బేబీ బంప్‌తో ప్ర‌త్య‌క్ష‌మ‌యిన అనుష్క శ‌ర్మ‌...!

విరాట్ కోహ్లీ- అనుష్క‌శ‌ర్మ దంప‌తులు మ‌రోసారి త‌ల్లిదండ్రులు కాబోతున్నార‌నే వార్త గ‌త కొంత‌కాలంగా మీడియాలో వినిపిస్తోంది. సోష‌ల్‌మీడియాలో కూడా ఈ విష‌యంపై వార్త‌లు చాలానే వ‌చ్చాయి. అయితే, తాజాగా అనుష్క‌శ‌ర్మ బెంగుళూరులోని ఓ హోట‌ల్‌లో బేబీబంప్‌తో ప్ర‌త్య‌క్ష‌మ‌య్యారు. దీంతో అనుష్క‌శ‌ర్మ మ‌రో బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. అయితే, ఈ విష‌యంపై వీరుష్క దంపతులు ఇప్ప‌టివ‌ర‌కూ అధికారికంగా ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేదు.

త్వ‌ర‌లో అభిమానుల‌తో గుడ్‌న్యూస్ పంచుకోనున్నారు : అయితే, గ‌తంలో ముంబైలోని ఓ మెట‌ర్న‌టి క్లినిక్ బ‌య‌ట క‌నిపించిన వీరుష్క దంప‌తులు త‌మ ఫోటోల‌ను తీయొద్దంటూ మీడియాను రిక్వెస్ట్ చేసిన‌ట్లు తెలిసింది. త‌మ రెండ‌వ బిడ్డ గురించి త్వ‌ర‌లోనే అధికారికంగా ప్ర‌కటిస్తామ‌ని చెప్పిన‌ట్లు స‌మాచారం. ఏది ఏమైనా త్వ‌ర‌లోనే విరుష్క దంపతులు గుడ్‌న్యూస్‌ను అభిమానుల‌తో పంచుకోనున్నారు.

Anushka Sharma with baby bump

2017లో ఘ‌నంగా పెళ్లిచేసుకున్నారు : విరాట్ కోహ్లీ, అనుష్క శ‌ర్మ 2017 లో ఎంతో ఘ‌నంగా పెళ్లి చేసుకున్నారు. పెళ్లి అయిన నాలుగేళ్ల‌కు 2021 జనవరిలో మొదటి బిడ్డకు జన్మనిచ్చింది అనుష్క‌శ‌ర్మ. విరాట్ కోహ్లి - అనుష్క జంట మొదటి సంతానం ఆడపిల్ల. వీరిద్ద‌రూ తమ కుమార్తెకు విరాట్ కోహ్లి, అనుష్క శర్మ పేర్లు కలిసేలా వామిక అనే పేరు పెట్టారు. ఇప్పుడు అనుష్క‌శ‌ర్మ‌రెండో బిడ్డకు జన్మనివ్వడానికి సిద్ధమైనట్లు స‌మాచారం. అయితే గతసారి మాదిరిగానే ఈసారి కూడా ఈ గుడ్ న్యూస్ ను కాస్తంత ఆలస్యంగా ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు మీడియా కోడై కూస్తుంది.

అయితే, అనుష్క మాత్రం ఈ మ‌ధ్య‌కాలంలో సినిమాల‌కు కాస్త దూరంగానే ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఆమె ఎక్కువ‌గా కూతురు వామిక‌కే త‌న స‌మ‌యం కేటాయిస్తున్నారు. కోహ్లీ, అనుష్క‌శ‌ర్మ త‌మ గారాల ప‌ట్టి వామిక‌ను మీడియాకు దూరంగా ఉంచుతున్నారు. వామిక ముఖాన్ని చూపే ఫోటోలు ఇప్పటి వరకు ఎక్కడా కనిపించకుండా జాగ్ర‌త్త‌ప‌డ్డారు ఈ జంట‌. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే విరుష్క దంపతులు తమ కుమార్తెకు సంబంధించి ఏ ఫోటోను ఇప్ప‌టివ‌ర‌కూ పోస్టు చేయ‌క‌పోవ‌డం విశేషం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+