టీమిండియాకు గుడ్ న్యూస్..అసలు మజా ఇప్పుడు కదా
భారత క్రికెట్ జట్టుకు గుడ్ న్యూస్ అందింది. డ్రీమ్11 స్థానంలో కొత్త జెర్సీ స్పాన్సరర్ కంపెనీ లభించింది. ఇకపై అపోలో టైర్స్ కొత్తగా భారత జట్టుకు జెర్సీని స్పాన్సర్ చేయనుంది. ఈ మేరకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డుతో ఒప్పందాన్ని కుదుర్చుకోనుంది. ఈ ఒప్పందం 2027 వరకు అమల్లో ఉంటుంది. ఆ తరువాత పరిస్థితులను బట్టి దీన్ని పొడిగించుకోవాలా? వద్దా? అనేది నిర్ణయం తీసుకుంటుంది అపోలో టైర్స్ యాజమాన్యం.
బెట్టింగ్ యాప్‌లను కేంద్ర ప్రభుత్వం నిషేధించిన నేపథ్యంలో- బీసీసీఐ డ్రీమ్11తో ఉన్న ఒప్పందాన్ని రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. దీని తర్వాత కొత్త స్పాన్సరర్ కోసం బిడ్డింగులను ఇదివరకే ఆహ్వానించింది. రియల్ మనీ గేమింగ్ ప్లాట్‌ఫామ్, క్రిప్టో కంపెనీల దరఖాస్తులను బీసీసీఐ నిషేధించింది. ఆసక్తిగల సంస్థలకు ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ దాఖలు చేయాలని సూచించింది. బిడ్స్ దాఖలు చేయడానికి చివరి తేదీ.. నేటితో ముగిసింది.

ఈ క్రమంలో నిబంధనలకు అనుగుణంగా, అత్యధిక మొత్తాన్ని కోట్ చేసిన అపోలో టైర్స్ కు కొత్త జెర్సీ స్పాన్సర్ షిప్ లభించింది. డ్రీమ్11 గతంలో చెల్లించిన మొత్తం కంటే ఎక్కువను ఇవ్వనుందీ కంపెనీ. డ్రీమ్11 అప్పట్లో నాలుగు కోట్ల రూపాయలను చెల్లించింది. ఇప్పుడు అపోలో టైర్స్ ఒక్కో మ్యాచ్‌కు 4.5 కోట్లు రూపాయలను బీసీసీఐకి చెల్లిస్తుంది. భారత అంతర్జాతీయ క్రికెట్ షెడ్యూల్ దృష్ట్యా.. తమ కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభిస్తుందని అపోలో టైర్స్ యాజమాన్యం పేర్కొంది.
ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్‌లో టీమిండియాకు ఎటువంటి స్పాన్సర్ లేడనే విషయం తెలిసిందే. ఫలితంగా- జెర్సీలో కొన్ని మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి. కేప్టెన్ సూర్యకుమార్ యాదవ్, శుభ్‌మన్ గిల్ వంటి ఆటగాళ్ల జెర్సీలపై ఇండియా లోగో మరింత పెద్దదిగా, స్పష్టంగా కనిపించింది. దాదాపుగా వీటిని బ్లాంక్ జెర్సీలుగా చెప్పుకోవచ్చు. ప్రధాన టోర్నమెంట్లలో భారత ఆటగాళ్లు టైటిల్ స్పాన్సర్ లేకుండా ఆడటం ఇదే మొదటిసారి కాదు. ఐసీసీ ఈవెంట్లలో టైటిల్ స్పాన్సర్‌లను అనుమతి ఉండదు.
ఇప్పుడా ఇబ్బంది ఉండదు. జెర్సీ మరింత ఆకర్షణీయంగా కనిపించబోతోంది. అపోలో టైర్స్ అడ్వర్టయిజ్మెంట్ మరింత అందంగా దీనిపై ముద్రించనుంది బీసీసీఐ. మొన్నటివరకు కొనసాగిన డ్రీమ్11 జెర్సీలను మరిపించేలా అపోలో టైర్స్ యాజమాన్యం.. సొంత బ్రాండింగ్ తో కొత్త జెర్సీలను డిజైన్ చేయించబోతోన్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications