ఏడేళ్ల చిన్నారి క్రికెట్ ఆడితే తప్పా?.. జర్నలిస్ట్ కిడ్నాప్! ఇదెక్కడి దారుణం!
ఆటపాటలతో గడపాల్సిన ఏడేళ్ల వయసులో.. అద్భుతమైన క్రికెట్ నైపుణ్యంతో ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచింది ఐనా వజీర్. అయితే ఆమె టాలెంట్‌ను ప్రపంచానికి చాటినందుకు ఓ జర్నలిస్ట్ కిడ్నాప్‌కు గురవ్వడం.. బహిరంగ క్షమాపణలు చెప్పాల్సి రావడం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. పాకిస్థాన్‌లోని ఉత్తర వజీరిస్థాన్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన అక్కడి ఇస్లామిక్ ఛాందసవాదుల తీరును ఎండగడుతోంది.
The bright Ayena Wazir is the daughter of Shaheed Umar Gul, a dedicated teacher who was martyred in military custody just months ago.
— Mohsin Dawar (@mjdawar) February 19, 2026
Her strength and talent stand as a living testament to his legacy. https://t.co/yDMCvZokk9 pic.twitter.com/Qj3hB0CyZw
వైరల్ వీడియో.. వెల్లువెత్తిన ప్రశంసలు
ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతానికి చెందిన ఏడేళ్ల ఐనా వజీర్.. తన గ్రామంలోని అబ్బాయిలతో కలిసి క్రికెట్ ఆడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆమె బ్యాటింగ్, బౌలింగ్ చూసి నెటిజన్లు ఫిదా అయ్యారు. పాకిస్థాన్ సూపర్ లీగ్ ఫ్రాంచైజీ పెషావర్ జల్మీ ఛైర్మన్ జావేద్ అఫ్రిది ఆమెను 'అసాధారణ ప్రతిభావంతురాలు' అని కొనియాడారు. ఆమెకు అవసరమైన క్రికెట్ కిట్ అందించడమే కాకుండా.. రాబోయే 'జల్మీ ఉమెన్స్ లీగ్'లో చోటు కల్పిస్తామని హామీ ఇచ్చారు.

వెంటాడిన వివాదం.. జర్నలిస్ట్ అపహరణ
ఐనా వజీర్ ప్రతిభ ఆన్‌లైన్‌లో ప్రశంసలు పొందుతున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ఆడపిల్లలు క్రికెట్ ఆడటం 'ఇస్లామిక్ విలువలకు, పష్తూన్ సంప్రదాయాలకు' వ్యతిరేకమని భావించిన స్థానిక తీవ్రవాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐనా వజీర్ వీడియోను తీసిన సిటిజన్ జర్నలిస్ట్ జాఫ్రాన్ వజీర్‌ను ఉగ్రవాదులు కిడ్నాప్ చేసినట్లు సమాచారం. అనంతరం ఆయనతో బలవంతంగా ఒక క్షమాపణ వీడియోను రికార్డ్ చేయించి విడుదల చేశారు. "నేను చేసిన పని తప్పని తెలుసుకున్నాను. ఇస్లామిక్ విలువలకు విరుద్ధంగా ఇటువంటి వీడియోలు తీయడం తప్పు. ఇకపై ఇలాంటివి చేయను" అని ఆ జర్నలిస్ట్ ఆ వీడియోలో పేర్కొన్నారు.
Ayena Wazir.
— Mohsin Dawar (@mjdawar) February 18, 2026
Shewa, North Waziristan.
A child with a fast bowler’s fire. pic.twitter.com/86CaGtAYBd
మౌనంగా ఉండం: క్రీడాకారిణి మరియా తూర్పాకాయ్
ఈ ఘటనపై పాకిస్థాన్ స్క్వాష్ క్రీడాకారిణి మరియా తూర్పాకాయ్ వజీర్ తీవ్రంగా స్పందించారు. "వజీరిస్థాన్ అమ్మాయిలకు ఆశలు కల్పించినందుకు జర్నలిస్టును కిడ్నాప్ చేసి క్షమాపణ చెప్పించారు. కానీ మేము మౌనంగా ఉండం. ప్రతి అమ్మాయికి ఆడే హక్కు ఉంది" అని ఆమె స్పష్టం చేశారు.
Zafran Wazir was abducted by the Taliban in Waziristan for filming Aina Wazir playing cricket—forced to apologize for giving hope to girls across the Pakhtun belt.
— Maria ToorpakaiWazir (@MariaToorpakai) February 20, 2026
But we will not be silenced.
Proud to be from Waziristan. Proud to keep fighting so every girl is Free to Play. pic.twitter.com/ZPITh456dd
ఐనా వజీర్ నేపథ్యం
ఐనా వజీర్ తండ్రి ఉమర్ గుల్ ఒక ఉపాధ్యాయుడు. ఆయన కొన్ని నెలల క్రితమే సైనిక కస్టడీలో మరణించారు. కేవలం మూడేళ్ల వయసు నుంచే ఐనాకు క్రికెట్ అంటే ప్రాణం. తన గ్రామంలో ఐదుగురు సభ్యులతో కూడిన జట్టుకు ఆమె కెప్టెన్ కూడా. యుద్ధాలు, డ్రోన్ దాడులు, రాత్రిపూట కర్ఫ్యూలు ఉండే ఉద్రిక్త ప్రాంతంలో ఉంటూ కూడా ఆమె తన అభిరుచిని వదులుకోలేదు.
-
మన వాయుసేనలో పాక్ గూఢచారి: దేశ భద్రతను పాకిస్థాన్‌కు తాకట్టు -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
ప్రపంచంలోనే అత్యంత 'చెత్త' దేశంగా పాకిస్థాన్ రికార్డు.. -
భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన పాకిస్థాన్..! ట్రంప్ సమక్షంలో..! -
నన్ను లొంగదీసుకోవడానికి నా భార్యను.. 30 నిమిషాలు పాటు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు











Click it and Unblock the Notifications