స్టార్ హీరోయిన్‌తో కలిసి కెమెరాకు చిక్కిన క్రికెటర్! (వీడియో)
ఐపీఎల్ 2026 సీజన్లో అదరగొడుతున్న పంజాబ్ కింగ్స్ స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్, మైదానంలోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ వార్తల్లో నిలుస్తున్నాడు. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో జరగబోయే తదుపరి మ్యాచ్ కోసం పంజాబ్ ఢిల్లీ చేరుకుంది. ఈ క్రమంలో ఢిల్లీ ఎయిర్పోర్టులో అర్ష్‌దీప్ సింగ్ తన గర్ల్‌ఫ్రెండ్, ప్రముఖ నటి సమ్రీన్ కౌర్‌తో కలిసి కెమెరాకు చిక్కారు. వీరిద్దరూ చేతిలో చేయి వేసుకుని నడుస్తున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
ఢిల్లీ ఎయిర్‌పోర్టులో జట్టు సభ్యులతో కలిసి అర్ష్‌దీప్ సింగ్ కనిపించినప్పుడు ఆయన వెంట సమ్రీన్ కౌర్ కూడా ఉన్నారు. అర్ష్‌దీప్ టీమ్ ట్రావెల్ కిట్‌లో ఉండగా.. సమ్రీన్ వైట్ టాప్, జీన్స్ ధరించి స్టైలిష్‌గా కనిపించారు. అంతకుముందు ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా సమ్రీన్ కౌర్ వాంఖడే స్టేడియం గ్యాలరీలో కనిపించి సందడి చేశారు. హిందీ, పంజాబీ మ్యూజిక్ వీడియోలు, సినిమాల ద్వారా సమ్రీన్ కౌర్ ఇప్పటికే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

పంజాబ్ జట్టులో కీలక ఆటగాడిగా..
మైదానంలో అర్ష్‌దీప్ సింగ్ ప్రదర్శన విషయానికొస్తే.. ముంబై ఇండియన్స్‌పై అద్భుతంగా రాణించాడు. 4 ఓవర్లలో కేవలం 22 పరుగులు మాత్రమే ఇచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుత ఐపీఎల్ 2026 సీజన్‌లో ఇప్పటివరకు 6 మ్యాచ్‌లు ఆడిన అర్ష్‌దీప్ సింగ్ మొత్తం 6 వికెట్లు సాధించాడు. పంజాబ్ కింగ్స్ బౌలింగ్ విభాగంలో కీలకమైన డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌గా అర్ష్‌దీప్ సింగ్ జట్టుకు వెన్నుముకగా నిలుస్తున్నాడు. మరోవైపు పంజాబ్ కింగ్స్ జట్టు ఈ సీజన్‌లో అప్రతిహత విజయాలతో దూసుకుపోతోంది. ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో ఐదు విజయాలు నమోదు చేసి, పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. వర్షం కారణంగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరగాల్సిన మ్యాచ్ రద్దు కావడంతో ఒక పాయింట్‌ను పంచుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం ఐపీఎల్ 2026లో ఓటమి ఎరుగని ఏకైక జట్టుగా పంజాబ్ కింగ్స్ రికార్డు సృష్టించింది.
శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో, రికీ పాంటింగ్ కోచింగ్‌లో పంజాబ్ కింగ్స్ ఓ బలమైన శక్తిగా ఎదిగింది. ప్రభ్‌సిమ్రాన్ సింగ్, ప్రియాన్ష్ ఆర్య, కూపర్ కానోలీ వంటి యువ ఆటగాళ్లు నిలకడగా రాణిస్తుండటంతో జట్టుపై భారీ అంచనాలు ఉన్నాయి. వ్యక్తిగత ప్రతిభ కంటే జట్టు సమిష్టి కృషితో పంజాబ్ విజయాలు సాధిస్తోంది. ఇదే ఊపును కొనసాగిస్తే.. దాదాపు 19 ఏళ్లుగా ఊరిస్తున్న ఐపీఎల్ టైటిల్ కలను ఈసారి పంజాబ్ కింగ్స్ నెరవేర్చుకునే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications