India-Pakistan Final: పాక్ తో ఫైనల్ వేళ భారత్ కు అదొక్కటే టెన్షన్ ...!

దుబాయ్, అబుదాది వేదికగా జరుగుతున్న ఆసియాకప్ ఫైనల్ కు చేరుకుంది. ఇప్పటికే పైనల్ కు చేరుకున్న భారత్, పాకిస్తాన్ జట్లు భారత కాలమానం ప్రకారం రేపు రాత్రి 8 గంటలకు జరిగే ఫైనల్లో తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో ఇరు జట్ల బలబలాల గురించి చాలా మంది చర్చించుకుంటున్నారు. అయితే ఇందులో నిస్సందేహంగా ప్రస్తుతం భారత్ పాకిస్తాన్ కు అందనంత టాప్ లో ఉంది. బౌలింగ్, బ్యాటింగ్, పీల్డింగ్ విభాగాల్లో మెరుగ్గా కనిపిస్తున్న భారత్ కు ఇప్పుడు ఓ విషయంలో మాత్రం టెన్షన్ నెలకొంది.

ఆసియాకప్ టోర్నీకి ముందు పాకిస్తాన్ తో ఒక మ్యాచ్ ఆడేందుకే ఇష్టపడని పరిస్దితుల్లో ఉన్న భారత్ కు ఏకంగా మూడు మ్యాచ్ లు ఆడాల్సిన పరిస్దితి ఎదురైంది. ఇందులో ఇప్పటికే లీగ్, సూపర్ 4 మ్యాచ్ లు ఆడి వరుస విజయాలతో ఫైనల్ చేరుకున్న టీమ్ ఇండియా ఇప్పుడు ఫైనల్ లోనూ అదే ఊపు కొనసాగించి టైటిల్ ఎగరేసుకుపోతుందన్న అంచనాలున్నాయి. ఇలాంటి సమయంలో పాకిస్తాన్ తో ఫైనల్ టోర్నీల రికార్డు కలవరపెడుతోంది.

Asia Cup 2025 India s Weak Final Record Against Pakistan Sparks Concern Before Big Match

భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య గతంలో జరిగిన అన్ని మ్యాచ్ ల గణాంకాలు చూస్తే టీమిండియాదే పైచేయి అవుతోంది. అయితే పైనళ్ల విషయానికి వస్తే మాత్రం పాకిస్తాన్ కంటే భారత్ కాస్త వెనుకబడి ఉంది. ఇప్పటివరకూ భారత్-పాకిస్తాన్ మధ్య ఐదు టోర్నీల ఫైనల్స్ జరిగాయి. వీటిలో 1985 బెన్సన్ అండ్ హెడ్జెస్ కప్, 1986, 1994 ఆసియా కప్ లు, 2007 టీ20 వరల్డ్ కప్,, 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ ఉన్నాయి. ఇందులో భారత్ కేవలం 1985లో వరల్డ్ కప్, 2007లో టీ20 వరల్డ్ కప్ ఫైనల్స్ లో నెగ్గింది. మిగతా మూడు టోర్నీల ఫైనల్స్ లో పాకిస్తాన్ విజయం సాధించింది.

Asia Cup 2025 India s Weak Final Record Against Pakistan Sparks Concern Before Big Match

అయితే గత రికార్డుల సంగతి ఎలా ఉన్నా గత కొన్నేళ్లుగా టీ20ల్లో భారత్ ప్రదర్శన అత్యంత నిలకడగా ఉంది. గత టీ20ల్లో 38 టీ 20ల్లో భారత్ కేవలం మూడు మ్యాచ్ లు మాత్రమే ఓడింది. అంటే 90 శాతానికి మించిన విజయాల్ని సాధించింది. పాకిస్తాన్ తో మ్యాచ్ ల్ని చూసుకున్నా భారత్ దూకుడు చూస్తూనే ఉన్నాం. పాకిస్తాన్ పై గతంలోనూ వరల్డ్ కప్స్ లో తిరుగులేని రికార్డు ఉన్న భారత్ ఇప్పుడు ఆసియాకప్ ఫైనల్లోనూ హాట్ ఫేవరెట్ గానే బరిలోకి దిగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+