Virat Kohli Birthday: ఒకే ఒక్కడు కోహ్లీ...లవ్ యూ విరాట్ - అనుష్క ఎమోషనల్..!!
టీమిండియా స్టార్ క్రికెటర్, కింగ్ కోహ్లీ ఇవాళ 35వ వసంతంలోకి అడుగు పెట్టాడు. అభిమానులు, క్రికెట్ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా చాలా మంది విషెస్ చెబుతున్నారు. కోహ్లీతో తమకున్న అనుబంధాన్ని ప్రతిబింబించేలా పోస్ట్ లు పెడుతున్నారు. కోహ్లీ సతీమణి అనుష్క శర్మ కూడా ఇన్ స్టా వేదికగా భర్తకు విషెస్ తెలిపింది. కోహ్లీ సాధించిన విజయాలను ప్రస్తావిస్తూ.. అతడిపై తనకున్న ప్రేమకు అక్షరరూపమిచ్చింది. ఆ ఎమోషనల్ పోస్టింగ్ వైరల్ అవుతోంది.
కోహ్లీ బర్త్ డే సెలబ్రేషన్స్:విరాట్ కోహ్లీ 35వ బర్త్ డే జరుపుకుంటున్నాడు. క్రికెట్ ఫ్యాన్స్..సెలబ్రెటీస్.. ఎందరో కోహ్లీని అభినందనలతో ముంచెత్తుతున్నారు. అయితే, అనుష్క ప్రత్యేకంగా కోహ్లీకి విషెస్ చెప్పారు. కోహ్లీ ప్రాముఖ్యతను చాటిచెబుతూ.. జీవితమంతా తననే ప్రేమిస్తానంటూ అనుష్క ఇన్ స్టా లో పోస్ట్ చేసింది. తామిద్దరూ కలిసి ఉన్న ఫొటోను యాడ్ చేసింది. కోహ్లీ నిజంగా అసాధారణమైన వ్యక్తి అని కితాబిచ్చింది. కొడుకుగా, భర్తగా, తండ్రిగా.. అన్ని పాత్రలలోనూ అసాధారణమేనంటూ పొగిడింది. ఈ జన్మంతా.. ఆ తర్వాత కూడా నీపై నాకున్న ప్రేమకు అంతులేదంటూ అనుష్క పేర్కొంది. అటు బర్త్ డే రోజున కోహ్లీ సెంచరీ చేస్తే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ సెంచరీల రికార్డ్‌ను సమం చేయనున్నారు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్ లో కోహ్లీ బర్త్ డే సెలబ్రేషన్స్ కొనసాగుతున్నాయి.

అనుష్క పోస్ట్ వైరల్:అనుష్క ఈ ప్రత్యేక సందర్భంలో ఇన్‌స్టాలో చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. తన జీవితంలోని ప్రతి పాత్రలో అక్షరాలా అసాధారణంగానే ఉంటాడు! కానీ ఏదో ఒక విధంగా నేను కూడా అతని అద్భుతమైన ప్రయాణంలో కొనసాగుతున్నా. నా ఈ జీవితంలో అంతకు మించి ప్రేమిస్తున్నా. అది ఏ రూపంలోనైనా, ఏదైనా కావచ్చు. లవ్ యూ విరాట్' అంటూ పోస్ట్ చేసింది. తన పోస్ట్‌లో కోహ్లీ గురించి ఓ ఆసక్తికరమైన ఫోటోను పంచుకుంది. అంతర్జాతీయ టీ20ల్లో ఒక్క బంతి కూడా వేయకుండా వికెట్ సాధించిన ఒకే ఒక్కడు విరాట్ కోహ్లీ అంటూ పోస్ట్ చేసింది. 2011లో ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో మొదటిసారి బౌలింగ్ చేసిన కోహ్లీ.. ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ కెవిన్ పీటర్సన్‌ను అవుట్ చేశాడు.
కోహ్లీ వ్యక్తిత్వం పై ప్రశంసలు:అయితే ఆ బాల్ వైడ్ వెళ్లగా.. ధోని అతన్ని స్టంప్ అవుట్ చేశాడు. దీంతో ఒక్క బాల్ వేయకుండానే వికెట్ సాధించిన బౌలర్‌గా కోహ్లీ నిలిచాడు. ఇలాంటి ఘనత ఇప్పటివరకు ఎవరూ సాధించలేదంటూ అనుష్క శర్మ తన భర్తపై ప్రేమను కురిపించింది. కాగా.. అనుష్క, విరాట్ 2017లో పెళ్లి చేసుకున్నారు. ఈ జంట జనవరి 2021లో తమ మొదటి బిడ్డను ఆహ్వానించారు. తమ ముద్దుల కూతురికి వామిక అని పేరు పెట్టారు. సినిమాల విషయాకొనిస్తే అనుష్క శర్మ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలయ్యే చక్దా ఎక్స్‌ప్రెస్‌లో కనిపించనుంది. ఈ సినిమా విడుదల తేదీని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications