Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వీడియో: ఉద్వేగాన్ని దాచుకోలేకపోయిన బ్రియాన్ లారా, కార్ల్ హూపర్వీడియో: ఉద్వేగాన్ని దాచుకోలేకపోయిన బ్రియాన్ లారా

Shamar Joseph: కరేబియన్ వీరులు నిజంగా చరిత్ర సృష్టించారు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో అప్రతిహతంగా జైత్రయాత్ర సాగిస్తోన్న కంగారూలను మట్టికరిపించారు. బ్రిస్బేన్‌లోని గబ్బా స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో చిరస్మరణీయమైన విజయాన్ని అందుకున్నారు.

టెస్ట్ మ్యాచ్ గెలవడానికి 215 పరుగులు చేయాల్సిన దశలో ఆస్ట్రేలియాను కట్టడి చేయగలిగింది వెస్టిండీస్. 207 పరుగులకే ఆ జట్టు బ్యాటింగ్ ఆర్డర్ మొత్తాన్నీ కుప్పకూల్చింది. ఎనిమిది పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. రెండు టెస్ట్ మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను 1-1తో సమం చేసింది.

AUS vs WI 2nd Test: Brian Lara and Carl Hooper emotion after Shamar Joseph inspired epic victory

తొలుత బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్.. తొలి ఇన్నింగ్‌లో 311, రెండో ఇన్నింగ్‌లో 193 పరుగులు చేసింది. దీనికి ప్రతిగా ఆస్ట్రేలియా 289 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్‌ను డిక్లేర్డ్ చేసింది. ఈ మ్యాచ్ గెలవాలంటే రెండో ఇన్నింగ్‌లో 215 పరుగులను చేయాల్సి ఉన్నప్పటికీ.. ఆ టార్గెట్‌ను అందుకోలేకపోయింది. 207 పరుగులకు ఆలౌట్ అయింది.

వెస్టిండీస్ కొత్త కుర్రాడు షమర్ జోసెఫ్ ఈ మ్యాచ్‌లో హీరోగా నిలిచాడు. తొలి ఇన్నింగ్‌లో ఒక వికెట్ మాత్రమే పడగొట్టిన ఈ బౌలర్.. రెండో ఇన్నింగ్‌లో ఆస్ట్రేలియా బ్యాటర్ల నడ్డి విరిచాడు. నిప్పు కణికల్లాంటి బంతులను సంధించాడు. ఏడు వికెట్ల నేలకూల్చాడు. తొలి టెస్ట్‌లోనూ జోసెఫ్ అయిదు వికెట్లను తీసుకున్నాడు.

రెండో ఇన్నింగ్‌లో ఆస్ట్రేలియా స్కోరు 24 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా వికెట్‌ను తీసుకున్న జోసెఫ్.. ఇక వెనుదిరిగి చూసుకోలేదు. క్రమం తప్పకుండా వికెట్లను కూల్చాడు. లైన్ అండ్ లెంగ్త్ తప్పకుండా పదునైన బంతులను సంధించాడు. యార్కర్లు, ఇన్‌ స్వింగర్లు, అవుట్ స్వింగర్లతో వెస్టిండీస్ ఫాస్ట్ బౌలింగ్ సత్తా ఏమిటో ఆసీస్‌కు రుచి చూపించాడు.

AUS vs WI 2nd Test: Brian Lara and Carl Hooper emotion after Shamar Joseph inspired epic victory

ఉస్మాన్ ఖవాజా, కామెరాన్ గ్రీన్, ట్రావిస్ హెడ్, మిఛెల్ మార్ష్, అలెక్స్ క్యారీ, మిఛెల్ స్టార్క్, పాట్ కమ్మిన్స్, నాథన్ లియాన్, జోష్ హేజిల్‌వుడ్.. అతని బౌలింగ్ ధాటికి బలి అయినవారే. కామెరాన్ గ్రీన్, ట్రావిస్ హెడ్‌ను వరుస బంతుల్లో పెవిలియన్ దారి పట్టించిన తీరు మ్యాచ్‌కే హైలైట్. స్టీవ్ స్మిత్ ఒక్కడే చివరి వరకూ క్రీజ్‌లో నిలిచాడు. 91 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు.

దాదాపుగా 30 సంవత్సరాల తరువాత ఆస్ట్రేలియా గడ్డపై వెస్టిండీస్ ఈ చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది. దీనితో వారి ఆనందానికి హద్దుల్లేకుండా పోయింది. కామెంటరీ బాక్స్‌లో ఉన్న లెజెండరీ ప్లేయర్ బ్రియాన్ లారా.. డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్న కార్ల్ హూపర్ తమ భావోద్వేగాలను దాచుకోలేకపోయారు. కన్నీళ్లు పెట్టుకున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+