పిల్లాడయ్యా.. ప్రెజర్ పెట్టి సంపేత్తారా ఏందీ?

Aisa Cup 2025 final: ఊహించినట్టే.. ఆసియా కప్ 2025 ఫైనల్స్ లో పాకిస్తాన్ అడుగు పెట్టింది. భారత్ ను ఢీకొట్టబోతోంది. టైటిల్ కోసం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఈ రెండు జట్లు తలపడనున్నాయి. భారత కాలమానం ప్రకారం ఈ రాత్రి 8 గంటలకు మ్యాచ్ ఆరంభమౌతుంది. ఈ టోర్నమెంట్ లో భారత్- పాకిస్తాన్ ఎదురెదురు పడటం ఇది మూడోసారి. లీగ్స్, సూపర్ 4 దశలో టీమిండియాదే పైచేయి.

ఫైనల్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో తలపడేందుకు సన్నద్ధమౌతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో టీమిండియా గాయలు కలకలం రేపుతోంది. శ్రీలంకతో జరిగిన సూపర్ 4 మ్యాచ్‌లో ఇద్దరు కీలక ఆటగాళ్లకు గాయాలవడం జట్టులో ఆందోళన నెలకొంది. శ్రీలంక బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, బ్యాటర్ అభిషేక్ శర్మ కండరాల నొప్పితో మైదానం వీడిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని భారత బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్ ధృవీకరించారు కూడా. వారిద్దరూ కండరాల నొప్పితో బాధపడుతున్నట్లు తెలిపారు.

All Eyes on Suryakumar Yadav R Ashwin s Support Leading Up to Asia Cup Final vs Pakistan

మరోవంక సూర్యకుమార్ యాదవ్ కూడా ఫామ్ లో లేడు. ఈ టోర్నమెంట్ లో ఒక్క భారీ ఇన్నింగ్ కూడా ఆడలేదీ కేప్టెన్. ఆసియా కప్‌లో ఇప్పటివరకు అయిదు ఇన్నింగ్స్‌లలో 71 పరుగులు మాత్రమే చేశాడు. ఫైనల్‌లో పాకిస్తాన్‌తో తలపడనున్న నేపథ్యంలో అతనిపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. అందరి చూపూ సూర్యకుమార్ మీదే నిలిచింది. ఫైనల్ లో అయినా చెలరేగుతాడనే అంచనాలను పెట్టుకున్నారు అభిమానులు.

ఈ పరిస్థితుల్లో మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ అతనికి మద్దతుగా నిలిచాడు. సూర్యకుమార్ యాదవ్ జట్టుకు విజయాన్ని అందించగలడని అభిప్రాయపడ్డాడు. ఫామ్ లో లేకపోవడం వల్ల సహజంగా ఏ క్రికెటర్ పై అయినా ఒత్తిడి ఉంటుందని, దీనికి సూర్యకుమార్ యాదవ్ కూడా అతీతుడేమీ కాదని చెప్పాడు. వీటిని పట్టించుకోకుండా తనదైన శైలిలో ఆడాలని, దూకుడుగా వ్యవహరించాలని సూచించాడు.

తన సొంత యూట్యూబ్ లో ఓ వీడియోను పోస్ట్ చేశాడు అశ్విన్. కేప్టెన్‌గా సూర్యకుమార్ డేంజరస్ గేమ్ ఆడుతున్నాడని, అది అద్భుతంగా ఉందని, అదే దూకుడును కొనసాగించాలని వ్యాఖ్యానించాడు. ఎప్పుడూ ఒకే స్థానంలో కాకుండా వేర్వేరు స్థానాల్లో బ్యాటింగ్‌కు రావడం అనేది మంచి పరిణామమని పేర్కొన్నాడు. రోహిత్ శర్మ కూడా తన వికెట్ గురించి ఆలోచించకుండా దూకుడుగా ఆడేవాడని, సూర్య కూడా దాన్నే అనుసరిస్తున్నాడని గుర్తు చేశాడు.

Take a Poll

సూర్య బ్యాటింగ్ యావరేజ్ తక్కువే అయినా అతని స్ట్రైక్ రేట్ 170కి పైగా ఉంటేనే బాగుంటుందని అశ్విన్ చెప్పాడు. తక్కువ స్ట్రైక్ రేట్‌తో 40 పరుగులు చేసే దానికంటే మంచి స్ట్రైక్ రేట్ తో తక్కువ పరుగులు చేసినా ఫర్వాలేదని, అది తోటి బ్యాటర్ లో జోష్ నింపుతుందని అన్నాడు. భారీ ఇన్నింగ్ ఆడాలని సూర్యకుమార్ యాదవ్ పై ఒత్తిడి చేయడం సరికాదని తేల్చి చెప్పాడు. టీ20ల్లో దూకుడు స్వభావం, ధాటిగా బ్యాటింగ్ ఆడటం అవసరమని పేర్కొన్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+