Zimbabwe: జింబాబ్వే మరో పెను సంచలనం..! సూపర్ 8కు ముందే షాక్..!

భారత్-శ్రీలంక వేదికలుగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ (t20 world cup 2026)లో ఇవాళ మరో పెను సంచలనం నమోదైంది. ఇప్పటికే సూపర్ 8 కోసం 8 జట్లు అర్హత సాధించిన నేపథ్యంలో ఇక మిగిలిన గ్రూప్ దశ మ్యాచ్ లకు ప్రాధాన్యం లేకుండా పోయిందని భావిస్తున్న తరుణంలో ఈ సంచలనం చోటు చేసుకుంది. గ్రూప్ దశలో ఇప్పటికే ఆడిన అన్ని మ్యాచ్ లూ గెలిచి సూపర్ 8లోకి దూసుకెళ్లిన జింబాబ్వే (Zimbabwe)జట్టు.. ఇవాళ మరో అనూహ్య విజయం సాధించింది.

గ్రూప్ బీలో భాగంగా ఇవాళ కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో ఆతిథ్య శ్రీలంక (sri lanka) జట్టును ఏడు వికెట్ల తేడాతో జింబాబ్వే చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంకను 7 వికెట్లకు 178 పరుగులకే కట్టడి చేసిన జింబాబ్వే.. అనంతరం లక్ష్య చేధనలో దుమ్ము రేపింది. మరో మూడు బంతులు మిగిలి ఉండగానే కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి 182 పరుగులు సాధించి విజయపతాకం ఎగురవేసింది. తద్వారా వరల్డ్ కప్ లో తమను లైట్ తీసుకోవద్దని అగ్రశ్రేణి జట్లకు హెచ్చరికలు పంపింది.

T20 World Cup Shocker Undefeated Zimbabwe Stun Hosts Sri Lanka before Super 8

తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టులో నిస్సంగ 62 పరుగులు, పవన్ రత్నాయకే 44 పరుగులు చేశారు. మిగతా బ్యాట్స్ మెన్ విఫలం కావడంతో శ్రీలంక 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసింది. జింబాబ్వే బౌలర్లలో ముజరబానీ, ఇవాన్స్, క్రీమర్ తలో రెండు వికెట్లు తీశారు. అనంతరం 179 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వేకు ఓపెనర్లు బెన్నెట్, మరుమణి కళ్లు చెదిరే ఆరంభం ఇచ్చారు. తొలి వికెట్ కు 69 పరుగులు జోడించాక ఈ జోడీని వెల్లలగే విడదీశాడు. ఆ తర్వాత కూడా బెన్నెట్ జోరు కొనసాగింది. ఆ తర్వాత బుర్ల్ తో కలిసి పరుగులు రాబట్టి బెన్నెట్ అర్ధసెంచరీ చేశాడు. చివర్లో కెప్టెన్ సికందర్ రజా మెరుపులతో జింబాబ్వే 3 బంతులు మిగిలుండగానే ఆరు వికెట్లతో విజయం సాధించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+