివరకు ఎనిమిది ఇన్నింగ్స్ ఆడిన ఈ SRH బ్యాటర్.. 381 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. యావరేజ్ 54.42. 195.38 స్ట్రైక్ రేట్ తో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. మొత్తం 21 సిక్సులు, 40 ఫోర్లు బాదాడు. ఇదే దూకుడు, ఫామ్ ను ఐపీఎల్ లోనూ కొనసాగించాలని సన్ రైజర్స్ హైదరాబాద్ మేనేజ్మెంట్ కోరుకుంటోంది. ఈ సీజన్ కోసం ఎస్ఆర్ హెచ్ అతన్ని రిటైన్ చేసుకున్న విషయం తెలిసిందే.
-
ఈసారి IPL 2026 Opening Ceremony లేదా ? ఏం జరుగుతోంది ? -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..!












Click it and Unblock the Notifications