Ashesh Test.. తొలి మ్యాచ్ ఇడే ఆస్ట్రేలియా యోధులు వీళ్లే..!!
క్రికెట్ దిగ్గజాలు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య ప్రతిష్ఠాత్మక యాషెస్ పోరు ప్రారంభం కావడానికి ఇంకొక్క రోజే మిగిలివుంది. మొత్తం అయిదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ఇది. ఇందులో రెండు డే నైట్. ఆస్ట్రేలియా ఆతిథ్యాన్ని ఇస్తోంది. నెలన్నర రోజుల పాటు యాషెస్ సందడి కొనసాగుతుంది. ఈ నెల 21వ తేదీన అంటే శుక్రవారం ఉదయం 7:50 నిమిషాలకు మ్యాచ్ మొదలవుతుంది. పెర్త్ దీనికి వేదిక. ఇందులో విజయబావుటా ఎగురవేయడానికి రెండు జట్లు పూర్తిస్థాయిలో సన్నద్ధం అయ్యాయి. తొలి పోరాటానికి ఉవ్విళ్లూరుతున్నాయి.
దీని తర్వాత.. డిసెంబర్ 4వ తేదీన రెండో మ్యాచ్ జరుగుతుంది. దీనికి బ్రిస్బేన్ ఆతిథ్యాన్ని ఇవ్వనుంది. ఇది డే నైట్ గేమ్. అదే నెల 17, 26 తేదీల్లో మూడు, నాలుగు మ్యాచ్ లు అడిలైడ్, మెల్ బోర్న్ లల్లో షెడ్యూల్ అయ్యాయి. చివరి మ్యాచ్ జనవరి 4వ తేదీన సిడ్నీలో ఆరంభమౌతుంది. ఈ సిరీస్ హోరాహోరీగా కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో- తొలి పట్టు ఎవరు సాధిస్తారనేది ఆసక్తి రేపుతోంది.

ఈ పరిణామాల మధ్య తొలి గేమ్ లో తలపడబోయే తుదిజట్టు వెల్లడైంది. క్రికెట్ ఆస్ట్రేలియా కొద్దిసేపటి కిందటే ఈ జాబితాను ప్రకటించింది. కీలక మార్పులు ఇందులో కనిపించాయి. ఆల్‌రౌండర్ బ్యూ వెబ్‌స్టర్‌కు ఈసారి చోటు దక్కలేదు. ఇటీవల ఆడిన మ్యాచ్ లల్లో అద్భుతంగా రాణించినప్పటికీ.. అతన్ని పక్కన పెట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మర్నస్ లబుషేన్ తిరిగి జట్టులోకి వచ్చాడు. అతను మూడో స్థానంలో బ్యాటింగ్ కు దిగనున్నాడు.
కామెరాన్ గ్రీన్ కూడా టాప్ సిక్స్‌లో చేరాడు. ఇది జట్టుకు బలం అవుతుందనడంలో సందేహాలు అక్కర్లేదు. ఈ మ్యాచ్ తో ఇద్దరు కొత్త ప్లేయర్లకు జట్టులో చోటు దక్కింది. జేక్ వెదరాల్డ్, బ్రెండన్ డొగ్గెట్ అరంగేట్రం చేయనున్నారు. 2019 తర్వాత ఒకే టెస్ట్ జట్టులో ఇద్దరు కొత్త ఆటగాళ్లకు ఆస్ట్రేలియా అవకాశం ఇవ్వడం ఇదే మొదటిసారి. వీరిద్దరు ఎంత వరకు రాణిస్తారనేది వేచి చూడాల్సి ఉంటుంది.
ఆస్ట్రేలియా ప్లేయింగ్ 11లో.. జేక్ వెదరాల్డ్, ఉస్మాన్ ఖవాజా, మర్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్ (కేప్టెన్), ట్రావిస్ హెడ్, కామెరాన్ గ్రీన్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), మిచెల్ స్టార్క్, నాథన్ లియాన్, బ్రెండన్ డాగెట్, స్కాట్ బోలాండ్.. ఆడనున్నారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్‌స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications